పవనన్న రామాయణం - వాలి/రావణ పతనం కోసం, వారిలో ఒకరితో? ఆవు కు నక్క/ పులి తో స్నేహం? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1946 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1981 General Articles and views 1,680,984; 102 తత్వాలు (Tatvaalu) and views 207,967.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*పవనన్న రాజకీయ రామాయణం - వాలి/రావణ పతనం కోసం, వారిలో ఒకరితో కలవాలా? ఆవు కు నక్క/ పులి తో స్నేహం, మంచి చేస్తుందా?*

*Pavanannas political Ramayana - For the downfall of Vali/ Ravana, meet with one of them? Friendship with a fox/ tiger for a cow, does it do good?*

పవనన్న అతి మంచితో, తన గొయ్యి తాను తీసుకుంటూ, తిక్క నిర్ణయాలను చేస్తూ, ఇతరుల పాప భారాన్ని తన మీద వేసుకుంటూ, జన సైనికులను నిరుత్సాహ పరుస్తూ, జగనన్న గెలుపుకు బాటలు వేస్తున్నారు, అని జన సైనికుల మనో వేదన.

1* పవనన్నా, 1. రావణ పతనం కోసం, వాలి తో కలసి తేలికగా పొందే పాపం బెటరా? ధార్మికుడైన, సుగ్రీవుని తో కలసి వచ్చే, కష్టం పుణ్యం బెటరా? 2. అలాగే వాలి ని పతనం చెయ్యాలి అంటే, రావణ తో కలవాలా? ఎక్కడ నేర్చుకున్నావు అన్నా ఈ రాజకీయ పతన నీతి? అది చంద్రన్న నీతి, అవసరమైతే బీజీపీ లేదంటే కాంగ్రెస్స్, విలువలు ఉండవు, ఆ తుచ్చమైన కూడు మనకు వద్దు. రాముడు అలా చేసి ఉంటే, ఇంక రామాయణానికి, నీతి నియమాలకు అర్ధం ఉందా?

2* ఇప్పటి వరకు అధికారం లో లేని వారు, ఆవు కిందకు వస్తారు, ఇంకా వారి అధికార సధ్గుణాలు, మనకు తెలీదు కాబట్టి.

3* ఇప్పుడు మా 4 పిల్లలు చిన్నమ్మ, చంద్రన్న, జగనన్న, పవనన్న ల లో, కేవలం చిన్నమ్మ, పవనన్న మాత్రమే ఆవులు అవుతారు. చిన్నమ్మ, రామన్న వెన్నుపోటు దగ్గర చంద్రన్న వైపు నిలచి, ఆవును కాదు అని ఎప్పుడో నిరూపించారు.

4* చంద్రన్న, జగనన్నలను వారి అభిమానులు సిమ్హాలు, పులులు, తో పోల్చి తమ క్రూరత్వాన్ని గొప్పగా చాటుతున్నారు. అలాగే ఈ మధ్య ఎవరో పులులు సిమ్హాలు అడివిలో తిరగగలవు కానీ, జురాసిక్ పార్క్ లో కాదు అని, జగనన్న ను డైనోసార్ తో పోల్చి తమ చెంచా గిరిని చాటుకున్నారు. అలా వారు వీరు, తమ బహుళ కుటిల నాటకీయ క్రూరత్వాన్ని పెంచుకుపోతున్నారు, తమ అనుచరులలో కూడా ఆ ఉన్మాదాన్ని పెంచుతూ.

5* 75 శాతం పాప జనం (కలియుగ ధర్మం 3 పాదాల రాక్షసత్వం), తమ నక్క పాము పులి డైనోసార్ (రాక్షస బల్లి) లక్షణాలు కే మా ఓటు అంటున్నారు. ఆవు ను, వార్డ్ మెంబర్ గా కూడా, గెలిపించము అంటున్నారు, గేళి చేస్తున్నారు.

