Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
వ్యాస లేదా గురు పౌర్ణమి రోజున మన ఇంటి గురువులను, మన ఆది ఆధ్యాత్మిక గురువులను తలచుకోవాలి, పూజించాలి, ఆరాధించాలి, క్రుతజ్ణత తెలియచెయ్యాలి. పౌర్ణమి, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం కు కూడా అనుకూలం.
మన భౌతిక ఆది గురువు లు, మన తల్లి దండ్రులు, వారికి పూజ చేయాలి ఆదరించాలి సేవించాలి. అది లేకుండా గుడి , పూజ నిష్ప్రయోజనం. అంటే, వారిని దూరంగా పెట్టి లేదా అనాధలుగా వదిలి, గురువే దైవం అంటే, సద్గురువులు ఎవరూ సంతోషించరు.
ఆధ్యాత్మిక ఆది గురువు లు వ్యాసుడు మరియు గీత చెప్పిన శ్రీకృష్ణుడు, ఇద్దరూ ఒకటే. వారిని స్మరిస్తూ జ్ఞానం పొందే దోవ, చూపమని వేడుకోవాలి. కోరికలు కోరకూడదు, కోరినా ఫలితం శూన్యం, మనకు గురు భక్తి లేనట్లే. మన పూర్వ జన్మ సుక్రుతం వల్ల, కొన్ని కోరికలు తీరతాయి, అద్రుష్టాలు కలుగుతాయి. పుణ్యం తీరగానే అవి దూరం అవుతాయి.
సద్గురువులు మార్గం చూపుతారు. దేవుని చేరే మార్గం(ఫలితం ఆశించని కర్మ , మనసు నియంత్రణ, భక్తి, అర్చన, జపం, ధ్యనం, తపం, ముక్తి). ఎటువంటి కోరికలు తీర్చరు, చరిత్రలో ఎన్నో ఉదాహరణలు.
తెలుగు గురువులు బ్రమ్మం గారికి, రాఘవేంద్రస్వామి కి మరియు వేమన గారికి, అలాగే షిర్డి సాయి బాబా గారికి, వారి గురువులు కఠోర సాధన మరియు పరీక్షల తర్వాత జ్ఞానం మాత్రమే ఇచ్చారు. గమనించాలి, వారు అష్ట అయిశ్వర్యాలు కోరలేదు మరియు ఇవ్వలేదు.
క్రృష్ణయ్య పాండవుల కోరిక తీర్చడానికి చక్రాయుధం వాడితే , అన్ని రోజులు యుద్ధం జరగదు, క్షణం లో ముగుస్తుంది. రాముని రామబాణం తో క్షణం లో యుద్ధం అయిపోదా? నైతిక కర్మ సాధన ముఖ్యం.
మన 10 వ తరగతి గురువు, ఏడాది పాఠం చెప్పి చదివించి, పరీక్ష కు నిలబెడతారు. అంతే కానీ, గురువు కాళ్ళు మీద పడి, బంగారు కిరీటం పెట్టి మేళ తాళం తో, లక్ష దీపాలు పెట్టి, ఊరంతా భోజనాలు తో ,10 వ తరగతి సర్టిఫికెట్ ఇవ్వమంటే, రోజులో లేదా నెలలో ఆయన ఇస్తారా? లేదు కదా.
బాగా చదువు, మననం చేయి, మార్చి లో బుద్ది గా పరీక్ష రాయి, ప్రభుత్వం విజయ పత్రం ఇస్తుంది, అని మాత్రమే అంటారు మంచి గురువు.
కొంత మంది దొంగ గురువులు , అంతా తాము చేసి, పత్రము ఇస్తాము అనే వారు కూడా ఉంటారు. దానివలన ప్రయోజనం శూన్యము, అలా తీసుకునే వారు అజ్ఞానం లో ఉన్న దొంగ శిష్యులు, వారు తర్వాత ఇబ్బంది లో పడతారు.
అలాగే, ఏ సద్గురువు కూడా, తాను దైవం అని, శిష్యుల/భక్తుల కోరికలు తీరుస్తాను అని, తనను పూజించమని చెప్పరు. అలా చెపితే వారు దొంగ సాధువులు/బాబాలు అవుతారు, తమలాంటి దొంగ భక్తులను మోసము చేస్తారు.
వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే|
నమో వైబ్రహ్మనిధయే శ్రీ వాసిష్ఠాయ నమోనమః ||
గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః|
గురుర్సాక్షాత్ పరబ్రహ్మః తస్మై శ్రీ గురవే నమః||
మన భౌతిక ఆది గురువు లు తల్లి దండ్రులకు ప్రణామాలు, మనసా వాచా కర్మణా!
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2222 General Articles and views 2,493,619; 104 తత్వాలు (Tatvaalu) and views 267,411
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments