Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు.
1 min read time.
*1. సాత్విక తల్లులు, ఆస్తులు అన్ని ఉన్నా కూడా, ఉద్యోగాలు పదవులు చేసి ఆస్తులు పెంచడం వలన, కష్టమా, లాభమా? లేక త్రిమూర్తు లకే మూలమైన ఒక ఆదిశక్తి గా, గురుతరమైన బాధ్యత తో, పిల్లలకు సంస్కారం దైవ చింతన అరిషడ్వర్గాల సాధన నేర్పి, కనీసం మనల్ని వృద్ధాప్యం లో లాలించేటట్టు చేయడం సుఖమా, లాభమా?*
*2. ఏలిననాటి శని ప్రభావాన్ని, రూపాయి ఖర్చు పెట్టకుండా పూజ పునస్కారం లేకుండా, సొంత సజీవ గురువు సేవతో ఎలా, ఆనందముగా తలవంచి ఎదుర్కోవచ్చు?*
జవాబు - ఎప్పుడూ మన సొంత అనుభవాలు సొంత మాటలలో చెపుదాం. సోషల్ మీడియాలో పది సార్లు దేవుని ఫోటో పెట్టినా, పైపైన నోటి తో అన్నా, పురాణ కధలు చెప్పినా, అది త్రికరణ శుద్దికి సమానం కాదు. అది సిద్దాంతము లో ఒక భాగం కావచ్చు, అంటే అవి గొప్పవే కావచ్చు.
భోజనం ఎదురు గా ఉంటే, ఆకలి తీరదు, కడుపులోకి వెళితేనే, చక్కగా జీర్ణమైతేనే, దాని నుంచి శక్తి వచ్చేది, శరీర భాగాలకు అందేది.
అలాగే, ప్రాక్టికల్ లేనిదే అంటే చిత్తశుద్ది ఆచరణ లేనిదే మనిషికి అంటే మనకు ఫలితము లేదు. అంటే మన మనస్సు స్పందించి, చేతలలో అవే పనులు చెయ్యాలి, రాతలలో మాత్రుభాషలో రాయాలి, నోటితో పది మందికి చెప్పాలి పంచాలి సుమా.
ఈ వారం పార్క్ లో కూర్చుని ఉంటే, ఒక తమిళ పెద్దావిడ వచ్చి, అమ్మకు నమస్కారం చేసి, పక్కన కూర్చుని, కన్నీళ్ళతో ఇంగ్లీష్ లో చెపుతున్నది, మేమిద్దరమూ మద్రాస్ లో ఉద్యోగం చేసి బాగానే సంపాదించాము, పిల్లలకు అన్ని ఇచ్చాము, మంచి ఉద్యోగాలలో ఉన్నారు మంచి సంపాదనతో. ఏ లోటులేదు తినడానికి ఉండటానికి. కానీ అసలు దే లేదని ఇప్పుడు అర్ధము అయ్యింది. 6 నెలలకు పిల్లల దగ్గరికి వచ్చా, మోకాళ్ళ ఆపరేషన్ అంటే, ఊళ్ళో డాక్టర్ తెలీదు అంటున్నారు పిల్లలు. మిమ్మల్ని గుడిలో చూస్తున్నా చాలా రోజులుగా, ఎంత అద్రుష్ట వంతులు సంస్కారవంతులు మీరు అంటూ చేతులు పట్టుకుంది. అమ్మకు అర్ధం కాక నా వైపు చూస్తే, అర్ధము చెప్పినా, పర్లేదు అన్ని సర్దుకుంటాయి లే అని చెప్పింది ఆమెతో.
మహిళా పక్షపాతి గా, 8 ఏళ్ళు గా సొంతగా 10 అడుగులు నడవలేని, 76 ఏళ్ళ ముదుసలి కన్న తల్లి ని, ప్రాపంచిక భ్రమల ద్రుష్టిలో ముద్దుల కూతురు గా సాకడం లా ఉన్నా, రోజూ మైలు చేయిపట్టి నడిపిస్తున్నా,
వాస్తవ ఆధ్యాత్మిక ద్రుష్టిలో అమ్మల గన్న అమ్మ చాలా పెద్దమ్మ అయినా ఆదిశక్తి, తన రూపాన్ని అండగా ఇంట్లో మన పక్కన సాత్విక అమ్మ లా పెట్టి, 7 న్నర ఏళ్ళ ఏలిననాటి శని కి ఎదురు నిలబెట్టింది, కాపాడింది. సాత్విక సజీవ గురువు అయిన 60 ఏళ్ళు దాటిన అమ్మ/ అత్త / దగ్గరలో ఉన్న ఇతర ముదుసలి వారు/ పసి పిల్లలు మనతో ఉంటే, శని తీవ్రత తగ్గుతుంది, ఎందుకంటే మన బుద్ది గురు వు అండతో, పద్దతి గా నడుస్తుంది కాబట్టి.
10 ఏళ్ళ లోపు అమాయక పసివారు లేదా 60 దాటిన సాత్విక ముదుసలి తల్లి దండ్రులు/ అత్త మామలు దైవం తో సమానం అని మనకు తెలుసు కదా?
ఎందుకంటే, భారతీయ వేదము లో, పురుషుని కన్నా మహిళను గొప్పగా ఆదిశక్తి గా పోల్చింది, గౌరవించింది. త్రిమూర్తులే తలవంచి నమస్కరించే స్థాయిలో ఉంచింది. ప్రపంచములో ఇంకే మతము కూడా, స్త్రీ కి ఆ శక్తి ని ఉన్నత స్థానాన్ని ఇవ్వరు, ఇవ్వలేరు.
