Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
Song Spirit - Vedam Anuvanuvuna Naadam - Sagara Sangamam - Kamal Haasan, Jayaprada, Shailaja, Geetha, Viswanath
మాత్రుదేవో భవా.., పిత్రు దేవో భవా.., ఆచార్య దేవో భవా.., అతిథి దేవో భవా అన్న మన సంస్కారం నేడు ఏమైంది?
ఎవరైతె విషయ పరిఙ్ఞానమును ఆమూలగ్రము పొందారో, మంచి పనుల చేత సిధ్ధులయ్యారో, వారియొక్క కీర్తికి ముసలితనము, మరణము వలన కలిగెడి భయము లేదు.
ఇది కదా, మనము అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం వదలి, మోక్షం ముక్తి బతికి ఉండగానే పొందండి అని 5 ఏళ్ళు పైగా మిమ్మల్ని అందిరినీ తలవంచి నమస్కరించి బతిమాలుతూ ఉన్నది? మీ మనసులు కరగావా, ఎన్ని జన్మలు ఎత్తినా?
పంట పండించడములో ఉన్న సుఖం, రైతుకు మాత్రమే తెలుసు. సంగీత సామ్రజ్యాన్ని ఏలే వారికి, దానిలో ఆనందం తెలుసు.
అలాగే కుల మత బేధాలు లేకుండా, సొంత ఆసక్తితో గురువు పై నమ్మకముతో, మాత్రు పిత్రు ఆచార్య దేవోభవ అంటూ, వేదాలను పురాణాలను అవపాసన పట్టి, దానిని ఆచరణలో రోజు చూపుతూ, మాటలు పాటలు పద్యాలు శ్లోకాల స్వచ్చమైన ఉచ్చారణతో పలికే వారికి తెలుసు, అది వారి పంచ ప్రాణము, వారిలో అణువు అణువున నిండి ఉంది అని.
అలాగ తమ జీవితాన్ని తరింప చేసుకునే వారికి, జీవితమే చిర నర్తనమాయె, పదములు తామే పెదవులు కాగా, గుండియలే అందియలై మ్రోగా అన్నట్లు గా ఉంటుంది. మన చుట్టూ ఉన్న వారు, మన ఆత్మ బంధువులే, ఆడా మగా బీద ధనిక అన్న బేధభావం ఉండదు.
భక్తి భావముతో పంచభూతాలకు నమస్కరిస్తూ, ఈ జగమంత కుటుంబం మాది అంటూ, తమ జీవితాన్ని గడిపే వారికి, ఎదురాయె గురువైన దైవం - మంచి గురువు లేదా శిష్యుడు తనంతట తానే వ్యక్తపరుస్తారు, అప్పటి నుండి వారి ఎదలో మొదలాయె మంజీర నాదం. గురుతాయె కుదురైన నాట్యం, గురుదక్షిణై పోయె జీవం - తమ సర్వస్వం ఆ గురువు/ శిష్యునికే. నటరాజ పాదాల తల వాల్చనా, నయనాభిషేకాల తరియించనా అంటూ వారు నిరంతరము కన్నీటితో తోటి మనసులను, గురువులను, శిష్యులను ఆదరిస్తారు.
గా.. మా.. నీ.., గమగస, మగస, గస, నీ..సా.., నిదమగ
దమగ, మగ, సరీ.సా.నీ
గమగ , గమాగ, మదామ, దనీద, నిసానిరీ..
వే.దం.., అణువణువున నా.దం. 2
నా పంచ ప్రాణాల, నాట్య వినోదం..
నాలో రేగే నెన్నో, హంసా నంది రాగాలై..
వే.దం.., వేదం అణువణువున నా.దం...
సాగర సంగమమే., ఒక యో.గం...
నిర సని దమ గా.., గద మగ రిసనీ.., నిరిసని దమగా..
మదనిసరీ సగారి, మగదమ గమద నిసాని, దనిమద గమ రిగస
సాగర సంగమమే., ఒక యో.గం...
క్షార జలధులే, క్షీరములాయె..
ఆ మధనం, ఒక అమృత గీతం
జీవితమే, చిరనర్తనమా.యె.
పదములు తా.మే., పెదవులు కా.గా. 2
గుండియలే, అందియలై, మ్రోగా
వే.దం.., అణువణువున నా...దం.
మాత్రుదేవో భవా.., పిత్రు దేవో భవా..,
ఆచార్య దేవో భవా.., ఆచార్య దేవో భవా..,
అతిథి దేవో భవా.., అతిథి దేవో భవా...
ఎదురాయె, గురువైన దై.వం, మొదలాయె మంజీర నా.దం
గురుతాయె కుదురైన నా.ట్యం, గురు దక్షిణై పోయె జీ.వం
నటరాజ పాదాల తల వాల్చనా, నయనాభిషేకాల తరియించనా 2
సుగమము, రసమయ
సుగమము, రసమయ, నిగమము భరతముగా...
వే.దం.., అణువణువున నా.దం.
నా పంచ ప్రాణాల, నాట్య వినోదం..
నాలో రేగే నెన్నో, హంసా నంది రాగాలై..
వే.దం.., వేదం అణువణువున నా.దం...
జయంతి తే సుకృతినో రససిధ్ధాః కవీశ్వరాః |
నాస్తి తేషాం యశః కాయం, జరా మరణజం భయం ||
నాస్తి, జరా మరణజం భయం 2
తాత్పర్యము: ఎవరైతె విషయ పరిఙ్ఞానమును ఆమూలగ్రము పొందారో, మంచి పనుల చేత సిధ్ధులయ్యారో, వారియొక్క కీర్తికి ముసలితనము, మరణము వలన కలిగెడి భయము లేదు.
రచయిత - వేటూరి
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2268 General Articles and views 2,584,996; 104 తత్వాలు (Tatvaalu) and views 276,091
Dt : 21-Jul-2023, Upd Dt : 21-Jul-2023, Category : Songs
Views : 664
( + More Social Media views ), Id : 1847
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
Vedam ,
Anuvanuvuna ,
Naadam ,
Sagara ,
Sangamam ,
Kamal ,
Haasan ,
Jayaprada ,
Shailaja ,
Geetha ,
Viswanath
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments