తానా తందనా అనలేక వివాదాలు - జాతి తల దించుతున్నది, అధికార ధన అహంకారమా, సంస్కార పెంపకమా? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,165; 104 తత్వాలు (Tatvaalu) and views 226,399.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Tana tandana analeka vivaadaalu - jati tala dinchutunna, dhana ahankaram, samskara pempakam

Tana Tandana Analeka Controversies - Race is lowering its head, is it pride of power, money, or culture?

*ప్రశ్న/ స్పందన - ఏవండీ, మీరు తెలుగు సంఘాల, కపట నటన వ్యాపార రాజకీయ తత్వం గురించి బాగా రాశారు. 20 ప్రశ్నలు అడిగారు షుమారు 3 ఏళ్ళ క్రితం. సంస్కార పెంపకం ఉన్న, ఏ ఒక్క తెలుగు సంస్థ నాయకులు అయినా, వాటికి జవాబులు ఇచ్చారా? ఆత్మవిమర్శ చేసుకుని, తప్పులు సరి చూసుకున్నారా? భవిష్యత్ సమస్యలు తగ్గించుకున్నారా? రాజకీయ నాయకులు, సినిమా తారలతో క్రీడలు భవబంధాలు ఆపారా? అసలు వాళ్ళు ఫంక్షన్లు చేస్తున్నది, ధనం పోగేస్తున్నదీ వీటి కోసమే. లోకల్ టాలెంట్ గురించి చూసుకోక, 2 పడవల మీద కాళ్ళతో, ఇటు వైపు చిందులు ఎందుకు దుర్బుద్దితో?*

ఈ ఏడాది జరిగిన వివిధ సంఘాల వేడుకులకు, మీ లాంటి నిజాలు చెప్పే, చిన్న తెలుగు విలేఖరిని లేదా మీ అమెరికా ప్రతినిధిని, మర్యాదకైనా ఆహ్వానించారా, ప్రోత్సహించారా? వారు ధన పరముగా సహాయం చేయలేకపోయినా, కనీసం ఉచిత ప్రచారం 10 మంది మంచి కోసం చేయవచ్చు కదా?

కనీసం మేము వర్గం కు, కులం కు, గాడ్ ఫాదర్ బానిసత్వం కు, పార్టీకి సంబంధం లేకపోయినా, మా తప్పులను గౌరవముగా ఎత్తి చూపినా, తటస్తులను కూడా చిన్న మీడియా అయినా, అండగా ఉన్నాము అని గొప్పగా తమ సంస్కారమును చెప్పుకోవచ్చు కదా?

కనీసం మీరు చేస్తున్న పనులైనా, స్లైడ్ లు గా శనివారం పంపే బొమ్మలు వేసి, ముదుసలి తల్లి దండ్రులకు, హైందవ జాతికి, సంస్కార పెంపకానికి, అరిషడ్వర్గాల అష్టవ్యసన బానిసత్వ నియంత్రణ సాధనలకు, ఆశలు జీవం కలిగించారా?

ఏదో వేడుకలో, ఇరు వర్గాలు, తెలుగు జాతి ఖ్యాతిని దశ దిశలా వ్యాప్తి చేస్తూ, కండ బండ మూర్ఖ బలా బలాలు ప్రదర్శించారు, చొక్కాలు కర్రలు పట్టుకుని అని విన్నాము, ఎవరు వారు? రాజన్న రామన్న వర్గాలా లేక కొత్త పవనన్న వర్గం తో పొరాటమా, కేవలం 2 మాత్రమే ఉండాలి అనా?

మన గ్రామాల్లో, పట్టణాల్లో, పక్క రాష్ట్రాలలో నే కాకుండా, విదేశాల్లో కూడా మన బుద్దులు ఇంత నీచముగా ప్రదర్శించడం, చాలా బాధగాను ఇంకో పక్క ఆనందము గాను ఉంది. మీరు చెప్పారు కదా, మంచి అయినా చెడు అయినా, స్తిర నిర్ణయం ఉండాలి అని. ఇక్కడ వారి పెద్దల సంస్కారం, అక్కడ వారి పిల్లలు స్తిరం గా చూపుతున్నారు.

మీరు పంపేవి అన్ని, ఆ తెలుగు సంఘాల/ పార్టీల నాయకులకు, సభ్యులకు, వారి పిల్లలకు పంపితే బాగుంటుంది. ముందు వారి ఇళ్ళలో, సభ్యుల్లో సంస్కారం పెరగడానికి, మీ రచనలు పాటలు పనులు బొమ్మలు, ఉపకరిస్తాయి అని భావిస్తున్నాము. ఎవరో ఒకరు పంపే వుండాలి మరి వారికి, సాటి తెలుగు మనిషి చేస్తున్న నిస్వార్ధ సేవ, ఎటువంటి ఫోటో పేరు ఊరు పదవి ముఠా బానిసత్వం గాడ్ ఫాదర్ ఆదాయం రాబడి లేకుండా అని.

మొద్దుబారిన వారి మనసులు మారతాయా? బురద పంది, తన సువాసన అంత తేలికగా, ఎన్ని జన్మలకు వదులుతుందా? ఇంకెన్ని ఘోరాలు వినాలో. మా బంధువుల పిల్లలకు కూడా చెప్పాము, తెలుగు సంఘాల/ సిన్మాల/ రాజకీయ పార్టీల మత్తులో పడి, బీరు బిర్యానీలకు బానిసలై, వారి వెంట తిరగవద్దని, వారికి దూరంగా ఉండమని. తా చెడ్డ కోతి వనమెల్లా చెడిచింది అని, అలా తయారు అయ్యారు. వారితో 25 శాతం లాభం ఉండవచ్చు బయట ప్రజలకు, శవాలను పంపడం చదివే పిల్లలకు అండ, కానీ కనపడకుండా చేసే పనులు 75 శాతం నష్టమే.

మన పులి/ నక్క/ పాము బుద్దులు, మన వంశం ఎక్కడకు వెళ్ళినా మనతోనే అనుసరిస్తాయి అని నిరూపణ అయ్యింది. అందుకే వీరు ఎగతాళి చేస్తారు, ఆవులాంటి వారికి వార్డు మెంబర్ గా గెలిచే అర్హత లేదు అని, తమ గొయ్యలు తాము తీసుకుంటా.

ఏ సంఘం/ పార్టీ/ సభ్యుడు/ ఓటరు ను చూసినా ఏమున్నది గర్వకారణం/ గొప్పతనం, అంతా ఇతరుల పాదాల కింద బానిసత్వం, తమ ముదుసలి తల్లి దండ్రులకు చెడ్డ పేరు ఒంటరి అనాధ బతుకు, తమ పిల్లల దగ్గర ముదుసలి తనములో దేవతలుగా ఉంటాము అని చెప్పలేని దౌర్భాగ్యం. ఇంకా ఆ ఆస్తులు/ పదవులు/ అధికారం/ ఆడంబరాలు వలన ఎవరికి ఉపయోగం?

*జవాబు* - ఇంత వివరముగా స్పందించినందుకు ధన్యవాదములు. మీరు కూడా విలేఖరిగా వ్యాసాలు రాయవచ్చు. చాలా వివరముగా చెప్పగలిగారు, కొన్ని తప్పులు మేము సరి చేసాము. ప్రశ్న జవాబు గౌరవముగా ఉండాలి, పెద్దలు చదివినా.

మీరు అన్నట్లుగా వారు కొంత మంచి చేస్తున్నారు, అంతా చెడు అనలేము. ఉదాహరణకు జగనన్న/ చంద్రన్న ఆసరాలు కొంత మంది పేదలకు అందుతాయి, అది మన వాళ్ళు, వేరే వాళ్ళు తర్వాత. కానీ భూముల తాకట్టు, అమ్మకము, బినామీలు ఆక్రమించుకోవడం, రాష్ట్రం అప్పులు పాలు అవ్వడం, ఇవన్నీ వారు పంచే దానికన్నా ఎక్కువ నష్టం కదా.

అలాగే వీరు, మీరు అన్నట్లు గా, రాజకీయ సినిమా మత్తులో, తమ సొంత పనులు చక్కబెట్టుకుంటున్నారు అని అందరి అభిప్రాయం. ఈ బంధం వారు వీడరు. అది లేకపోతే, ఈవెంట్ కు, ధనం తో జనం రారు. వీరి ఆటలు సాగవు.

ఆ తగువు తన్నులాట కూడా, వీడియోలు బయటకు వచ్చాయి, కొంత మంది పేర్లు కూడా రాసారు, మనకు వద్దు ఆ లోతు విచారణ. మనము ఎక్కువగా, గుణం గురించి మాత్రమే.

