దేవాలయాల విహార యాత్ర కు, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వము లో, భక్తుల నేటి భావన - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,680; 104 తత్వాలు (Tatvaalu) and views 226,441.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

To visit temples for fun, todays Devotees concept in Arishadvarga Ashtavyasana slavery

అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వము లో, దేవాలయాల విహార (తీర్ధ) యాత్ర కు, అంటే ఇలా ఉంది, వారి భావన నేడు చూద్దాము.

ముదుసలి తల్లి దండ్రులకు, అత్త మామలకు లేదా ఇతర ముదుసలి పెద్దలకు, సజీవ గురువు సేవ చేయని/ చేయలేని వారు, వారిలో అలాగే ఇతర మనుషుల్లో దైవాన్ని చూడలేని వారు, అలాగే తమ సంస్కార పిల్లల పెంపకం దగ్గర తమ ముదుసలి తనము లో దేవతలుగా సేవించబడతాము అని చెప్పలేని వారు, నక్క పాము పులికి ఓటు వేసేవారు, అప్పు చేసి పప్పుకూడు తింటూ ఇతర మానవులకు ఖర్చు రేట్లు (ఇళ్ళు/ ఆహారం/ వస్తువులు/ సేవలు) పెరిగే దోవకు కారణం అయినవారు, మానసిక బలం స్తిరత్వం, చిత్తశుద్ది లేని వారు అంతా, తమ పాపాల ప్రాయశ్చిత్తానికి మనశ్శాంతికి, 80 శాతం మంది దేవాలయాలకు పరుగులు తీస్తారు. ఇసకేస్తే రాలనంత మంది జనం.

ఆఖరికి మన ఎమ్మెల్యే, ఎంపీ, ప్రభుత్వ ఉద్యోగులు, బంధువులు, పిల్లలు/ పెద్దలు, స్నేహితులు కూడా, ఊరక కలవ నీయరు, కలవరు, ఫోన్ కూడా చేయరే. మరి మనకు వెళ్ళే అర్హత కూడా లేదు, నీతి మరియు ఓటు అమ్ముకున్నాక.

కానీ ప్రపంచానికే/ విశ్వానికే అధిపతి అయిన దేవుని దగ్గరకు, ఎటువంటి అర్హతలు లేకుండా, కనీసం చిత్తశుద్ది లేకుండా, ఎందుకో ఆ పరుగులు యాత్రలు వారికీ తెలీదు.

ధనం ఇస్తే, పూజారి క్షణములో పూజ చేసి, తమ పాపాలు అప్పటికప్పుడే అన్ని కడిగేస్తారు, రేపు కొత్త పాపాలు చేయవచ్చు అన్న మూర్ఖపు ఆలోచన. ఆఖరికి ఆ పూజారికీ దైవ అర్హత ఉండాలి.

అది అతని ఉద్యోగం/ వ్యాపారం అయితే, వ్రుధా. అదే అతని గుణం అయితే, కాస్త ఉపయోగం, మనకు బుద్ది చెపుతారు. అదే గీత చెప్పింది, గుణముని బట్టి ఎవరైనా సత్ బ్రాహ్మణుడు అని. పిల్లిని చంపిన ఖాతా వేరు, అక్రమార్జన తో దేవుని పూజ ఖాతా వేరు. ఉద్యోగములో 8 గంటలు పని చేయకుండా 4 గంటలు పని చేసినా, అది అక్రమార్జనే సుమీ.

మరి 20 కోట్లు పెట్టి కిరీటం చేయించిన ఆయన, జైలులో ఏడాది ఉన్నారు కదా? మరి ఆయన పాపాలు పోలేదు కదా? అంతకన్నా ఎక్కువ ధనం పదవి అధికారం మనకు ఉందా? ఉన్నా, దేవుని దగ్గర చెల్లని ది అని తెలియదా?

రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ లాంటి గొప్పవారు, మన ఇంట్లో అలాగే మన చుట్టుపక్కల వారు - వీరంతా పూజలు, యాత్రలు, ప్రార్ధనలు, దానాలు, సహాయాలు చేయలేదా? మరి ఫలితము?

మన పెళ్ళికి, ఉద్యోగానికి, పదవికి, వ్యాపారానికి అర్హతలు, వర్గం, అవసరం, అవకాశం కావాలి. మరి దేవుని దగ్గర ఎందుకు అంత చిన్న చూపు? అంటే మన కపట నటన 2 నాల్కల ధోరణి కనిపెట్టలేని వారు ఆయన, అని ఆ సర్వాంతర్వామిని అవమానిస్తున్నారా? అంటే ఇంకా అధిక పాపం, మనకు జమ అవుతుంది కదా?

భారతములో కధ గుర్తు ఉందా? నేడు చచ్చిన లేదా ఐస్ లో మాగేసిన జంతువుల శవాల మాంసము తిని, నాలిక రుచి బానిసత్వములో ఆనందించే వారు, రేపు బకాసురులు వంటి వారు వచ్చి, మీ ఇంటి నుంచి రోజుకో మానవ ప్రాణం కావాలి అది మా నాలుక రుచి అంటే, అయ్యో మనలాగే అతని నాలుకకు రుచి మనము ఇవ్వాలి అని పంపుతారా? జంతువులను ఎలా మనము నిర్ధాక్షిణ్యముగా వధించి తిన్నామో, ఆయనకు మనము మనస్పుర్తిగా మనల్ని అర్పిద్దాము అంటారా? అనకపోతే, 2 నాల్కలు కాదా, మనకో నీతి, బకాసురునికి ఒక నీతా? మరి వీరు దేవాలయమునకు, వెళితే ప్రయోజనము ఏమిటి?

