బియ్యం కధ - తెలుగు ప్రవాసుల పరుగులు - మనము పోల్చుకునేది, మనకన్నా హీనులతోనా? జ్ఞానుల తోనా? - General - లోకం తీరు/ News / NRI
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2150 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2185 General Articles and views 2,326,742; 104 తత్వాలు (Tatvaalu) and views 252,494.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Story of Rice - USA Telugu Expatriates running - Compare ourselves to those who are inferior to us? With the wise?

ఓ హీరో/ హీరోయిన్ గురించి, నాయకుని/ ఓటరు గురించి, ఓ జాతి గురించి కేవలం గొప్పలే చెప్పుకుంటా పోతే, వ్యామోహములో ఇంకా ఎన్నో తప్పులు జరగవా? మరి వారి పతనము ఎవరు చెపుతారు, దాచి మోసం చేస్తామా? ఎవరు మన జాతి పతనం ఆపుతారు? మనకు జ్ఞానోదయం ఎవరు కలిగించాలి?

విలేఖరి రాతలా? లేక మన సంస్కార తల్లి దండ్రుల మోహ రాగాలా? లేదా సమాజ/ సంఘ/ పార్టీ పెద్దల కూతలా లేదా పంచభూతాలా గర్జనా? మొదటి 3 పని చెయ్యకపోతే, కాలమే అంటే పంచభూతాలే తగిన శాస్తి చేస్తాయి, కాలగర్భములో కలిపేస్తాయి. గతములో అనుకున్నాము, ఇంటికో శూర్పణక మంధర కైక తాటకి పూతన లంఖిణి రావణుడు మేఘనాధుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు కంసుడు కీచకుడు శకుని ఉన్నారు. మనకు మనం ఒప్పుకోకపోయినా, ఇవిగో ఇలాంటి సహజ సంఘటనలే రుజువులు.

తెలుగు రాష్ట్రం సాధించామని గొప్ప చెపుతారే మద్రాస్ నుంచి, కాని పొట్టి శ్రీరాములు గారికి ఆమరణ నిరాహార దీక్షలో అండగా, ఒక్క తెలుగు వాడు నిలబడలేదు, అని ఎవరైనా మనకు చెప్పారా? కేవలం వేళ్ళ మీద లెక్క పెట్టగలిగిన ఓ ఇద్దరు, 5 గురు. వీరికేనా తెలుగు రాష్ట్రం కావాలి? అది మన తెలుగు జాతి గొప్పతనం సంస్కారం మానవత్వం. ఆయన హీన దశలో చనిపోయాక, ఘంటసాల గారు వెళ్ళి పాటలు పాడితే జనము వచ్చారు అని ఎక్కడో చదివాము.

అందుకే మనము ఎప్పుడు నక్క పాము పులి కే ఓటు వేస్తాము, ఓటును ఏదో ఒక దానికి అమ్ముకుంటాం అది ధనమే కాకపోవచ్చు, కులం వర్గం అవసరం అవకాశం. ఇంకా ముఖ్యం ఆవును గేళి చేస్తాం. చూడండి మనల్ని కూడా నవ్వుతారు, 5 ఏళ్ళు గా రాస్తున్నాడు పాటలు పాడుతున్నాడు, 50 మంది కూడా చదవరు వినరు, మనము ఎవరితో పంచుకోము. మనకు ఇలాంటి ముదుసలి తల్లి ని చూసే సంస్కారం వద్దు, మన సంతానం అంతా అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లో, పతనము అయితే చాలు లే అంటారు. అదా సొంత బిడ్డలకు నేర్పాల్సిన సంస్కారం? మరి రేపు ముదుసలి తనములో అనాధాశ్రమములో మనకు బెంచీ ఖాయమేగా? మరి అది గర్వముగా ఒప్పుకోవాలి కదా?

మనం చూసింది కొన్ని బియ్యం కధలే వీడియోలే, ఇంకా చూడని ఘోరాలు ఎన్నో ఉన్నాయి. నిన్న మన కధనం చదివినాక అయినా, కొంతమంది ఎన్నారైల సంస్కార పెంపకము చూసినాక అయినా, ఇంటిల్లి పాదీ, ఇలా మనసులో అనుకున్నారా లేదా? - ఓ పంచ భూతాల్లారా, ఇప్పటి దాకా మేము కపట నటన అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వము లో చేసిన, మా తప్పులు పాపాలు క్షమించి, మాకు మా తర్వాత తరాలకు, రసాయనాలు లేని అన్నం/ బియ్యం/ కూరలు పండ్లు దొరికేటట్లు చేయండి, ఇక నుంచి అయినా బుద్ది గా ఉంటాము. కనీసం ఇప్పుడైనా అనుకోండి.

మనము 5 ఏళ్ళు గా, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లో ఉన్నారు అందరూ 80 శాతం అంటే, ఎవరూ ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు ప్రత్యక్షముగా చూసాము కదా. అందరూ సంస్కారం మానవత్వం ఉన్న భక్తులే, మరి సోనా మసూరి బియ్యం బస్తాలు ఏవి? స్టాక్ నిల్ ఎందుకు?

నాయకులు ఎలా ఐతే ఓటర్ల నుంచే వచ్చారో ముదురి, ఎన్నారైలు కూడా మన ఊరి నుంచి మన బుద్దులు నేర్చుకుని వచ్చిన వారే కదా, అంతరిక్షనుంచి రాలేదు కదా? పెద్ద చదువులు తెలివి ఆస్తులు టెక్నాలజీ ఉన్న ఎన్నారైలే ఇలా ఉంటే, ఇక మన ఊళ్ళో ఎంత దౌర్బాగ్యం ఉందో చూడండి.

మొన్న ఒకరి వీడియోలో చూసాము, ఇది మన జన్మ నేల పై జరిగింది - లారీ పడిపోతే, డ్రైవర్ రక్తములో పడి ఉన్నారు, జనము లారీ లోవి అన్ని దోచుకుని పోయారు, అతనిని పాపం అన్న ఒక్క మనిషి లేరు? ఆ వస్తువులు దొంగిలించడానికి, అదీ నిస్సహాయత స్తితిలో, వారు మనుషులేనా? మనవి రాక్షసుల కన్నా, నీచపు జన్మలు అయినాయి. రైలు పడిపోతే, పోయిన వారి సంపద దోచుకునే వారు ఇంకో వైపు. ఓటు అమ్ము కునే వారు ఓ వైపు, ఆ ఓటర్లను వారికి చెందిన మానం ఆత్మాభిమానం భూమిని, అమ్ముకునే నాయకులు ఇంకో వైపు.

ఇక మన సోదరుల సంస్కార ఆలోచనలు పనులు చూస్తున్నాము కదా - బాబాయి మామ భాగస్వామి సంతానం అనుచరుల వెన్నుపోటు తప్పు కాదు, 3 పంటల మాగాణి కాంక్రీట్ తప్పు కాదు, పధకాలకు కుటుంబ పేర్లు తప్పు కాదు, నక్క పాము పులి కి ఓటు తప్పు కాదు అని ఎలుగెత్తి చాటే, మన సంస్కారానికి తగిన శిక్షలు కావాలి కదా? తోటి మనుషుల మాట వినము, ముదుసలి అమ్మ నాన్న అత్త మామలను ఇంట్లో పెట్టుకుని చూడము. ఇంక మనల్ని దారిలో పెట్టల్సింది, పంచభూతాలే కదా?

ఈ బియ్యం కోసం ఎగబడిన ఉత్సాహవంతులైన స్వార్ధ ఎన్నారైలే, రేపు తెలుగు సంఘాల/ పార్టీ ల సభ్యులుగా ఉండి, పది మందికి, రాజకీయ నాయకులకు, సినిమా వారికి ముఖ్యముగా నట నటీ మణులకు, ఎనలేని సేవ చేస్తున్నారు చేస్తారు యూత్ అధ్యక్షులుగా. మరలా మనందరి ఓటు వారికే. వీసాలలో మోసం, ఇప్పుడు కూలికి డబ్బులు సంపాదన లాగా ఉంది, సాఫ్ట్వేర్ బతుకులు.

రాబోయే రోజులు ఇంకా చాలా గడ్డు రోజులు, కరోనా తాతమ్మలు ఒకవైపు ఐతే, ఇలాంటి ఆహారపు కొరత ఇంకోవైపు, సంస్కారం మరచిన స్వార్ధం ఇంకో వైపు. మరలా శుక్ర, శని, ఆది వారాలు మందిరాలకు మాత్రం ఇసకేస్తే రాలనంత జనం.

ఇంకో వీడియోలో, అందరికీ అందాలి కాబట్టి, కుటుంబానికి ఒక బస్తా అని షాపు వారు చెపితే పెద్ద పెద్ద కాగితాలు అంటిస్తే, దానిని తుంగలో తొక్కి, నీతి నియమాలు వదలి - 1 వ్యక్తి, 1 భార్య, 1 సంతానం ముగ్గురు గా విడిపోయి, 3 బస్తాలు తెచ్చారు, షాపు వారిని మరియు ఇతర కుటుంబాలను మోసం చేసి, చాలా తెలివిగా. అది వారు గొప్ప అనుకుంటున్నారు, కానీ వారే నిర్ణయించేసారు, తమ కుటుంబం ఎక్కువ కాలం కలసి ఉండదని, దేవుడికి.

మనము అక్కడ ఉండి కన్నీళ్ళు పెట్టుకుని, ఇది అన్యాయం ధనం బలం ఉన్న వారిదే రాజ్యం కాదు, రేపు మీ కన్నా బలవంతులు మిమ్మల్ని అణిచివేస్తారు, అలా వద్దు అని చేతులు జోడించి అడిగితే ఆగుతారా? వారి మనసులు కరుగుతాయా? పోవయ్యా, పోయి కధనాలు రాసుకో పాటలు పాడుకో, మాకు అవన్నీ తెల్వదు, మా స్వార్ధం మాది అంటారు. కనీసం తన్న కుండా వదిలారు అని సంతోషపడటం తప్ప, మనం ఏమి చెయ్యగలం?

అలా ఎన్నో కుటుంబాలు, అదే పనిలో ఉన్నాయి, ఆ షాప్ లో. మనము అలాంటి తప్పులు చేయకూడదు. 1 మాత్రమే తెల్ల సోనా మసూరి తేవాలి, 2 వది వారు అనుమతి ఇస్తేనే.

ఒక్కో బండిలో చూసారు కదా, ఎన్ని బస్తాల కక్కుర్తి ఉందో? గొప్పగా ఫోన్ చేసి ఊళ్ళో వారి కి చెపుతారు, నాన్నోయ్ మేము 10 బస్తాలు తెచ్చాము తెలివిగా అందరినీ మోసం చేసి అని.

పోనీ పెద్దలు ఇది తప్పు అంటారా? లేదు, మా నాయనే బంగారం, మేము ఇక్కడ 100 బస్తాలు దాచి కల్తీ వ్యాపారం అన్నిటిలో, నువ్వు 10 బస్తాలకు వచ్చావు అంటే, భవిష్యత్ లో 1000 బస్తాలు దాచాలి నాన్నా, బంగారు కొండా, నీతి నియమాలు అని ఎవరో రాస్తున్నారు అంటా, వారివి చదవద్దు, వారికి ఆస్తులు లేవు. మనము ఎన్నో ఆస్తులు పెంచాలి, చివరలో రోగాలు లేదా వెన్నుపోటుతో అశాంతి తో పోవాలి, ఇదే మన వంశ సాంప్రదాయం అంటున్నారు నిర్లజ్జగా.

ఇంకొకాయన, కంపెనీ డైరెక్టర్ అంట, ఉద్యోగ పెద్ద జీతం ఎంత వచ్చినా కక్కుర్తి చాలక, ఎగస్టా 20-30 ఇస్తే, బస్తా ఇస్తాను అని బేరాలు. ఎందుకు ఇంత దిగజారిపోతున్నారు, ఇంత చిన్న మొత్తనికి కూడా? అదీ తిండి దగ్గర? అదేమంటే, హోటల్లో ఇంత కన్న మోసాలు చేయడం లేదా అంటారు.

అంటే, మనము పోల్చుకునేది, మనకన్నా హీనులతోనా? జ్ఞానుల తోనా? మరి మన పిల్లలకు మానసిక బలం ఎలా పెరుగుతుంది? ఎవరు పెంచుతారు? మనకు అండగా ముదుసలి తనములో ఎందుకు ఉంటారు? మనమే హీనులతో కలసి మెలసి తిరుగుతూ ఉంటే?  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,326,742; 104 తత్వాలు (Tatvaalu) and views 252,494
Dt : 23-Jul-2023, Upd Dt : 23-Jul-2023, Category : General
Views : 602 ( + More Social Media views ), Id : 1849 , Country : USA
Tags : support , telugu , expatriates , america , sona , masuri , rice , usa , running , inferior , wise , compare
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content