APLatestNews.com top Banner
         
చంద్రన్నే గొప్ప కాదూ జగనన్నే, వీరితో చితికి పోదామా, కొత్త నీరు కు చోటు? - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
అన్ని జిల్లాల్లో, పార్టీలు లో మనసున్న మిత్రులు ఉన్నారు. వారి మాటల్లో వారి నాయకులు గురించి.

1. చంద్రన్నే గొప్ప. ఎందుకంటే , విషం ఎక్కుతుంది, పోతాం, అని చివరి దాకా మనకే తెలీదు, కామ్ గా స్మూత్ గా జరిగిపోద్ది నెప్పి లేకుండా. కేవలం తీస్తున్నప్పుడే తెలుస్తుంది, ఓహో కత్తి దిగిందా అని, అంత నేర్పు.

అన్న గారు ఎన్టీఆర్ ని చూసాం, ఆయన చివర లొ పడ్డ నరకయాతన చూశాం కదా. దోచిన ఆస్తులు అన్ని విదేశాల్లో నే, పక్క రాష్ట్రం ప్రాజెక్టులు లో , జనం కుళ్ళు కోకుండా. ఆ మనస్తత్వం, సౌలభ్యం జగన్ తో ఉండదు. మేము ఎప్పుడు జూ ఎన్టీఆర్ ని ఎదగనీయం, రానీయం మా వాడైనా.

2. జగనన్నే గొప్ప. చాలా కాలం తర్వాత, చివరికి వెన్నుపోటు తో చితికి చంపే చెడ్డ గుణం మాకు లేదు. ధైర్యంగా, చెప్పి లాక్కుని, తక్కువ కాలంలోనే రోడ్డు న వేస్తాం. జైల్లో ఉన్న అధికారులు, జైలు బైట ఉన్న, అన్న సాక్ష్యం చాలదా.

దొంగ బాబు లాగా అంతా విదేశాల్లో ఉండదు. ధైర్యంగా బెంగుళూరు హైదరాబాద్ లో ఎడుపలపాయ మంగళగిరి ఆస్తులు పాలెస్ లు. మాకున్న వి, చూసి జనం పొంగిపోవాలి.

మా ఇద్దరు అన్నల కుంటే చాలు, మా కడుపు నిండినట్టే. మా వర్గాలకు దోచి పెడటం లో ఇద్దరమూ ఒక్కటే. ఉచిత పధకాలతో జనాన్ని బురిడీ కొట్టీయడం లో మత్రం ఇద్దరు ఒకటే నంట. నిజాలు మీకే తెలుసు కదా.

మన మండలానికి, నాణ్యమైన నిమ్స్ లాంటి వైద్యం, గీతం లాంటి చదువు, ఇంతవరకు రాకపోవడం కు కారణం? ఆహార వస్తు రేట్లు నేలపైకి రాకపోవడానికి కారణం?

మరి ఈ ఇద్దరు చేతులతో నే, ఎల్లకాలం చితికి పోదామా. కొత్త నీరు కు చోటిద్దామా. కొత్త వారు కూడా దొంగ కావచ్చు, మరలా 5 ఏళ్ల తర్వాత మార్చేద్దాం.

అన్నా, అక్కా , ఆలోచన చెయ్యి నీ కుటుంబం నీ గ్రామం నీ జన్మభూమి భాగ్యం.

Dt : 10-Apr-2019, Upd Dt : 12-Apr-2019 , Category : Politics, Views : 140 ( id : 85 )
Tags : Andhra Election , Pavan , Chandra Babu , Jagan , KA Pal
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content