తిరుమలలో వెంకన్న, 10 రోజుల ఉత్తర ద్వారం, స్థానికుల ముక్కోటి దర్శనాలు, ధర్మమేనా? దూరం వారి ఇబ్బంది? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,881,843; 104 తత్వాలు (Tatvaalu) and views 226,345.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

ఏమండీ తిరుమలలో, 10 రోజుల ఉత్తర ద్వారం, స్థానికులకే కొంత శాతం (రోజుకు 10 వేల మంది అంటున్నారు) ముక్కోటి దర్శనాలు, అనడం సబబేనా ధర్మమేనా? దూరం నుంచి వచ్చే వారికి ఇబ్బంది కాదా?

జవాబు, అందుకే దేవాలయాలకు రాజకీయ నాయకులను దూరంగా ఉంచాలి, దేవాలయ పదవులు మెంబర్లు గా ఇవ్వకుండా. భక్తుల ఆధ్యాత్మిక భావాలు వేరు, రాజకీయ నాయకుల ఆలోచనలు వేరు, అవి కలవవు.

కనీసం, 2 ఏళ్ళు రాజకీయ వాసన లేని వారికే, ఏ దేవాలయ పదవైనా ఇవ్వాలి. ఇది రూల్ పెట్టాలి. చంద్రన్న ఆ పని చెయ్యలేదు, ఇంకా మెంబర్ల పదవీ కాలం తగ్గించి, ఎక్కువ మంది రాజకీయ నాయకుల, అపవిత్ర పాదాలకు అవకాశం ఇచ్చారు.

ఈ రోజు సెలబ్రెటీలు సినిమావారు నాయకులు, ఇతర మత గౌరవ ఫోటోలు పెట్టారు. ఒక్కరన్నా, వెంకన్న మరియు భగవద్గీత ఫోటోతో, ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పెట్టారా?

చాగంటి, గరికపాటి, జీయరు, మఠాధి పతులు, వీరు కదా పేరొందిన పెద్ద దేవాలయాలకు, చైర్మన్ మరియు మెంబర్లు గా ఉండాలి? ఈ పుణ్యాత్ములు కూడా అంగీకరించరు, ఆ పదవి తీసుకోవడానికి. ఆఖరుకు మేము కూడా తీసుకోము.

ఎందుకంటే, ఉత్సవ విగ్రహాలు లాగ, పైన మమ్మల్ని పెట్టి, రేపు మా ఎమ్మెల్యే అనుచరులు వస్తున్నారు, దర్శన అవకాశం ఇవ్వండి అంటే, మేము ఇవ్వక పోతే, వారు మమ్మల్ని పదవిలో ఉంచుతారా? దైవానికి సంబంధం లేని, వేరే ప్రభుత్వ కార్యక్రమానికి, టీటీడీ ధనం ఇవ్వము అంటే ఊరుకుంటారా? అందుకే, పుణ్యాత్ములు ఆ పదవులు తీసుకోరు, రాజకీయ ప్రాధాన్యము తగ్గినదాకా.

ఆంధ్రులమై ఉండి, అమ్మ నేను, 2014 నుంచి తిరుమలకు వెళ్ళలేదు, పెద్ద వెంకన్నను చూడటానికి. దూరపు జనాలు వస్తున్నారు, ఆయనకు నిద్ర చాలడం లేదు, గంట లోనే సుప్రభాతం పాడుతున్నారు అని కూడా ఒక కారణం.

తెనాలి వైకుంఠపురం లోనే, వారి తమ్ముడు చిన్న వెంకన్న ని కలిసి, మా బాధలు చెప్పుకున్నాము. పెద్దాయనకు చెప్పమన్నాము, ఆయన అలాగే అని చెప్పారు. ఎవరో ఒక ఎమ్మెల్యె, ఎంపీ, మంత్రి, చైర్మన్ ను అడిగితే, సహాయం చేసే వారేమో, కానీ మేము అడగము.

ఎందుకంటే, మేము ఇద్దరం స్వార్ధముతో తిరుమల తిరుపతి కి వెళితే వచ్చే పుణ్యం 1 కేజీ అయితే, దూర ప్రాంతం నుంచి వచ్చే ఇంకొకరికి, మేము వెళ్ళకుండా త్యాగం తో ఇచ్చే అవకాశం వలన వచ్చేది, 2 కేజీల పుణ్యం. ఏది ఎక్కువ? అవకాశం, అవసరం కన్నా, త్యాగం గొప్పది.