ఎందుకంటే కన్న ముదుసలి తల్లి తండ్రి సేవ, భాగస్వామిని ఇచ్చిన ముదుసలి అత్త మామ సేవ అంటే వీరికి గిట్టదు. అంతే కాదు, తమ సొంత పిల్లల దగ్గర ముదుసలి వయసులో, దేవతలు గా సేవించ బడతాము అని కూడా, ఈ కసాయి వారు సిగ్గుతో చెప్పలేరు. ఇంకా వీరు, వీరి పిల్లలు, కనీసం సొంత తల్లి మీద క్రుతజ్ఞతలుతో, వాట్సాప్ లో తెలుగు రాయలేరు. అంత గొప్పవారు, ఆవును వార్డ్ మెంబర్ గా గెలిపిస్తారా? గెలిస్తే ఊరుకుంటారా?

6* మనం ఆవు లక్షణాలు వీడి, పాము/నక్క/ పులి/ డైనోసార్ తో చెలిమి తో, వాటిలో ఒక దానిని ఎదుర్కోవడం నా? బుద్ది ఉన్న వారు ఎవరైనా ఇది సమర్ధన చేస్తారా? ముల్లు ను ముల్లు తోనే తియ్యాలి అన్నది ఆవు లక్షణము కాదు, ఆ మిగతావారి లక్షణము.

7* ఇది పెడదారి కాదా? వారి మరకలు పాపాలు వెన్నుపోటు, మనకెందుకు? పులి నక్క పాము వద్దు, ఆవు మాత్రమే కావాలి అనే మంచి వారికి, ఇంక బీజేపీ యేనా దిక్కు? జగనన్న మరియు చంద్రన్న తో వద్దు, పవనన్న తో ముద్దు అనే వారికి, చంద్రన్నతో కలసి దిగజారి, మొండి చెయ్యి చూపిస్తావా?

8* చంద్రన్న వెన్నుపోటు చాటుతనం కపటం నాటకం అంటే ఇష్టం లేని వారు, మొన్న కరోనాకు హైదరాబాద్ పరుగులు తీసి ప్రాణాలు నిలుపుకున్నవారు, 3 పంటల పొలాన్ని కాంక్రీట్ చేయడం తప్పు అనే వారు, మోడీ గొ బాక్ సీబీఐ వద్దు అనడం ఇష్టం లేని వారు, ఇంక జగనే దిక్కు అనుకుని, జగనన్న కు ఓటు వేస్తే, మీ ఇద్దరి పరిస్తితి ఏమిటి?

9* చంద్రన్న మీద జాలి అందరికీ ఉంది, బాధపడ్డాము. పోయి పలకరించు, 4 రోజులు వారి ఇంట్లో ఉండి, సేవలు చెయ్యి, ఎవరూ వద్దు అనరు, అది మీ ఇద్దరి వ్యక్తి గతం.

10* కానీ రామన్న వెన్నుపోటు పై కూడా, జాలి ఉండాలి కదా, ఆ పెద్ద వయసులో తమ్ముళ్ళు రాండి రాండి అని చేతులు జోడించి కన్నీళ్ళు తో వేడుకుంటే, మర్యాద జవాబు చెప్పుల వర్షం కు, మీరు అండనా? పసుపు మీడియాలో, రామన్న ను పిచ్చివాడిగా బొమ్మలు వేసి, ఎగతాళి చేసి, తెలుగు ప్రపంచములో, చేతగాని వాడిగా, నిరూపించిన దానికి, మీరు అండనా? అప్పుడు మీరు ఆవు కాదు, నక్క అవుతారు సుమా.

11* అది ఆనాడు వెన్నుపోటు, చంద్రన్న మరియు అనుచర గణం కరెక్ట్ కరెక్ట్ అంటే, మనము పిచ్చివారిగా నమ్మాము. ఈ రోజుకు కూడా, రామన్న పిల్లలు, తాము తప్పు చేసాం, అన్న వాస్తవ స్తితికి రాలేకపోతున్నారు, ఇక రాలేరు. అది అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం అంటే.

మరి జగనన్న మరియు అనుచర గణం ఇప్పుడు జరిగేది, చట్టం తన పని తాను చెస్తుంది, ఇదంతా కరెక్టే అంటే, మనము నమ్మలేమా? చూస్తూ గమ్మున ఉండలేమా? నమ్మకపోతే, అది పక్షపాతం కాదా మనకు అలాగే ప్రజలకు? పసుపు మరియు బులుగు మీడియాలను సమానముగా నమ్మాలి కదా, స్తిరత్వం అంటే? ఇదేనా మీరు చాతుర్మాస వ్రతములో నేర్చుకున్నది?

