Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి. వేదాలకు, పరమ ఉత్తమ గురువులకు సంబంధించినది. వారితో, నేటి కలియుగ గురువులను బాబాలను పోల్చకూడదు. నేటి గురువు బాబాలు, నన్ను పూజించాలి నేను కాపాడుతా అంటారు. అది తప్పు, శాస్త్ర విరుద్ధం. మోహాంధకారంలో ఉన్న వారు, అటు పయనం చేస్తారు, చివరకు మోసపోతారు.
ఈనాడు మనకు నచ్చిన గురువును గౌరవించుకోవచ్చు, కానీ వ్యాసుడు వాల్మీకి లాంటి మహా కావ్యాలు రాసిన వారితో, నన్ను పూజించాలి నేను కాపాడతాను అని ఎప్పుడూ చెప్పని వారితో, నేటి గురువులు ను దయచేసి పోల్చవద్దు.
కలియుగ శంకరాచార్య వంటి గురువులు కూడా, దేశం మొత్తం తిరిగి కాలినడకన, ఎన్నో స్తోత్రాలు భగవంతుని గురించి రాశారు. ఆయన కూడా, నాకు గుడి కట్టి పూజించాలి, నేను కాపాడతాను అనలేదు. అనరు ఎందుకంటే, భగవంతుని వైపు దోవ చూపుతూ జ్ఞానము పెంచే వారే, నిజమైన గురువు.
మనం చేసే తప్పులు, మన పిల్లలు ఒప్పులు అనుకొని గుడ్డిగా నమ్ముతున్నారు. దాని వలన నష్టం పడేది మనమే సుమా.
గత గురువులు, నేటి గురువు ఒకరే ఒకటే అని మనం అంటే, అయితే తల్లి దండ్రులు మరియు నేటి భాగస్వామి ఒకటే కదా అని, వారి మాయలో పడి, తల్లి దండ్రుల ను గాలికి వదిలేసి, చివరకు వారు వీరు అందరూ పతనం అవుతున్నారు. దేనికైనా ప్రమాణాలు ఉండాలి.
పామర భాషలో చెప్పాలి అంటే, మామూలు మనుషులకు తెలిసేటట్టు చెప్పాలి అంటే,
1. 50 ఏళ్ల అనుభవం తో రిటైర్ అయిన మంచి ఉపాధ్యాయులు, నేడు మొదటి సంవత్సరమే గొప్ప పేరు తెచ్చుకున్న ఉపాధ్యాయులు ఒకటి కాదు. వీరు, రాబోయే 50 ఏళ్ళు నెగ్గుకురావడం గురించి మనకు తెలీదు కదా.
2. నాన్న అనుభవం వేరు, మన అనుభవం వేరు. నాన్న ఎన్నో బాధలు మోసారు, మనం జలుబు కూడా తట్టుకోలేం. ఏనాటికీ ఇద్దరూ ఒకటి కాదు.
3. నటులు అంటే అందరు వస్తారేమో గాని, మహా నటులు అంటే రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారులు మాత్రమే. నేటి బాలయ్య, నాగార్జున, మహేష్ కాదు. ఎప్పుడు కి వారు, వీరు ఒకటి కాదు.
4. రాజన్న నవ్వు, రాజసం, ఠీవి, జగనన్న కు రావు. ఇద్దరూ ఎప్పుడు కు ఒకటి కాదు.
5. వాజపేయి, పీవీ నరసింహారావు, మోడీ గార్లు లాంటి ప్రధాని మరలా కష్టం. అలాగే యోగీ లాంటి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా. ప్రధానులు అందరూ, ముఖ్యమంత్రులు అందరూ ఒకటి కాదు.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2187 General Articles and views 2,386,463; 104 తత్వాలు (Tatvaalu) and views 258,177 Dt : 05-Jul-2020, Upd Dt : 05-Jul-2020, Category : General
Views : 1503
( + More Social Media views ), Id : 589 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
guru ,
vyasa purnima ,
guru purnima ,
great epics ,
valmiki ,
vyasa Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments