పాటతో పరమార్ధం- నారాయణ నీ లీల- బాలభారతము- ఎస్వీ రంగారావు, అంజలి, శ్రీదేవి, హరనాథ్ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,883,919; 104 తత్వాలు (Tatvaalu) and views 226,500.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Narayana Nee Leela - Bala Bharatam - SV Ranga Rao, Anjali, Sridevi, Haranath

పాటతో పరమార్ధం - నారాయణ నీ లీల, నవరసభరితం - బాలభారతము - ఎస్వీ రంగారావు, అంజలి, శ్రీదేవి, హరనాథ్

ఇలాంటివి పురాణాలు మాట్లాడుకుంటే రూపాయి రాదు ఉపయోగము లేదు అనుకుంటారు, మూర్ఖులు ముందు చూపు లేక, కానీ ఇవి ఉన్న రూపాయి అలాగే దానికన్నా ఎక్కువైన నూరేళ్ళ జీవితాన్ని కూడా, చేతిలో నుంచి వ్రుధాగా పోకుండా చేస్తుంది, మానసిక బలం పెంచి, ప్రాపంచిక మాయకు దూరముగా ఉంచి.

సొంత గా తెలుగులో మన జీవిత అనుభవాన్ని రాద్దాం, సొంత గా నాభి నుంచి పాడదాం, సొంత మాటలే స్టేటస్ లో పెడదాము, మిత్రులకు పంపుదాము.

ఐఐటీ లేదా ఇతర పెద్ద విద్యాలయాల లో చదివి, లక్షల సంపాదన ఉన్న వారు కూడా, జీవిత సమస్యలకు, ఎలా తట్టుకుని నిలబడాలో తెలియక, తప్పటడుగులు వేసి, తమ ప్రాణాలు ఒదులుతున్నారు లేదా ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు.

పిల్లలకు బాగా మనసుకు హత్తుకోవాలని, ఈ పౌరాణిక బాలల సినిమా తీసారు, ధన్యులు అయ్యారు నిర్మాత. మరి నేటి పెద్దలు ఎంత మందికి ఈ సినిమా ఉన్నది, అని తెలుసో తెలీదో. దయచేసి పిల్లలకు ఒక్క సారి పాట పాడి వినిపించండి, సినిమా చూపించండి.

మీకు ఎన్నో తీపి గుర్తులు జ్ఞాపకానికి తెస్తున్నాము, పాత సినిమాలు, ఆధ్యాత్మిక మానసిక శక్తి పెర్గాలి, అలాగే ముదుసలి తల్లి దండ్రులను మరువకూడదు అని సుమా.

కుట్రలు కుతంత్రాలు ఎలా ఉంటాయో, ఎలా అర్ధము చేసుకోవాలో, ఎలా ఎదుర్కోవాలో పాత్రలను బట్టి పిల్లలకు వివరించి, మానసిక బలం పెంచండి.

కోట్లు సంపాదించినా, ఎన్ని పదవులు అధికారాలు ఆస్తులు సంపాదించినా, అరిషడ్వర్గం అష్టవ్యసనం లకు, నిస్సహాయముగా బలైపోయారు ఎంతో మంది, మనందరికి తెలిసిందే.

కుంతికి, ధర్మ రాజు ముందు గా యువరాజు గా పుట్టాడని, గాంధారి కి తెలిసి, అసూయ చెంది, గర్భచ్చేదం చేసుకుంది. వ్రయ్యలైన, గర్భమ్మును, వ్యాసుడు, సంరక్షించెనూ, పిండమును, నూటొక్క కుండల, విభజించెనూ. అప్పుడే, పిండాలను భద్రపరచి, టెస్ట్ ట్యూబ్ బేబీలను పుట్టించిన ఘనత, మన పూర్వీకులకు ఉన్నది. ఇదే రుజువూ కదూ?

కలి పురుషుడు, కలిగే గాంధారికి, తొలి పుత్రుడు గా, దుర్యోధన జననముచే, దుశ్శకునమ్ములు ఎన్నో కనపడ్డాయి.

దుష్టుల శిక్షించుటకై, శిష్టుల రక్షించుటకై, అష్టమి శుభలగ్నమున, హరి, క్రిష్ణుని గా జన్మించెను.

హరి జ్ఞానము చే, తనయుని చేకొని, వసుదేవుడు, వ్రేపల్లెకు జేర్చేను. యశోద సుతయౌ, యోగమాయ నా, నిశీధమున తెచ్చే. నశింపజేయగ, దలచెడి కంసుడు, అశక్త దిగ్బ్రముడాయే ను నింగికెగసిన యోగమాయను చూసి.

కౌరవులూ, పాండవులూ, యాదవులూ అందరూ కారణ జన్ములు, సర్వులు ధారుణి, ప్రవర్దమానులైరి. దారుణ, హింసా కాండల, దానవ పతి కంసుడూ, ధనుర్యాగమని, బలరామకృష్ణుల, తన వద్దకు రప్పించే. అక్కడ నుంచి, ఇక అసలు కధ మొదలు అవుతుంది.