12* వీరి ఇద్దరి వెర్షన్ కాకుండా, పంచభూతాల వెర్షన్ ఇంకోటి ఉంటుంది కదా. అది మొదటి చంద్రన్న కు పాఠం చెపితే, తర్వాత జగనన్నకు కూడా, పాఠం చెపుతుంది. గతములో నే అలిపిరి సంఘటనతో, అలాగే నెలల జైలు తో ఇద్దరికీ పాఠం నేర్పింది. కానీ వీరు మారరు, వీరి అవసర అవకాశ అనుచరులు, వీరిని మారనియ్యరు.

మరి మీరు మధ్యలో, వేలు ఎందుకు, ఒకరికి అనుకూలముగా? మీకూ పాఠం కావాలా, పంచభూతాలతో? చిరు అన్న, గత అనుభవాలు మరచారా?

13*1 ప్రజల తమ గుణ గణాలకు అనుకూలముగా, 150 సీట్లు ఇచ్చారు, రాష్ట్రం అప్పు పెంచారు, పన్నులు కట్టి ఆనందపడుతున్నారు, ఉచితముగా వచ్చింది చేతులు చాచి అందుకుంటున్నారు, మనం ఎందుకు అది తప్పు అనాలి? మన తిడుతున్నది, జగనన్ననా లేక జనాన్నా?

13*2 కానీ పార్టీనీ, సిద్దాంతాలను సైనికులను బ్రష్టు పట్టించవద్దు. గతము లో సప్పొర్ట్ చేసావు, అదీ తప్పే. మరి ఇప్పుడు మీ సీయెం పదవికి, వారి లోకెశన్నను కాదని, మీకు ఇస్తారని ఆశపడుతున్నారా?

14* ఇచ్చినా, మామ లాగా ఎన్ని రోజులు, మీరు మనశ్శాంతి గా ఉంటారు? ఇవ్వకపోతే, మీకు కంచి గరుడ సేవ ఎందుకు? ప్రజలు 23 ఇచ్చి చీత్కరిస్తే, మీరు తోడు ఉండి మరలా నిలబెడతారా? అది మీకు పాపమా? పుణ్యమా?

15* ప్రజలు వారిని వద్దు అనుకుంటే, ఆవు కావాలి అనుకుంటే, వారి బుద్దులు మారితే, కపట నాటక వెన్నుపోటు ఫాక్షనిజం రౌడీఇజం వద్దు అనుకుంటే, ఆవులాంటి నాయకులకు ఓటు వేస్తారు. కాబట్టి మీరు జగనన్నను దింపాలని, చంద్రన్న తో కలిస్తే, అది మొదటికే మోసం వస్తుంది.

చంద్రన్న, జగనన్న - ఎవరో ఒకరు, వచ్చే ఎన్నికలతో ఇంటికి పోవాలి, అని వారిద్దరు తేల్చుకుంటున్నారు, అది దైవ నిర్ణయం. మీరు దూరంగా ఉండి, మిమ్మల్ని జనం ఆదరిస్తారా లేదా ఆవుగా మాత్రమే ఎదురు చూడాలి. వారి మధ్యలో కి మీరు వెళ్ళ కూడదు.

16* చంద్రన్న/ లోకేశన్న చేతగాని తనముతో, ఇంకొకరి సహాయముతో ఓడిపోయాడు లేదా గెలిచాడు అన్న అపవాదు, వారికి కూడా మంచిది కాదు. వారు, వారి పార్టీ చేసిన మంచి మీద వారికి నమ్మకము ఉంటే, ఇంకొకరి సహాయం, తలవంచి తీసుకోరు. ఎంత మంది సహాయం కావాలి వారికి? వెన్నుపోటు పొడిచిన, రామన్న ఫోటో కూడా వాడినా, గెలవలేరా? కపటం నాటకం వెన్నుపోటు నే మా కుటుంబ లక్ష్యం, వారసత్వ బానిసత్వమే ప్రజాస్వామ్యం కన్నా ముద్దు, అనే వారు వారి ని తప్పక గెలిపిస్తారు. గెలవనీయండి.

