ఈ వారం ముచ్చట్లు - కరోనా, 3 రాజధానులు, నిమ్మగడ్డ, తెలుగు, యోగి, మోడి, ఇంకా ఎన్నో - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1247 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1277 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

కరోనా వచ్చింది, అని ఎవరినీ మనం తూలనాడకూడదు. అవతల వారు ఎంత పాపం చేసినా, వారి నుంచి మనం ఏది వ్యక్తి గతం గా ఆశించనంత వరకు, వారి పాపంకు మనకు సంబంధం లేదు, అందరి క్షేమం కోరాలి. అది జగన్, వీర్రాజు, పవన్, లేదా, చంద్రన్న గార్లు అయినా, మన వాళ్ళు అయినా. నాయకులు, అధికారులు అందరూ బాగుండాలి. మన రాష్ట్రం కు మంచి చేయాలి తమ వీలైనంత వరకూ.

పాలక, ప్రతి పక్షాలు బలంగా ఉండాలి. అమెరికా పార్లమెంటు లో చూడండి, ఇరు పక్షాలు, ప్రతి బిల్లుకు కూడా, గంటలు గంటలు వాదించి వాదించి, చివరకు విసుగు తలనొప్పి పుట్టి, ఇద్దరు కూ మధ్య మార్గం లో వెళతారు మార్పులు చేసి. మన దగ్గర, అధికారంలో ఎవరున్నా, రెండో వారికి వాదన అవకాశం తక్కువ.

* మూడు రాజధానులు వచ్చాయి అని సంబరాలు ఓ వైపు, అమరావతి రైతులకు న్యాయం జరగాలని నిరసనలు ఇంకోవైపు - పచ్చని పొలాల రైతులకు అన్యాయము చేసింది - బాబా, జగనా, మీరే చెప్పాలి * నిమ్మగడ్డ గారికి, రాష్ట్ర ఎన్నికల అడ్డా తిరిగి దక్కింది. * 5 లేదా 8 తరగతి దాకా, తెలుగు భాష ఉంటుంది పిల్లల కు, కేంద్రం. * మందు కోసం శానిటైజర్ తాగి శివైక్యం * బిజెపి సిన్సియర్ సీనియర్ నేత మాణిక్యాలరావు గారు శివైక్యం, వీర్రాజు గారు కన్నీళ్లు, ప్రభుత్వ లాంఛనాలతో

విలేఖరి గా ఎవరి మీదైనా, నాలుగు సెటైర్లు వేసినా, గట్టిగా అడిగినా, ఎప్పుడూ సంస్కార గీత దాటలేదు, దాట కూడదు. ఎవరైనా, తప్పు చూపిస్తే, సరిచేసుకున్నాము. వ్యక్తిగతంగా ఎవరిపై కోపం ఉండ కూడదు, అందరితో వినయంగా నవ్వుతూ కలవాలి. అందరూ ఒకటే.

రాజకీయాలలో, ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా, విషయవాసన అంటని వారు, ఉత్తములు, కాషాయం ధరించి పాలన చేస్తున్న గొప్ప వ్యక్తి, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి గారు. నాకు తెలిసి, పదవిలో ఉండి, అంత నిష్టగా ఉండేవారు, ఎవరూ లేరు మనదేశంలో. ఉంటే చెప్పండి. పెద్ద ఆస్తులు లేవు, చిన్న ఇల్లు మాత్రమే ఉందని విన్నాము.

ఆ తర్వాత మన ప్రధాని శ్రీ మోడీ గారు, ఆయనకు దుస్తులు పై మక్కువ ఇంకా ఉంది. కానీ, విదేశాల్లో గణనీయంగా పేరు పెంచారు, దేశం లో అవినీతి స్ధాయి, నల్ల ధనం తగ్గించారు నోట్ల రద్దు తో. 2000 నోటు మరలా తీసేస్తే, మరలా నల్ల ధనం తగ్గుతుంది. వీరిద్దరూ సంపూర్ణ ఆరోగ్యం గా ఉండాలి, మనకు రక్షణ, ఆదర్శము వీరు.

మన విజయసాయిరెడ్డి గారు, కరోనా విముక్తి కలిగి ఆరోగ్యం బాగయింది, భగవంతుని దయతో. కొంతమందికి ఆయన నచ్చినా నచ్చకపోయినా, కొన్ని మంచి లక్షణాలు ఒప్పకోవాలి. జగన్ తో ఇన్నాళ్ల బంధం చెప్పకోతగ్గది, జగన్ ని ఎవరైనా ఒకమాట అంటే, ఒంటికాలు మీద లేచి , ఎదుటివారి ని రెట్టింపు మాటలు అనకుండా దులపక వదలరు. మరి చంద్రన్న కు, అలాంటి నమ్మకమైన వ్యక్తి?

బాలినేని గారికి, మామూలు జ్వరం తగ్గింది అన్నారు దేవుడి అండతో, సౌమ్యంగా ఉంటారు ఎప్పుడూ, మాట తూలరు.

మా పెద్దాయన కరణం గారు ఆరోగ్యం గా, తొందరలోనే నియోజకవర్గం తిరిగి రావాలి, ప్రజలకు అండగా ఉండాలి, దేవుని అండతో. పెద్దాయన నవ్వుతూ పలకరిస్తారు అందరినీ, చంద్రన్న ను కూడా సుతిమెత్తగా విమర్శలు చేస్తారు. అలాగే ఉండాలి, పార్టీ మారినంత మాత్రాన, సంస్కారం దాటి, విమర్శలు చేయరాదు. ఆమంచి అన్న, ఈ విషయంలో మాత్రం మారాలి, జనము అంత మార్పు ఎందుకు కోరుకున్నారో, ఆవేశం తగ్గించి , ఆలోచన చేసి అందరిని కలుపుకుపోవాలి.

రేపు జగన్, చంద్రబాబు ఎదురు ఎదురు కలిసిన, నవ్వు కుంటారు, జోక్స్ వేసుకుంటారు. అనుచరులు లేదా ఇతరులు మాత్రం, ఎందుకు చొక్కాలు చింపుకోవాలి, మూతి కళ్ళు ఎర్రగా పెట్టుకుని. ఆలోచన చెయ్యండి, మీరూ కలసి హాపీ గా తిరగండి.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1277 General Articles, 47 Tatvaalu
Dt : 01-Aug-2020, Upd Dt : 01-Aug-2020, Category : Politics
Views : 319 ( + More Social Media views ), Id : 624 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : week bits , corona , 3 capitals , nimmagadda , telugu , yogi , modi , jagan , babu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content