స్థానిక బీజేపీ టీడీపీ జనసేన భజన సంఘం నాయకుల తీరు మారదా? స్థానిక సమస్యలు పట్టవా? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,881,465; 104 తత్వాలు (Tatvaalu) and views 226,268.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

రాష్ట్ర బీజేపీ (ఇతర పార్టీలు కూడా) నాయకులారా, దయచేసి మన ప్రధాని మోదీ అమిత్ షా ఆశయాలు కు సహకరించరా? స్థానిక ప్రజలకు తోడుగా ఉండరా? తెలంగాణా బీజేపీ నుంచి పాఠాలు నేర్చుకోరా?

అన్ని జిల్లాలలోని పట్టణ గ్రామాల్లో ని నాయకులు కు, స్ధానిక సమస్యలు మరియు సోషల్ మీడియా వాడకం గురించి, దయచేసి ట్రైనింగ్ ఇవ్వలేరా? ఆన్లైన్ ద్వారా తేలిక కదా? రాష్ట్ర స్ధాయిలో ప్రకటనలు మాటల వలన, మనకు అసెంబ్లీ పార్లమెంటు సీట్లు రావు కదా? ఇన్నాళ్ళు చూసాము కదా?

రాష్ట్ర లేదా దేశ నాయకుల నిరంతర భజన తప్ప, స్థానిక సమస్యలు ప్రజలు అభివ్రుద్ది ఆత్మాభిమానం గురించి మాట్లాడరా, పాలక ప్రతిపక్షాలు?

మీ సొంత వ్యక్తిత్వముతో, ఆత్మాభిమానముతో, ఏ సేవ లేదా కార్యము మొదలు పెట్టరా? మీరు ఎన్నటికీ స్థానిక నాయకులు గా ఎదగరా?

ఒక సామాన్య కార్యకర్త ఎలా ఎంపీ అయ్యారో, మన సురేష్ గారిని చూసి నేర్చుకోరా? కష్టపడితేనే కదా తర్వాత గుర్తింపు గౌరవం?

కనీసం ప్రజలు ఎందుకు, మీ స్ధానికంగా పార్టీ ఉందని ఉపయోగం ఏమిటి అని, స్ధానిక అభివ్రుద్ది సమస్యలు అడగరేమని, ఒకరూ కృతజ్ఞతలు కలిగిన పౌరులు లేరా, అడగరా?

స్ధానికంగా ఎలా ప్రజలతో మెలగాలో స్ధానిక నాయకుల కు, నేర్పలేరా? మొన్న ఒక ఆర్టికల్ లో వివరంగా చెప్పాము. విలేఖరుల మాటలు వినరు కదా. రాష్ట్ర నాయకులు కు పంపాము, మార్పు లేదు.

జనసేన ఎటూ మారదు, అనుకోవడం అనవసరం. అభిమానులు ను, బాధ్యత గల కార్యకర్తలు గా మార్చుకోవడం, పవనన్నకు ఇన్నాళ్లు గా తెలీదు. కనీసం స్థానిక పేజీ లు కూడా సరిగ్గా లేవు.

టీడీపీ, మరలా కరణం లేదా ఆమంచి గార్లతో, నడిపిద్దాం అన్న ఆలోచన తో, ఇంకో నాయకుడిని ఎదగనీయదు, 10 ఏళ్లుగా చేతకాలేదు. వారి సోషల్ మీడియా చూడండి, ఇదేనా చంద్రన్న లోకేష్ పనితనం అనిపిస్తుంది.

ఉదాహరణకు చూడండి, ఈ చీరాల లేదా ఇతర అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ (ఇతర పార్టీల) పేజీలు. షుమారు ఓ 50 పోస్టులు ఉన్నాయి. BJP Chirala, TDP Chirala, Janasena Chirala, TDP Prakasam, Janasena Prakasam, BJP Prakasam.

అందులో ఒకటి అయినా, చీరాల ప్రాంత సమస్యలు గురించి ఉందా? చీరాల అభివృద్ధి గురించి, ఇంకా రావాల్సినవి ఉందా? చీరాల బీజేపీ నాయకులు గురించి ఉందా, ఫోటో నంబర్లు సేవలు ఉన్నాయా? బీజేపీ నాయకులు, కేంద్రం నుంచి చీరాల పరిసర ప్రాంతాల కు తెచ్చేది ఉందా?

స్ధానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే చేయని, అభివృద్ధి పనులు గురించి ఉందా? జనం గుసగుసలు, ఆమంచి లేదా కరణం గారికి, భయపడి లేదా లొంగి, సైలెంట్ గా ఉంటున్నారు, అన్న అపవాదులు, తుడిచి వేయలేమా?

ఊరక, ఇతర సమస్యలు లేదా నాయకుల గురించి పోస్టులు పెడితే లేదా షేర్ చేస్తే, చీరాలలో లేదా ఇతర అసెంబ్లీ సీట్లు లో, వచ్చే 100 ఏళ్ళు తర్వాత అయినా గెలుస్తారా? మొన్న ఎమ్మార్వో గారికి ఇచ్చిన అర్జీ, ఫోటోలు వీడియో కూడా పెట్టడం లేదంటే, పార్టీ అంటే అంత నిర్లక్ష్యమా లేక బద్దకమా లేక ఇతర భయమా?

కనీసం జిల్లా మరియు రాష్ట్ర నాయకత్వం, అప్పుడు అప్పుడు కలగ చేసుకుని, మీరు పట్టణ గ్రామాల్లో గత సంవత్సరం గా చేసిన సేవల, ఫోటోలు వీడియో లు, ఫేస్బుక్ లో కనపడాలి అని చెప్పరా? స్థానిక సమస్యలు జిల్లా, రాష్ట్ర సోషల్ మీడియాలో షేర్ చేయరా?

స్ధానికంగా నాయకులు కు అలాంటి ఆలోచన రాదా? అలాంటి వారు తప్ప మనకు దిక్కు లేదా? లేకపోతే పట్టణ నాయకత్వం, మారుస్తామని చెప్పే ధైర్యం మనకు లేదా? నిజమైన కార్యకర్తలు లేరా? అని బీజేపీ, జనసేన, టీడీపీ అభిమానులు, శ్రేయోభిలాషులు విస్తుపోతున్నారు, బాధపడుతున్నారు, మార్పు కోసం ఎదురుచూస్తున్నారు.

అన్ని పార్టీల రాష్ట్ర నాయకత్వం, నిద్ర లేవాలి. ప్రజలకు తోడుగా ఉండాలి. తమ పట్టణ గ్రామ సమస్యలు గురించి, రోజూ సోషల్ మీడియా పోస్టులే, ఆ పట్టణ నాయకుల పని తనానికి, ఆదర్శం కు, నిబద్ధత కు, పార్టీ క్రమశిక్షణ కు గీటురాయి కదా?

దయచేసి మోదీ అమిత్ షా లను, రాష్ట్రం లో మోసం చేయవద్దు. మిమ్మల్ని మీరు మోసము చేసుకోవద్దు. వారు దిగిపోతే, ఇక రాష్ట్రంలో బీజేపీ మరలా నిద్రావస్థలో కి వెళ్ళిపోతుంది, ఇక ఎన్నటికీ లేవదు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,881,465; 104 తత్వాలు (Tatvaalu) and views 226,268
Dt : 27-Oct-2020, Upd Dt : 27-Oct-2020, Category : Politics
Views : 878 ( + More Social Media views ), Id : 777 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : local leaders , bjp , tdp , janasena , bhajan sangham , talk local issues
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content