చూడండి అమాయకపు పసుపు జనం, ఎందుకు ధర్నాలు చేస్తున్నారో కూడా, తెలీకుండా ఉన్నారు. కంప్యూటర్ ఐటీ వారు కూడా, తేలికగా వచ్చిన ధనముతో సంస్కారము మరచి, పిల్లిని చంపిన పాపం వేరు, గుడి కట్టిన పుణ్యం వేరు, అని తెలుసుకునే పరిస్తితి, వారి తల్లి దండ్రులు నేర్పలేదు.

17* ఆవు అమాయకముగా వచ్చి, మన తప్పుడు వారి గుంపులో చేరతాను అంటే, సహజముగా నక్క, పులి, సిమ్హం, డైనొసారు, పాము గుంపు ఒప్పుకోవు. మా దోవ వేరు, మీ దోవ వేరు, అని జంతువులు నిజాయితీగా చెపుతాయి. మనుషులము మనము చెప్పలేమా? అసలు ఆవు, అటు వెళ్ళదు.

18*1 జనం మరలా జగనన్నతో వెళతాము అంటే, వెళ్ళనీయి. చంద్రన్న కు తగిన వారు, జగనన్నే అని కూడా జనం మంచి భావన కావచ్చు. ఒక వాస్తవం మనము ఒప్పుకోవాలి, రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులతో ముంచి, తమ సొంత కంపెనీలను మాత్రం లాభాలలో ఉంచాలి అంటే, అందుకు జగనన్న మరియు చంద్రన్న మాత్రమే సమర్ధులు, కుటుంబ వారసత్వ పాలనే బెస్ట్ ప్రజాస్వామ్యం కన్నా, అని స్వార్ధ జన అభిప్రాయం.

అలా వచ్చిన లాభాలతో, ఆస్తులు పబ్లిక్ గా ప్రకటించే ధైర్యం, కేవలం జగనన్న కే ఉంది, కాబట్టి మరలా గెలిపించుకోవాలని అనుకోవచ్చు. స్వదేశం, విదేశాలలో చంద్రన్న కు ఎంత ఉందో, ఆయనకే గుర్తు లేదు, బినామీల అద్రుష్టం అంటారు వారి అభిమానులు.

18*2 స్వార్ధ జన అభిప్రాయం, మీరు మేము ఆపగలమా, స్వయం గొయ్యిని, మార్చ గలమా జనాల బుద్దిని? అందుకే పంచ భూతాలు వాటి పని అవి చేస్తున్నాయి. మొన్న కరోనా చూసాము, మనలో ఎంతో మందిని తీసుకు వెళ్ళింది. అయినా, జనం మారతారా? అబ్బే, సునామీ అన్నా లెక్కలేదు. ఈ సారి, కరోనా సునామీ వాళ్ళ, అక్క చెల్లెలు బంధువులు, చాలా మంది రెడీగా ఉండవచ్చు. భూకంపాలు, వరదలు, ఎండలు, ప్రక్రుతి వినాశకాలు ఎన్నో.

ఇంక జన కుటుంబ విలువల వినాశనం కూడా చూసాము - సంపాదన లో పడి, తల్లి తండ్రి పిల్లల సంస్కారం వదిలేయడం, 20 ఏళ్ళ కే అక్క చెల్లి వోడ్కా తెచ్చుకుని, ఇంట్లోనే ఆనందపడుతూ, ప్రియుని తోనే సొంత ఇల్లు దోచుకోవడం, మన కుటుంబ సమాజ ఉన్నత విలువలను చూపిస్తుంది.

19* ఆలోచన చేసి, ఒక అడుగు, వెనక్కు వెయ్యి అన్నా. సొంత పార్టీలు 2 మాత్రమే. అది జనసేన, వైసీపీ - అదీ వెన్నుపోటు లేకుండా.

