సాధన సేవ 8+ ఏళ్లుగా అలవాటు, విసుగు లేకుండా, రాత్రి నిద్ర మాని అయినా, పెద్దలు సేవ? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,810; 104 తత్వాలు (Tatvaalu) and views 226,446.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Since Sadhana Seva is a habit of 8+ years, without boredom, even if we dont sleep at night, keep elders close to you for Seva.

సాధన సేవ 8+ ఏళ్లుగా అలవాటు కాబట్టి, విసుగు లేకుండా, రాత్రి నిద్ర మాని అయినా, పెద్దలు ను దగ్గర ఉంచి సేవ?

రాము సోము తో ఇలా చెపుతున్నాడు - 2 నిమిషాల చదువు సమయం మన భవిష్యత్తు కు

రోజూ తెల్లవారుజామున షుమారు 3 నుంచి 5 లోపు , అమ్మ కు షుగరు బీపీ లక్షణాలు తో బాధ పడుతూ ఉంటుంది.

ఒంటరి వాళ్ళే పెద్దల సేవ చేస్తే అరిషడ్వర్గాల అష్టవ్యసనాల బానిసత్వం వీడి, ఇంక జంటలు ఇంకా ఎక్కువ మంది పెద్దల (అత్త మామ లకు కూడా) సేవ చేయవచ్చు అవి వీడితే. ఒంటరి అయినా జంట అయినా, మానసిక పరిపక్వత, ముందు చూపు, దైవ సాధన మాత్రమే ముఖ్యం.

మాత్రుదేవోభవ, పిత్రుదేవోభవ అన్నది ఆచరణలో చేయము, చేసే వారిని ప్రోత్సహించము రక్షించము దోవ చూపము పుణ్యం సంపాదించము. ఎవరి భవిష్యత్ పతనం ఎవరం రాసుకోవడం? మనము కదలకపోతే, దేవుడు కదలడా?

మన అమ్మ 20 ఏళ్లుగా ఏనాడూ, నన్ను చూస్తావంటరా అని అడగలేదు. ఈ రోజు కూడా, నీ భవిష్యత్ పాడు చేసుకోకు అని కన్నీళ్ళు పెడుతుంది. మనది ఒకటే జవాబు, నడిపే వాడు ఆయన, మనల్ని పాడు చేయాలి అని ఆయన అనుకుంటే, ఆపలేము. బాగుచేయాలి అనుకుంటే, ఎవరూ ఆపలేరు. కాబట్టి, మనకు వల్ల అయినది త్రికరణ శుద్ది గా చేద్దాము, మన్నించు, అంగీకరించు అని చెపుతా. దేవుడు కాదు అనుకుంటే, మనము ఇద్దరము పక్కన పక్కన ఉండగలమా?

మమకారం దేనిమీద ఉండకూడదు, అదే దైవ తత్వం అని నచ్చ చెపుతా. మనకు సహాయం చేసిన వారైనా, వారికి వారే వారి కుటుంబానికి నష్టం చేసుకుంటుంటే, స్పష్టముగా గట్టిగా మందలించి చెపుతాము, చెప్పాలి, దూరముగా ఉంచాలి, మనసు మారిందాక.

అలా ఏ తల్లి అయినా నన్ను చూడవా అని పిల్లలను అడిగింది అంటే, ఆరోజు మనం చచ్చినట్లే, జీవచ్చవాలమే, మన భాగస్వామి పిల్లలకు భవిష్యత్ లో చాలా నష్టాలు కష్టాలు. మనల్ని అడిగి, చిన్నప్పుడు మనల్ని పెంచలేదు, సౌకర్యాలు కల్పించలేదు. ఇద్దరికి 60 ఏళ్ళకు చెప్పినా, మేము సంపాదించడం మొదలు పెట్టిన తర్వాత, ఇంక మీకు దేవుని పని మనశ్శాంతి తప్ప, ధన ఆస్తుల పెంపకం, వాటి కాపలా లాంటి పనులు, మీకు వద్దు అని.

మీకు ఇబ్బంది అయితే, నష్టం కు అయినా అమ్మేయమని వదిలించుకోమని, స్పష్టముగా చెప్పాము 15 ఏళ్ళ ముందే, ఎప్పుడూ మనల్ని కాదనరు, మన మీద అంత నమ్మకం, కేవలం మనకు మంచి మాత్రమే చెప్తాడు చేస్తాడు అని. ఈనాటికీ అది వమ్ము కాలేదు, కాదు కూడా. పూర్తి విశ్రాంతిని ఇచ్చాము. 6 ఏళ్ళ పసిపిల్లల మరియు 60 ఏళ్ళ పైన పసి పిల్లల మాట విని దూరంగా విడిచాము ఇంకొకరికి అప్పగించాము అనే వారు, స్వార్ధ పరులు, బాధ్యత లేని వారు, రేపు శిక్షకు పాత్రులు.