ఇక కౌరవుల దుశ్చేష్టలు, పాండవులను అవమానిస్తూ అంతమొందించాలని ఎన్ని ప్రయత్నాలు, అన్నిటి నుంచి క్రిష్ణుడు కాపాడారు, లేదా తమ తెలివి తేటలతో బయట పడ్డారు.

మరి పిల్లలకు అర్ధం అయ్యేలా చెప్పి, మానసిక బలవంతులను చేసి, అరిషడ్వర్గం అష్టవ్యసనం జయించే శక్తిని నేర్పి, ముదుసలి తనములో మీరు వారితో వారి ఇంట్లో దేవతలు గా కొలవబడాలని ఆశిస్తూ . . .


పల్లవి :
నారాయణ నీ లీల, నవరసభరితం
నీ ప్రేరణచే, జనియించే, బాలభా.రతం.. బాలభా.రతం - 2 సార్లు మొత్తం

చరణం 1 :
ముని శా.పముచే, వగచే., సతీ.పతులకూ..
తనయుల నొందే. మా.ర్గము, తా.పసి తెలిపే..

మును దుర్వా.సుడు, చెప్పిన మంత్రము చే.తా.. ఆ.. ఆ 2
తన వంశము, నిలపమని, జనపతి కోరే ||నారాయణ ||

చరణం 2 :
కృష్ణాగ్రజుడై, బలరాముడు, గో.కులమున, జనియించే..
కుంతికి, ధర్ముని, అనుగ్రహంబున, కులదీప కుడుదయించే..

ఆ శుభవార్తకు, గాంధారీ సతి, అసూయ చెందినదీ..
ఈసున గర్భ, తా.డన మింతి, తానొనరించినదీ..

వ్రయ్యలైన, గర్భమ్మును, వ్యాసుడు, సంరక్షించెనూ.. ..
పిండము.ను, నూటొక్క కుం.డల, విభజించెనూ...

వరమునిచ్చెను, వా.యుదే.వుడు,

అంత వనిత కుంతికి, పుట్టె భీ.ముడు

మొదటి కడవ జొచ్చెను, కలిపురుషుడు..

కలిగే గాంధా.రికి, తొలి పుత్రుడూ 2

దుర్యోధన జననముచే, దుశ్శకునమ్ములు దో.చే..

దుర్భర రావమ్ములకు, దుఖించెను జగతీ..

దుష్టుల శిక్షించుటకై.. శిష్టుల రక్షించుటకై..

అష్టమి శుభలగ్నమున, హరి సరుగున వెలసే..
హరి సరుగున వెలసే..||నారాయణ ||

చరణం 3 :
జనియించిన, హరి జననీ జనకుల, జ్ఞానుల గావించే..

తనయుని చేకొని, వసుదేవుడు, తా వ్రేపల్లెకు జేర్చే..

యశోద సుతయౌ, యోగమాయ నా, నిశీధమున తెచ్చే..

నశింపజేయగ, దలచెడి కంసుడు, అశక్త దిగ్బ్రముడాయే...

అమరేంద్రుని, అతినిష్టతొ, అర్చించెను కుంతి.
అతని వరముచే, నరుడే., అర్జునుడై పుట్టె..

నరనా.రా.యణ జననము, ధరణికి ముదమా.యే.
సురలు మురిసి, సుధలు చిందు, విరివా.నలు కురిసే...

శతపుత్రుల పిదప, నొక్కసుతను గాం.చె, గాంధా.రీ..
శకుని కూ.డ, సుతుని బడసి, సంతోషము తానొందె..
నాతి మాద్రి, అశ్వినులను, ప్రీతితో భజించే.
నకులుడు, సహదీవుడనే, నందనులను గాంచే..

కౌరవులూ.. పాండవులూ.. కమనీయులు యాదవులూ..
కా.రణ జన్ములు, సర్వులు ధారుణి, ప్రవర్దమాను..లై.రి.
దారుణ, హింసా. కాం.డల, దానవ పతి కంసుడూ
ధనుర్యాగమని, బలరామకృష్ణుల, తన వద్దకు రప్పించే...

చిత్రం: బాలభారతము (1972); సంగీతం: ఎస్. రాజేశ్వరరావు; గీతరచయిత: ఆరుద్ర; నేపధ్య గానం: ఘంటసాల

మన గాత్ర నైవేద్య సేవ - దయచేసి నాభి నుంచి పాడే/ జపించే ప్రయత్నం చేయగలరు - మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు; గొంతులో కఫము తగ్గడానికి; మనసు నియంత్రణ బలం కు; ధైరాయిడ్, ఊపిరితిత్తులు, గుండె, బీపీ, మానసిక వ్యాధుల నివారణకు; ఉత్తమ ప్రాణాయామ, ఆరోగ్యం, వాక్సుద్ది, మనశ్శాంతి, ఆధ్యాత్మికత, పూజకు.

BalaBharathamu-Narayana
 
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,883,919; 104 తత్వాలు (Tatvaalu) and views 226,500
Dt : 12-Jun-2023, Upd Dt : 12-Jun-2023, Category : Songs
Views : 362 ( + More Social Media views ), Id : 1789 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Narayana , Leela , Bala , Bharathamu , Bharatam , SV , RangaRao , Anjali , Sridevi , Haranath
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content