అది మనము అందరమూ ఎప్పుడో వదిలేశాము కదూ? దాని విలువ తెలీదు, అర్ధము కాదు.

బావాజీ, తన దగ్గరకు పాచికల ఆట కోసం వెంకన్ననే, తెచ్చుకున్నారు రప్పించుకున్నారు. మనం మారి, మన మనసును భగవంతుని కి, నైవేద్యం చేయాలి. అప్పుడు ఆయనే, మన వెంట వస్తారు.

స్థానికం గా అంటే, కేవలము కొండమీద తిరుమల వాళ్ళే, వస్తారు కదా? వారు ఎప్పుడూ చూస్తూనే ఉంటారు. తిరుపతి వారికి కింద, ఎన్ని గుళ్ళు లేవు? బస్సులో అరగంట, కొండ పైకి పోవాలా? దూరం నుంచి వచ్చే వారికి ఆపి, మన ఊళ్ళో 4 రోజులు కష్టాలు పడే విధంగా ఉంచి, మనము దర్శించుకుంటే, పుణ్యము వస్తుందా? పాపము వస్తుందా?

ముక్కోటి అంటే, ఒక రోజు మాత్రమే ఏకాదశి ఘడియలు ఉత్తర ద్వార దర్శనం, 10 రోజులు కాదు. అందరూ జనం రాలేదని చూడలేక పోయారు అని, 10 రోజులు మనము పెళ్ళి చేసుకుంటామా? 10 రోజులు భోజనాలు పెడతామా? అధికారం మన చేతిలో ఉంది అని, మన ఇష్టం వచ్చిన విధంగా చేస్తామా? పాపం మూట కట్టుకుంటామా?

కొంత మంది పీఠాధిపతులు ఒప్పుకున్నారు అంటున్నారు, మరి వారు ఎలా చెప్పారో, ఆ దేవ దేవునికే తెలియాలి. ఏకాదశి ఘడియలు పొడిగించవచ్చునా? అందరూ వైష్ణవ పెద్దలు ఒప్పుకుంటే, ఇక అదే కరెక్టు అవుతుంది ఏమో మరి.

మహాశివరాత్రి కి భక్తులకు దర్శనం కావడం లేదని సమయం చాలలేదని, శ్రీకాళహస్తి శ్రీశైలం కోటప్పకొండ అమరావతి ద్రాక్షారామం లో, శివరాత్రి ఘడియలు పెంచుదామా 4 రోజులు కు?

40 నిమిషాలు పాటు 33 కోట్ల దేవతామూర్తులకు, విష్ణువు దర్శనా భాగ్యం కల్పించారు అని కొందరు అంటున్నారు. దేవమానం ప్రకారం ఒక‌ రోజు, మానవ కాలం సంవత్సరంతో సమానం. అలా నాడు మహావిష్ణువు వైకుంఠంలో 40 నిమిషాలు దర్శనం కలిగింది, కనుక మానవకాలం ప్రకారం అది 10 రోజులతో సమానం అని కొందరు అంటున్నారు. మరి పెద్దలే చెప్పాలి ఏది నిజమో. ఏకాదశ నియమాలు తిధి దాటితే ఉండవు అంటారు.

మరి వైకుంఠములో రాజకీయ నాయకులు లేరు, రాజకీయాలు లేవు. మరి, దేవాలయ పదవుల నుంచి, రాజకీయ నాయకులను అందరినీ తొలిగిస్తారా? అన్యమతస్తులు వైకుంఠములో లేరు, మరి అన్ని దేవాలయాలలో, తొలగిస్తారా? ప్రభుత్వం వైకుంఠ ధనము ను తీసుకోకూడదు, దానిని దేవాలయ వ్యవస్థలో పాటించామా? వీటికి కూడా, పీఠాధిపతుల నుంచి రాత పూర్వకము గా తీసుకున్నారా? అవసరానికి అవకాశానికి, మనకు కావల్సిన మాట వరకే చూసుకుంటాము. ఆదాయం పెంచడానికి, ఈ మార్గం ఎంచుకున్నారా?