ఓ తల్లికి, 4 పిల్లలు ఉంటే, ఎవరు ఎక్కువ విలాసంగా మంచి వైద్యం తో సౌకర్యాలు హోదాతో ఉన్నారో, వారే తల్లి దండ్రులకు అవన్నీ కల్పించాలి తమతో, వారికి సాత్విక క్రుతజ్ఞత విశ్వసనీయత బుద్ది ఉంటే. భాగస్వామి పిల్లలు ఉన్నారు కాబట్టి, పెద్దలను వదులుతాను అనేది తప్పు, చేతకానప్పుడు సంసారం కు మాత్రం న్యాయం ఎలా చేస్తావు? ఎవరైనా కుదరదు అంటే, దానికి ఒక పెద్ద సాత్విక కారణం ఉండాలి, అరిషడ్వర్గాల బానిసత్వం లేని ఇతరులు దానిని ఒప్పుకోవాలి. వారు సుఖపడకుండా ఒంటరిగా ఉంటేనే సుమా. ఉదాహరణకు మిలటరీ వ్యక్తి, అమ్మను బోర్డర్ దగ్గర నాతో ఉంచలేను అనవచ్చు నేమో.

సాధన సేవ 8+ ఏళ్లుగా అలవాటు ఉంది కాబట్టి, విసుగు లేకుండా, రాత్రి అయినా, నిద్ర మాని అయినా, ప్రేమ కృతజ్ఞత విశ్వసనీయత తో, మనకు తెలిసిన సేవ, మన ముదుసలి పెద్దలు కు దగ్గర ఉంచి సేవ చేయాలి.

ఎందుకంటే విసుగు తిట్లు కోపం ఆశ దురాశ మోహం వ్యామోహం అసహ్యం తో మానసిక గాయం అయితే, మందులు పని చేయవు ఏ వ్యక్తి కి కూడా.

అందుకే పెళ్లి, పిల్లలు, స్నేహం, బంధుత్వం, వ్యాపారం, సేవ, సహాయం అయినా గుణవంతుల తోటే ఉండాలి. అవసర అవకాశ వాదులతో కాదు. అవసరం తీరాక సొంత పిల్లలు, భాగస్వామి వదిలేసిన వారు మన చుట్టుపక్కల ఎందరో. గుణం లేని పెళ్ళిళ్ళు చేసి, సొంత బిడ్డల మనుమల గొంతు కోసి, తమ కొమ్మ కూడా తామే నరుక్కున్న వారు ఎందరో మన చుట్టూ.

ధనం/ పదవి/ అందం/ అధికారం/ ఆస్తి/ వీసా అంటే అరిషడ్వర్గాల కోసం ఆశపడే సొంత పిల్లలు అయినా, బయట వారైనా, వారి దగ్గర మనం ఉండకూడదు, మన వారిని ఉంచకూడదు. మనశ్శాంతి ఉండదు. మనకు కూడా ఆ లక్షణాలు ఉండకూడదు సుమా, మంచి వారి దగ్గర చెల్లము, ఉండలేము అవి ఉంటే. అది 5 ఏళ్ళు పైగా స్నేహం బంధం తో మనకు స్పష్టంగా తెలుస్తుంది కదా, మనం అరిషడ్ వర్గాల బానిసత్వం లో లేకపోతే.

మనం ఎంత సేవ చేసిన కూడా, ఒక్క శాతం, తల్లి తండ్రుల రుణం తీర్చుకోలేం. ఇంగ్లీషు మందు సగం మంచి, సగం చెడు. ఆ సగం మంచి కూడా, సాగదీయడం మాత్రమే, మాన్పలేదు షుగరు బీపీ లాగా, పాపపు ధనమంతా కరగదీస్తుంది.

మనం, మన ఆయుర్వేద సామగ్రి తో, ఉపశమనం కలిగిస్తున్నాం. ఇది అందరికీ పని చేస్తోందా అంటే చెప్పడం కష్టం, వారి ఆహారం శారీరక మానసిక అలవాట్లు ను బట్టి, ఉంటుంది. కాబట్టి అవి పని చేయలేదు అంటే, మన చెడు అలవాట్లు మాత్రమే. అందుకే మాతో ఓ 15 రోజులు సర్దుబాటు చేసుకుని ఉండగలిగితే, మనం వారి సేవ చేస్తాం అని, గతంలో బంధువులు స్నేహితులు కు చెప్పాము, మీకూ తెలుసు. వారి సగం ఖర్చు లు కూడా భరించి.

నరసేవ నారాయణ సేవ. మానవ సేవ మాధవ సేవ.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,810; 104 తత్వాలు (Tatvaalu) and views 226,446
Dt : 28-Mar-2023, Upd Dt : 28-Mar-2023, Category : General
Views : 407 ( + More Social Media views ), Id : 1740 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : sadhana , seva , habit , 8 , years , boredom , sleep , night , elders
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content