ట్రంప్ గారికి ఢోకా లేదు, సొంత జనం, ఆదరణ - నవంబరు 2020 లో అధ్యక్ష ఎన్నికలు - America/ NRI
           
మిగతా వార్తలనూ విషయాలను చదవగలరు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1522 General Articles, 51 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

ట్రంప్ గారికి ఢోకా లేదు, సొంత జనం, ఆదరణ, సహకారం పెరుగుతుంది. ఆయన మాటలకు చేతలకు, స్ధానికులు ముగ్ధులు అవుతున్నారు. సరిహద్దు గోడ, స్ధానికులకు ఉద్యోగాలు, కఠిన నిర్ణయాలు అమలు, ఆయనను ప్రత్యేక వ్యక్తి గా నిలబెడుతున్నాయి. ఆయన రిపబ్లికన్ పార్టీని, మన బీజేపీ తో పోల్చవచ్చు. ఆయన ఎలక్షన్ ముందు చెప్పినవి, తప్పక చేస్తున్నారు. ఆయన స్వతహాగా రాజకీయ నాయకుడు కాదు, కాబట్టి మాటలు చేతలు, ఒకటే గా ఉంటాయి.

మన దేశములో బీజేపీ నిర్ణయాలు కొన్ని కష్టం గా కనిపించినా, అవి దేశ శ్రేయస్సు కు ఎంతో ఉపయోగం. మనకు తెలుసు కదా, మోడీ ట్రంప్ ఎంత మంచి స్నేహితులో.

ట్రంప్ గారి మాటలు ఎలా ఉంటాయి అంటే, కేసీఆర్ గారి మాటలు వింటే, ప్రజలు ఎలా ముగ్ధులు అవుతారో మైమరచి పోతారో, అలా ఉంటాయి. కేసీఆర్ మాటలు, ఆంధ్రా వారికి నచ్చుతాయా లేదా, అన్నది ముఖ్యం కాదు కదా తెలంగాణా ఎలక్షన్ లో. అవి తెలంగాణ ప్రజలకు నచ్చుతాయి అంతే. అలాగే ట్రంప్ గారి మాటలు కూడా.

ట్రంప్ గారు రాజకీయ నాయకులు లా, ఊసరవెల్లి లా మాటలు మార్చరు. చెప్పినదే చేస్తారు, అది ఎంత కష్టం అయినా, అని బలమైన నమ్మకం స్ధానికులు అయిన పౌరుల లో ఏర్పడింది.

కానీ కొంత వ్యతిరేక ఉంది, కానీ అది ఎంత వరకు అన్నది, నిర్ణయం చేయడం ఇప్పుడు కష్టం.

ఉదాహరణకు, మన దేశంలో నోట్ల రద్దు కు, జనం ఇబ్బందులు పడ్డారు అని, మన ప్రతిపక్షాలు గోల చేశాయి. కానీ తర్వాత ఎలక్షన్ లో, మోడీ గారు ఓడిపోలేదు. గెలిచారు. జనం మంచి గా అర్థం చేసుకున్నారు, నోటు రద్దు వలన ఇబ్బంది పడింది దేశ ద్రోహులు, టాక్స్ ఎగకొట్టే వారు, దొంగ వ్యాపారులు, స్మగ్లర్లు మాత్రమే అని.

అలాగే ట్రంప్ నిర్ణయాలు, దేశ శ్రేయస్సు కే, అని అందరూ భావించిన, ఆయన రెండో సారి గెలుపు చాలా తేలిక. మన భారతీయులు వీసాల గొడవకు, అమెరికా ఎలక్షన్ కు అసలు సంబంధం లేదు.

కరోనా సమయంలో కూడా, ప్రజలకు ఆర్థిక సహాయం చేసారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి తో పాటుగా, కరోనా సమయ అదనపు భృతి కూడా కల్పించారు.

కానీ కొన్ని రాష్ట్రలలో, ట్రంప్ గారి ప్రభావం, పని చేయదు. మనకు అంతే కదా, దేశమంతా మోడీ గెలిచినా, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం, కష్టం.

ఉదాహరణకు, ఎక్కువ జనాభా గల పెద్ద రాష్ట్రం కాలిఫోర్ణియా. ఇక్కడ అందరికీ ఉచిత వైద్యం, యూనివర్సల్ హెల్త్ కేర్ ఉంది, ఇంకా ఎన్నో సంక్షేమ పధకాలు ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడూ డెమోక్రాట్లు ( అంటే మన కాంగ్రెస్ తో పోల్చవచ్చు నేమో), అంటే ఒబామా గారి పార్టీ, గెలుస్తారు. కానీ ట్రంప్ గారు, అది వద్దు అంటారు.

కానీ వాగ్ధాటి లో దేశంలో, ట్రంప్ ని ఎదుర్కొనే నాయకులు లేరు, ప్రతిపక్షం లో. మన దగ్గర కూడా మోడీ కి, తగిన నాయకులు ప్రతి పక్షంలో లేరు కదా.

ఈ నవంబరు 2020 లో అధ్యక్ష ఎన్నికలు. అధ్యక్షుడు గా ట్రంప్ గారికి, రెండవ సారి పట్టాభిషేకమా లేక డెమోక్రాట్ల అభ్యర్థి, బైడెన్ గారికి పట్టాభిషేకమా తెలుస్తోంది. కానీ కాలీఫోర్ణియా లో మాత్రం లేదా అలాంటి కొన్ని రాష్ట్రాల లో, డెమోక్రాట్లు మాత్రమే గెలుస్తారు.

కరోనా సమయం కాబట్టి, బాలెట్ పత్రాలు ప్రజల ఇంటికి పంపుదాము, నవంబర్ లో అంటారు డెమోక్రాట్లు. అలా చేసిన, దొంగ ఓట్లు కు ఆస్కారం అని రిపబ్లికన్ ల వాదన. ఇది కూడా గెలుపు ను, మారుస్తోంది అని కొంత మంది విశ్వాసం.

చూద్దాం నవంబరు ఫలితం ఎలా ఉంటుందో. ఎందుకంటే అమెరికా లో ఏమి జరిగినా కూడా, ప్రపంచ ప్రజలు మొత్తం, తమ దేశంలో నే ఏదో జరుగుతున్న విధంగా చూస్తున్నారు కదా. అది వాస్తవం కూడా, అమెరికా అధ్యక్షుడు ను బట్టి, ఇతర దేశాల సంబంధ బాంధవ్యాలు మారతాయి.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1522 General Articles, 51 Tatvaalu
Dt : 05-Jul-2020, Upd Dt : 05-Jul-2020, Category : America
Views : 543 ( + More Social Media views ), Id : 591 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : trump , win , public support , popularity , presidential elections , nov , 2020 , usa , america

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content