కూతురు గా, తల్లి గా, చెల్లి గా, అక్కగా, భార్యగా, గురువు గా, అందరి తలలో నాలిక లా, మెట్టినింట్లో సంసారాన్ని ఈదడమంటే లాక్కుని రావడమంటే, భిన్న మనస్తత్వాల మధ్య, ఆ గురుతరమైన బాధ్యత సహనం ఓపిక నీతి నియమము సంస్కారం, ఆ బ్రహ్మకు కూడా వల్ల కాదు సుమా. అందుకే ఆదిశక్తి అన్నారు.
మరి నేటి మహిళలు ఆ భాధ్యతలకు భయపడి, అమ్మో మాకు ఆదిశక్తి పదవి వద్దు, మా వల్ల కాదు, తేలిక ప్రాపంచిక వాదశక్తి పదవి చాలు అంటున్నారు.
సొంత పిల్లలను, ఆయా తో నో, అమ్మమ్మ తో నో, డే కేర్ తోనో, ఇంట్లో గాలికో వదిలేసి, కుసంస్కార వంతులు గా మార్చి, వారి పతనానికి బాటలు వేసి, ఇంటికి దూరముగా 8 గంటలు గడుపుతూ ఉన్నారు.
బయట రాజ్యం చేద్దామని వెళ్ళి, ఎంత సాధించినా, ఎంత ఎత్తుకు ఎదిగినా, సొంత ఇల్లు మాత్రం, సంస్కారము విలువలలో పతనము అవుతున్నది ఇప్పుడు. మన పిల్లలు నోరు తెరిస్తే, మనమే భయపడి పారిపోతున్నాము, హాస్టల్ లో వదిలేసి, అన్ని ఉన్న అనాధలుగా.
తిండి గడవక, బతుకు తెరువు కోసం వెళ్ళిన, పుణ్యమూర్తుల గురించి కాదు ఇది. వారు బయట పని చేసినా, పిల్లల సంస్కార పెంపకమును వదలరు. ఇది అన్ని ఉండి కూడా, ఇంకా ఏదో సంపాదించాలని, గాలిలో మేడలు కట్టి, పిల్లలను గాలికి వదిలి, సంస్కారం నేర్పని వారి గురించి మాత్రమే.
నేటి మహిళలు కూడా, ఆనందముగా, అంత బాధ్యత ఓపిక సహనము మాకు లేదు అని ఒప్పుకుని, బయట బాధ్యత లకే మొగ్గు చూపుతున్నారు.
హాయిగా, ఉద్యోగము లేదా పదవి చేపట్టి, మేము బంధాలు సంబంధాలు లేని కొన్ని తాత్కాలిక ప్రాపంచిక పనులకే పరిమితమౌతాము, అని తమకు తాము తగ్గించుకుంటున్నారు.
ఆ తర్వాత చివరిదశలో, ఒంటరిగా ఇంట్లో లేదా అనాధాశ్రమములో మిగిలి పోతున్నారు, సొంత పిల్లలే కనికరం లేకుండా పట్టించుకోకపోతే తమ దగ్గర ఉంచి.
ఒక మహిళ (పురుషుడైనా అంతే), ఎంత త్రుప్తి సాధించింది తన జీవితము లో అంటే, గొప్ప దేశ ప్రధాని గా, లేదా పార్టీ అధ్యక్షులు గా, లేదా కంపనీ సీయీవోగా అని ఇతరులు చూస్తారు ప్రాపంచిక మోహములో.
కానీ ఆ తల్లే తనకు తాను, 60 ఏళ్ళ తర్వాత కదలలేని వయస్సులో బేరీజు వేసుకుంటుంది - బయట ఇంత సాధించిన దాన్ని, (ఒకవేళ బిడ్డలు సంసారం ఉంటే సుమా) ఇంట్లో నా బిడ్డలను సంస్కారము గా పెంచి, కనీసం నాకు నా భర్త కు అండగా కూడా పెట్టుకోలేక పోయానే, నా మాట ఒక్కరూ వినే వారు లేరే, ప్రేమగా చెయ్యి పట్టి నడిపించేవారు లేరే అని, కన్నీరు మున్నీరు గా విలపిస్తుంది. చేతులు కాలాక, ఆకులు పట్టుకుని ఉపయోగం ఉందా?
ఇప్పుడే మేల్కొందాము, పిల్లలకు సంస్కారం నేర్పించ గలిగితే, బయట ఉద్యోగం వ్యాపారం పదవి చేసినా పర్లేదు సుమా.
శని దేవుడు కూడా, ఆది శక్తి మన పక్కన ఉన్నా, ఆయన కర్తవ్యాన్ని ఆయన మరువడు.
అలాగే భక్తులను బిడ్డలను కాపాడే ఆ పెద్దమ్మ, బిడ్డలను కాపాడే ఈ ఇంట్లో అమ్మ కూడా, తరుణోపాయాన్ని, మనకు ఎప్పుడూ చెపుతూ, ఆ శనయ్య తీవ్రతను తప్పక తగ్గిస్తారు సుమా.
Sattvic mothers, do job raise assets, profit? teaching children samskar benefit in old age? Saturn effect?
Sri, Telugu ,
15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2222 General Articles and views 2,493,627; 104 తత్వాలు (Tatvaalu) and views 267,414
Dt : 17-May-2022, Upd Dt : 17-May-2022, Category : General
Views : 766
( + More Social Media views ), Id : 1395
, State : Andhra/ Telangana (Telugu)
, Country : India
Tags :
mother ,
elders ,
home ,
mothers ,
job ,
assets ,
profit ,
teaching ,
children ,
samskar ,
benefit ,
old ,
age ,
saturn ,
effect
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో.
అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments