పాటతో పరమార్ధం - సత్య హరిశ్చంద్ర నాటకం, కాటిసీను, డీవీ సుబ్బారావు గారి పద్యం - ఎన్నో యేండ్లు గతించి - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2183 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2218 General Articles and views 2,490,474; 104 తత్వాలు (Tatvaalu) and views 267,105.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Satya Harishchandra natakam (drama), Katisinu, DV Subbarao gari padyam (poem) - Enno yendlu gatinchi

సత్య హరిశ్చంద్ర నాటకం ఆనాడు, డీవీ సుబ్బారావు గారు పాడుతూ ఉంటే, ఆహా ఓహో అనేవారు. ఈ పద్యం మనము పాడినా, గత హీరో లను, అంటే సుబ్బారావు గారు లాంటి వారిని, మనము తలచుకోవాలి సుమా. అన్ని పద్యాలు వాటి రాగాలు గుర్తు పెట్టుకుని, అంత పెద్ద గొంతుతో అంత పెద్ద రా....గా...లతో, రాత్రి 10 తర్వాత నిద్రకు ఆగి, అన్ని వందలమంది ముందు పాడటం, సామాన్యమైన విషయము కాదు, ఎంత సాధన ధారణ ఓపిక సహనం పట్టుదల ఉండాలి? మనకు సగం వాటి అర్ధము కూడా తెలీదు, వెతుక్కోవాలి, ఈ పదానికి అర్ధం ఏమిటి అని సుమీ.

అరిషడ్ వర్గమును జయించిన సత్య హరిశ్చంద్ర నాటకములోని శ్మశాన వాటిక సీనులోని ఒక పద్యము.

ఇది ఒక విచిత్రమైన ప్రక్రుతి, విచిత్రమైన ప్రక్రుతి, ఎందుకంటే జీవితమంతా ప్రాపంచిక బ్రమలులో మునిగి, తన స్వస్వరూపాన్నే మరచి, పరమాత్మను విడచి, కపట నాటక మోసాలతో కోరికలతో పరుగులు తీసి, చివరకు సొంత వారి చేతనే చీత్కరించబడి అవమానించబడి, ఒంటరిగా అనాధగా కన్నీరు మున్నీరుగా గతాన్ని తలచుకుని దుఖిస్తూ శరీరాన్ని విడిచి, ఈ స్మశాన వాటిక యందు ఏళ్ళుగా, చలనం లేక పడి ఉండే మోహజీవులను ఉద్దేశించి,

ఇది ఒక విచిత్రమైన ప్రక్రుతి, విచిత్రమైన ప్రక్రుతి,

ఎన్నో యేండ్లు గతించి పోయినవి..2 కానీ....,
యీ.. శ్మశానస్ధలిన్ గన్నుల్ మోడ్చిన, మందభాగ్యుడు.,
ఒకఁడు ఒక్కడు ఒక్కడు అయినను లేచిరా..డు, అయ్యో......!
యెన్నాళ్ళీ చలనంబు లేని, శయనంబు?
ఏతల్లులు అల్లాడిరో.....! ఏ తల్లులు అల్లాడి అల్లాడి అల్లాడిరో..
కన్నీటంబడి, క్రా.గిపో..యినవి..2 నిక్కంబిందు పాషాణముల్......

తాత్పర్యం
ఈ శ్మశానవాటికలో కొన్ని వందల, వేల ఏండ్లుగా నిద్రిస్తున్నవారు ఒక్కరు కూడా లేచి రాలేదు. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ చలనంలేని నిద్ర? ఈ రుద్ర భూమిలో, తమ బిడ్దలును పొగొట్టుకొన్న, తల్లుల రోదనలతో నిండిన కన్నీళ్లకు, వల్లకాడులోని రాళ్లు నీటివలె కాగి ఆవిరైపోయాయి.

మరి బతికి ఉన్నప్పుడు ఎందుకు ఇన్ని కపటాలు, నాటకాలు? ఇప్పుడైనా అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం విడిచి, మనుషులుగా మారదాం, పంచభూతాల శిక్షణ తప్పించుకుందాము, మానసిక బలం పెంచుకుని పరమాత్మను చేరదాము.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2218 General Articles and views 2,490,474; 104 తత్వాలు (Tatvaalu) and views 267,105
Dt : 25-Jul-2023, Upd Dt : 25-Jul-2023, Category : Songs
Views : 524 ( + More Social Media views ), Id : 1852 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : satya , harishchandra , natakam , drama , varanasi , katisinu , dv , subbarao , padyam , poem , enno , yendlu , gatinchi
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content