ఎవరూ మమ్మల్ని ఆహ్వానించలేదు, ఆ అర్హత మాకు లేదు అనుకుంటాము వీటిని బట్టి - బానిసత్వం, రాజకీయం, పచ్చ బులుగు, గాడ్ ఫాథర్, తమను పొగడడం ఇతరులను తిట్టడం, గంగి రెద్దులా తల వూపడం, లేని నిజాలతో ఆకాశానికి ఎత్తడం, ఇవన్నీ మన వల్ల కాదు. కాబట్టి, వారి శ్రేయోభిలాషుల లిస్ట్ లో ఉండము. మీరు అన్నట్లు గా వారు నిస్వార్ధ సేవ చేస్తే, మనకు పంపిన ఆహ్వానం పంపితే, వారు చేసే దుబారాలో ఇసుమంత నష్టం ఉండదు. ఏటూ మనము వెళ్ళము, కాకపోతే సమాచార మార్పిడి, అనుమానాల నివ్రుత్తి ఉంటుంది, మనము పొరపాటు పడితే.

ఆ సంఘాలలో, ముదుసలి తల్లి దండ్రుల సేవ స్వయముగా చేసే వారు ఉంటే, రోజూ వారి చేయి పట్టుకుని తిప్పే వారు ఉంటే, ప్రదక్షిణల సాధన చేసే వారు ఉంటే, ఖచ్చితము గా మా మీడియాను పిలిచే వారు, లేదా కనీసం ఇలా మీరు ఇవి ఆదర్శముగా తీసుకుని చెయ్యండి అని స్లైడ్ లు వేసే వారు, మనకు తెలియ చేసే వారు.

అదే విదేశీ కార్యక్రమం అయితే, చిన్న మీడియాను సమానం గా గౌరవిస్తారు. మీకు తెలుసు, జేంస్ కామరూన్ అనే గొప్ప దర్శకులు పాల్గొన్న వేలాది మంది, అలాగే ఇతర ప్రముఖుల, ఈవెంట్ లో కూడా మా మీడియాకు అనుమతి లభించింది. కానీ మనవారి దగ్గర మాత్రం తమ వారికే, తమ వర్గానికే, తమ తందనానా కే, మొదటి పీఠం.

ముదుసలి తల్లి దండ్రులకు, హైందవ జాతికి, సంస్కార పెంపకానికి, అరిషడ్వర్గాల అష్టవ్యసన బానిసత్వ నియంత్రణ సాధనలకు, ఆశలు జీవం కలిగించారా అన్నారు, వారి ఇంట్లో వారికి తెలియనివి ఎలా ఆస్వాదిస్తారు, ఆమోదిస్తారు, అభినందిస్తారు. ఇవి తెలిస్తే రాజకీయం, సినిమాకు దూరం గా ఉంటారు. 2 ఒకే వరలో ఇమడవు.

ఎవరో ఒకరి ద్వారా లేదా మన ద్వారా, వారికి చేరతాయి, కానీ ప్రాపంచిక మత్తు లో ఉన్నప్పుడు, అవి చదివే, సాధన చేసే ఓపిక వారికి ఉండదు. ఉంటే, వారి ఎన్నికల పాంప్లెట్ లో, తమ సొంత ముదుసలి తల్లి దండ్రుల సేవ, తమ పిల్లలకు తెలుగు పద్యం శ్లోకం రాయడం పాడడం వచ్చు అని కూడా గర్వము గా చెప్పే వారు. చూద్దాము ఏమైనా మార్పు వస్తుందేమో.

20 ప్రశ్నలు కు జవాబు చెప్పరు. చెపితే, అనుసరిస్తే, ఇంక ఇన్ని సంఘాలు ఉండవు, ఇన్ని మోసాలు ఉండవు. మొద్దుబారిన వారి మనసులు మారతాయా, ఎదురు దెబ్బలు తగిలి నప్పుడు మారతాయి.

మన రామన్న లాంటి ఎందరో, మొత్తము జాతి/ వర్గం తన వెనుక ఉన్నది అనుకుని, బ్రమ పడ్డారు. తర్వాత చివరలో తెలిసింది కదా, ఎవరూ తన వెంట రారు అని, అందరూ అవసర అవకాశ వాదులే అని, అదే కదా వారి గుండె కోత బాధ, అంతిమము గా. పంచభూతాలు వాటి పని అవి చేస్తాయి మనల్ని మార్చడానికి. మంచి రోజులు వస్తాయి అనుకుందాము.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,165; 104 తత్వాలు (Tatvaalu) and views 226,399
Dt : 18-Jul-2023, Upd Dt : 18-Jul-2023, Category : General
Views : 261 ( + More Social Media views ), Id : 1843 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : tana , tandana , analeka , vivaadaalu , jati , tala , dinchutunna , dhana , ahankaram , samskara , pempakam , tana , nats , ata , bata
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content