అందుకే ప్రక్రుతి భీభత్సవాలు, మనల్ని అమాంతం మింగేస్తాయి. అప్పుడు మరలా, మనం చూడండి దేవుడు ఎంత నిర్దయుడో, మేము 10 మేకలు కోళ్ళు పందులు కుక్కలు తింటే, అది తప్పా? మమల్నే తినేస్తారా అంటారు అమాయకముగా.

ఏ జీవి అయినా, మన వలన ఎంత నిస్సహాయత స్తితిలో ప్రాణం మానం కోల్పోయిందో, దానికి కారణము అయిన ప్రతి ఒక్కరూ, అంటే కోసే వారు, అమ్మే వారు, తెచ్చే వారు, తినే వారు, పంచుకునే వారు, ప్రోత్సాహం చేసేవారు, తప్పు అని చెప్పనివారు, ఆ ఫలితాలను కూడా పంచుకోవాలి మిత్రమా. వీరికి భూత దయ, సేవ, కరుణ, జాలి లేవని నిరూపణ కదా? పంచభూతాల ధర్మ సమానత్వం అలా ఉంటుంది. సరే విహారయాత్ర వారి భావనలు చూడండి.

తమకు, తమ పిల్లలకు,

1* చెమట పట్టకూడదు, ఇరుకు గా ఎక్కువ సేపు ఉండలేరు - ఏసీ ఫాన్ తో విశాలముగా ఉండాలి, క్షణం లో అయిపోవాలి దర్శనం. వీలైతే తోసుకోవడం, గొడవలు, తగువులు.
2* ధనం లేదా రెకమెండేషను తో, దేవుని దర్శనాన్ని కొనే మూర్ఖులు.
3* కడుపు కాలకూడదు రోగం మానకూడదు అంటే ఆరోగ్యం నిలవకూడదు, ఉపవాసం అంటే తెలీదు.
4* కాళ్ళు కందకూడదు, వీరి జన్మలో 108 ప్రదక్షిణాలు ఉండవు, సాక్స్ లేకుండ అనడవరు. కరమాల చేతి వేళ్ళ లెక్క అంటే తెలీదు. మరలా వీసాకు లేదా ఏదైన అవసరానికి, చేస్తారు.
5* తుప్పు పట్టిన చెవులలో, సంగీత హెడ్ ఫోన్ లు వీడరు
6* బండ బారిన నోరు నాలిక మంత్రం పలక కూడదు, కానీ ఇతర చెత్త మాత్రం మాట్లాడుతూనే ఉంటాయి.
7* ఫోన్ లో మాత్రం తంత్రాలు పలుకుతాయి. ఫోన్ ఆపుకోలేని దౌర్భాగ్యులు.
8* సాంప్రదాయ బట్టలు తొడగకూడదు, నలగకూడదు. అర లాగులు చొక్కాలు, బొక్కలు ఉన్న బట్టలతో శరీర భాగాల ఫాషన్ షో అక్కడ కూడా.
9* దెయ్యాలకు భూతాలకు పోటీగా ఆ జుట్టు విరబోత, తల దువ్విన పాపాన కూడా పోరు. గాలికి ప్రసాదం లో లేదా ఇతరుల కళ్ళలో ఈ ఆణిముత్యాలు పడాలి.
10* కనపడేంత, సంస్కార పెంపక బొట్టు, ఉండకూడదు పిల్లలు పెద్దలు ఎవరికీ.
11* బోడి గుండు బట్టనెత్తి అంటే నామోషీ, మరలా టోపీ, ఇంకోటి కప్పుకోవడం.
12* మెడలో ఓ దేవుని దండ, మాల ఉండదు
13* గుడి ఖాళీగా ఉన్న సమయములో అసలు రారు, ఏరి కోరి కిక్కిరిసిన సమయంలోనే వస్తారు
14* నేతి లేదా నువ్వుల దీపారాధన చేయకూడదు, చెతులు రావు
15* మనం సంపాదించి బతకలేమని, ధనం పోసే, మామ గారింటికి వచ్చినట్లుగా, ఉత్త చేతులు ఊపుకుంటా వస్తారు, కనీసం ఫలాలు లేదా వండి నైవేద్యం తీసుకుని రారు. ధనం పారేస్తే చాలు అని అహంకారం. ఇంకొంతమంది అదీ లేదు, ఉచిత ప్రసాదం 2 గిన్నెలు మాత్రం తింటారు.
16* గంట సేపు, దేవుని దగ్గర ఉండకూడదు, ధ్యానంలో
17* కానీ కబుర్లు ఆడుకుంటూ, గంటల సమయం, బొజ్జ లావు పెంచే, భోజనం టిఫిన్ ప్రసాదం మాత్రమే కడుపులోకి.

ఇలా ఎన్నో మనము రాయవచ్చు. 80 శాతం మంది పిల్లలు పెద్దలు ఇలాగే లెక్క లేకుండా, దేవాలయాలను అపవిత్రము చేస్తూ, ఇంకా తమ పాప రాశిని పెంచుకుంటున్నారు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,680; 104 తత్వాలు (Tatvaalu) and views 226,441
Dt : 19-Aug-2023, Upd Dt : 19-Aug-2023, Category : General
Views : 202 ( + More Social Media views ), Id : 1883 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : visit , temples , fun , concept , Devotees , Arishadvarga , Ashtavyasana , slavery
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content