ఓట్లు వేయడానికి, ఒక్క రోజేనా? 10 రోజులు వద్దా? బాంక్ శని ఆదివారం తీస్తారా, జనానికి ఇబ్బంది ఉంది అంటే? రేషన్, నెల మొత్తము ఇస్తారా? ప్రజా దేవాలయం అస్సెంబ్లీ సమావేశాలు, నెల రోజులు వద్దా?

స్వామికి అసలే నిద్రలేదు, ఇతర ఆలయాలకు ఇంత తాకిడి ఉండదు, వారు 10 రోజులు తెరిచి ఉండవచ్చు. ఇక్కడ, అసలు 1 గంట తప్ప, స్వామిని నిద్ర పోనీయడం లేదు. మరి ఆయన విశ్రాంతి ఎవరికీ పట్టదా?

మరి ఆధ్యాత్మికము గా ఉత్తర ద్వారము అంటే, బ్రూమధ్యమని సహస్రారము తో దేవుని చూడాలని ఎప్పుడు, అందరికీ నేర్పుతాము.

మనము ఎన్ని ప్రకటనలు ఇచ్చినా ఎంత మొత్తుకున్నా, అస్సాం, రాజస్థాన్, డిల్లీ, తెలంగాణా, తమిళనాడు నుంచి, వచ్చే, చదువు రాని భక్తులకు తెలుస్తుందా? కనీసం మన ఆంధ్రా లో తెలుగు వారు కూడా, అది తెలీక వస్తారు. తెలిసినా, ఆగుతారా?

మా వూళ్ళో దేవుడు మా ఊరికే కావచ్చునేమో. కానీ బెజవాడ, తిరుపతి, శ్రీశైలం, భద్రాచలం, కాళహస్తి, యాదాద్రి, అన్నవరం, లాంటి పుణ్యక్షేత్రాల దేవుళ్ళు, మన అందరికీ. అక్కడ, స్థానిక హక్కులు మాట్లాడకూడదు, త్యాగ బుద్దితో, పెద్ద మనసుతో.

మన నాయకులు ఎంత మూర్ఖము గా, ఆలొచన చేస్తారు అంటే, కడప జిల్లా అంటే, దేవుని గడప. దానిని ఇప్పుడు, ఒక వ్యక్తి గడప గా మార్చడం, ఎంత వరకు సబబు? జిల్లా పేరులో దైవత్వం పోగొట్టడం కాదా?

మరి స్థానికం అని ఆలోచన చేసేటప్పుడు, బాపట్ల పార్లమెంట్ కు ఎందుకు, స్థానిక నాయకులకు ఎంపీ గా ఇవ్వలేదు, ప్రతి సారీ? బాపట్ల లో నేదురుమల్లి, ఎలా నిలబడ్డారు? చీరాలలో రోశయ్యగారు, ఎలా పోటీ చేసారు?

రాజకీయ భాషలో చెప్పాలి అంటే, మనము బుజ్జోడు చంద్రన్న మనవడు దేవన్ష్ ను లేదా జగనన్న పిల్లలను, మా బంధువు లకే చూపిస్తాము కలవనిస్తాము అనవచ్చు తప్పులేదు.

కానీ చంద్రన్న మరియు జగనన్న దగ్గర, ఆ మాట అనకూడదు. అది తప్పు, ఎందుకంటే, రాష్ట్రం మొత్తానికి కావాల్సిన నాయకులు వారు, అందర్ని కలవాలి.

తిరుపతి వెంకన్న, భారత ప్రజల, అందరి దేవుడు. విదేశాల నుంచి కూడా వస్తారు. స్థానిక హక్కులు మాట్లాడి, త్యాగం తో మనకు వచ్చే, పుణ్యాన్ని పోగొట్టుకోవద్దు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,881,843; 104 తత్వాలు (Tatvaalu) and views 226,345
Dt : 25-Dec-2020, Upd Dt : 25-Dec-2020, Category : General
Views : 927 ( + More Social Media views ), Id : 883 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : tirumala , tirupati , venkanna , 10 day , north gate , darshan , locals , correct , dharmam , problem , far away , non locals
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content