నీతి అవినీతి లో, జగనన్న చంద్రన్న ఇద్దరూ, తమ ప్రత్యేకతను చాటుకున్నారు. అలాగే ప్రజా పధకాలకు కుటుంబ పేర్లు పెట్టుకున్నారు, ఎస్టీ ఎస్సీ బీసీ లకు కూడా ప్రజా పధకాల పేర్లలో రిజర్వేషన్ లేదు.

20* మూలం లోనే, ధర్మం లేదు చంద్రన్న కి, తను లాక్కున్న సాగిస్తున్న, ఇప్పుడు ఉన్న పార్టీకి. కాబట్టి ఆ పాపములో మీరు చిక్కు కోవద్దు, అని జనసైనికుల ఆవేదన. కాటు వేసే పాముకు, తరతమ బేధాలు లేవు, పాలు పోసినా సరే, తన ధర్మం వీడదు. అది దాని తప్పు కాదు, తనకు తెలీదు తను ఆగలేదు, దాని గుణం అంతే. అందుకే కుక్క తోక వంకర అంటారు. పుట్టుక తో వచ్చిది, కడ దాకా పోదు అంటారు.

అందుకే మొదటి నుంచి మనకు కూడా చంద్రన్న అంటే జాలి, పాపం, ఎప్పటికైనా పంచ భూతాల చేతిలో తప్పదు అని, 2019 లో వారి అధిష్టానానికి కూడా పంపాము. వారు ఎవరినీ లెక్క చేయరు, ఫలితము 23 వచ్చింది.

21* మీరు ఆ పాపములో చిక్కు కుంటే, జనసైనికులు ఎప్పటి లాగనే, సినిమాలో పవనన్న కోసం ప్రాణం ఇస్తాము, కానీ రాజకీయాలలో ఓటు మాత్రము ఇవ్వము అంటారు. మీరు 2 సార్లు ఎందుకు ఓడిపోయారో, ఇప్పుడైనా అర్ధం అయ్యిందా? అది మీకే నష్టం.

మీరు చంద్రన్న తో కలసి గెలిచినా, చంద్రన్న తన తాంత్రిక వామాచార (వంకర, తప్పుడుదోవ, మానసిక బలహీన) వేణు స్వామి అన్న లాంటి, అర్ధం పర్ధం లేని గారడీ విద్యలతో, అన్నం పెట్టిన చెయ్యినే నిర్దాక్షిణ్యముగా విరిచేసారు/ విరిచేస్తారు.

22* జగనన్న కు తన అక్రమ/ సక్రమ ఆస్తులు, 70 గదుల ఇళ్ళు ఎన్ని ఉంటే అన్ని చూపించే ధైర్యం ఉంది. చంద్రన్న కు తన ఆస్తులు చూపించే ధైర్యం కూడా లేదు. అంటే, అంతా చాటు వ్యవహారం, కాబట్టి మీరు, మీ అనుభవము చాలదు. రామన్న కే అర్ధం కాలేదు, చివరి నిమిషం దాకా, తన సొంత బుద్ది మాలిన పిల్లలు, చేతనే తిరుగుబాటు చేయించడం.

23* మా 1800+ కధనాలు 5 ఏళ్ళకు పైగా 10 మంది కూడా చదవరు, మా శనివారం సాధనలు 200+ వారాల 108 ప్రదక్షిణలు ఎవరూ చేయరు తమ పిల్లలకు చెప్పరు, మా 500+ పైగా అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వ నిర్మూలన పాటలు కూడా, 6 కోట్ల పైన ఉన్న తెలుగు వారిలో, 500 మంది కూడా వినరు. అంత మాత్రనా, మేము సిగ్గు పడాలా, జనాలు సిగ్గు పడాలా?

ఆంధ్రాకు రాజధాని లేకుండా చేసింది, ఈ దిక్కుమాలిన సంస్కార హీన జనాలు కాదా, అంటే వారు ఒప్పుకుంటారా? ఎక్కువ మంది చూడటానికి, వినడానికి, మేము కూడా అవినీతి పరులతో కలసి అందలము ఎక్కవచ్చా? జన సంఖ్యను పెంచుకోవచ్చునా? అప్పుడు ఇంక మాకు నీతి గురించి మాట్లాడే హక్కు ఉంటుందా?

24* జనము చదవడం లేదు, వినడం లేదు అని మేము బాధపడాలా? లేక అయ్యో మా ముదుసలి తల్లి దండ్రులను అత్త మామలను ఎటూ చూడము, మా సంస్కార పిల్లల పెంపకం దగ్గర ముదుసలి తనము లో ఎటూ ఉండలేము, కపటం నటన అప్పు లేకుండా మా బతుకులు గడవవు, అని ధైర్యముగా చెప్పలేని వారు బాధపడాలా?

వారి పిల్లలు పెద్దలు, సినిమా నటీ నటుల అలాగే రాజకీయ నాయకులకు వంగి దండాలు పెడుతూ, వారి మోచేతి నీరు తాగుతూ, వారి పల్లకీలు మోస్తూ ఉంటే, మంచిని ఎందుకు ఆదరిస్తారు? వారి ముదుసలి తల్లి దండ్రులు అత్త మామలు/ కుటుంబానికి/ పిల్లలకు/ ఊరికి/ జిల్లాకు/ రాష్ట్రానికి/ తెలుగు కు మంచి ఎందుకు చేస్తారు?

మంచిని పెంచని, ప్రొత్సహించని, అండగా నిలవని పాపం ఎవరిది? అందుకే మీరు ఓడిపోయినా సరే, మనకు నష్టం లేదు. దేవుడు మీ నిజాయితీని గుర్తిస్తారు, చెడు సావాసాలు వద్దు, జనం స్వయం నిర్ణయం కు వదిలేద్దాము. వారి రాతకు వారే బాధ్యులు.

25* చంద్రన్న తో దోస్తీ అంటే, మనోహర్ రాజీనామా చేస్తారు అని అనుకున్నాము. కానీ చేయలేదు. అంటే, విలువలు తనకూ లేవా? లేక చంద్రన్న అంటే మోహమా? అదే జగనన్న తో, పవన్ కలుస్తారు అంటే, పార్టీ లో ఉంటారా? వారి తండ్రి గారి చరిత్ర మనకు తెలుసు. అలాగే మనోహర్ మౌనం, కొన్ని సార్లు అనుమానాలను పెంచుతుంది. ఎప్పుడైనా, తప్పు ఒప్పు ధైర్యముగా మాట్లాడావారినే మనము నమ్మాలి.

మనకు తోడు గా ఉండే వారు ఎప్పుడు, మన లోని తప్పును వెంటనే ఖండించాలి. అది చేయలేదు అంటే, వారు అవసర అవకాశవాదులు, ఏనాటికైనా వారితో వెన్నుపోటు తప్పదు. కల్పిత గాధలైనా, రామాంజనేయ క్రుష్ణార్జున యుద్దాలు చెప్పేది అదే, నీతి నియమాల దగ్గర, యజమానికైనా వాస్తవం చెప్పాలి, ధర్మం గొప్పది బంధం కన్నా.

గెలుపు ఓటములు దైవాధీనాలు, కానీ ధర్మం వీడవద్దు. చెడుతో కలవ వద్దు. ప్రజలు మంచిని చీత్కరిస్తే, నష్టం మనకు కాదు వారికే. అందుకే మహానుభావులు మనకు ప్రత్యక్ష సాక్ష్యం ఇచ్చి వెళ్ళారు - రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, శ్రీదేవమ్మ, కోడెలయ్య, కాఫీడేఅయ్య - వీరి జీవితాలలో చివరి పేజీలు చదవండి, పిల్లలకు, ప్రజలకు చెప్పండి. అలాగే మన జగనన్న, చంద్రన్న ను కూడా కేసులు, బెయిళ్ళు, స్టేలు, జైళ్ళు వదలలేదు. పంచభూతాలు ఎవరినీ వదలవు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1981 General Articles and views 1,680,984; 102 తత్వాలు (Tatvaalu) and views 207,967
Dt : 24-Sep-2023, Upd Dt : 24-Sep-2023, Category : Politics
Views : 186 ( + More Social Media views ), Id : 1925 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Pavananna , political , Ramayana , downfall , Vali , Ravana , fox , tiger , jagananna , chandranna , lokesh
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content