పాటతో పరమార్ధం - మొరవిన రాదా సంతోషీ మాతా(భక్తి పేరడీ) - జై సంతోషి మాత - కనన్ కౌశల్, ఆశిష్ కుమార్ - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,078; 104 తత్వాలు (Tatvaalu) and views 226,385.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Moravina rada Moranuvinu Santoshi mata (Bhakti Parody) - Jai Santhoshi Maa - Kanan Kaushal, Ashish Kumar, Anita Guha, Bharat Bhushan, Rajani Bala

मदद करो संतोषी माता (Madad Karo Santoshi Mata) (भक्ति पैरोडी) - जय संतोषी माता - कानन कौशल, आशीष कुमार, अनिता गुहा, भारत भूषण, रजनी बाला

*పాటతో పరమార్ధం - మొరవిన రాదా మొరనువిను సంతోషీ మాతా(భక్తి పేరడీ) - జై సంతోషి మాత - కనన్ కౌశల్, ఆశిష్ కుమార్*

The whole original song goes like this, Mom, these are our problems, please help to be solved. But yesterday in a different song, we discussed that we should ask mother to give us courage to face difficulties, but not to ask her to solve difficulties. They don't go away.

అసలు పాట అంతా, అమ్మా మా కష్టాలు ఇవి, అవి తీర్చమ్మ, అని ఈ విధముగా ఉంటుంది. కానీ నిన్న వేరే పాటలో, చెప్పుకున్నాము కదా, అమ్మను కష్టాలు ఎదుర్కొనే మనోధైర్యము ఇవ్వమని అడగాలే గానీ, కష్టాలు తీర్చమని అడగకూడదు. అవి తీరవు.

That's why we have changed the lyrics of the song in such a way as to increase the emotional strength. You should sing too.

అందుకే పాటను పూర్తిగా మనో బలాన్ని పెంచే విధముగా అక్షరాలు మార్చాము. మీరూ పాడాలి మరి.

Didn't Rama walk to Lanka to find Sita? We read that the Pandavas fought hard for 18 days, even with Krishna by their side, to get the kingdom.

రాముడు సీతను కనుగొనడానికి లంక దాకా నడచి వెళ్ళారు కదా? పాండవులు రాజ్యం పొందడానికి, క్రిష్ణుడు పక్కన ఉన్నా, 18 రోజులు కష్టపడి యుద్దం చేసారు అని చదివాము కదా.

And, if we keep our mind pure and walk in good path, we will have divine grace. If we are like Duryodhana, Ravana, Kaika, Lankhini, Surpanakha in illusions, Panchabhuta sikshaNa is a must.

మరి, మన మనసును నిర్మలముగా ఉంచుకుని, మంచి దోవలో నడిస్తే, దైవ అనుగ్రహము ఉంటుంది. మనము దుర్యోధన, రావణ, కైక, లంఖిణి, శూర్పణఖ లాగా బ్రమలు లో ఉంటే, పంచభూత శిక్షణ తప్పదు కదా.

Mistakes need to be confessed, repented, punished, it's for anyone, you and us.

చేసిన తప్పులు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపం పొందాలి, శిక్ష అనుభవించాలి, అది ఎవరికైనా తప్పదు, మీకు మాకు.

We should tell Mom that conquering difficulties is our duty and our virtue is our fortune.

కష్టాలను జయించడమే మాకు శరణ్యం, మా పుణ్య భాగ్యమిదేనూ అని అమ్మకు చెప్పుకోవాలి.

If the devotee's heart cries, there is no value in devotion, and there is no purity in eternal worship. It is not fair for us to harm our own parents and inlaws who have done good. Who in this world can give us relief, from our desires/ illusions? Show me, mother, as a Guru.

భక్తుల మనసు రోదిస్తే, మరి భక్తికి విలువే లేదూ, నిత్య పూజలో శుద్దీలేదు. మేలు చేసిన సొంత తల్లి దండ్రులు అత్త మామలకు కీడు చేయుట, మాకిది న్యాయము కాదు. ఎవరమ్మా ఈ లోకములోనా, మా మోహాలను/ బ్రమలను వదిలించే దాతా? దోవ చూపెట్టు అమ్మా, గురువు గా.

If we do wrong, we will be punished, even for these deadly sins. You are the mother of all, do come to punish and rule.

తప్పే చేస్తే తప్పదు దండన, ఈ విష పాపులపైనా. అందరికీ అమ్మవు నీవే, శిక్షించి పాలించగ రావా.

Parody

మొరవిన రా.దా. మొరవిన రా.దా.

మొరనువిను సంతోషీ మాతా . . .2
భక్తుల కేను నిత్య పరీక్షలమ్మా. . .
అం.దరి కంటే ఆత్మబలమివ్వు. . . , మాతా. . మాతా. . ||మొరనువిను||

మారనిదీ మా కధా అన్నిటా, వేదనలే మిగిలేను.., ఆవేదనలే మిగిలేను., అమ్మా.
పగబూనే ఆ విధి మాపైనా, శోకాలే రగిలేను.., పెను శోకాలే రగిలేను.. , అమ్మా.
జయించడమే మాకు శరణ్యం 2, మా. పుణ్య భా.గ్యమిదే.నూ.?
మాతా..మాతా.. ||మొరనువిను||

భక్తుల మనసు రోదిస్తే, మరి భక్తికి విలువే లేదూ.., నిత్య పూజలో శుద్దీలేదు., అమ్మా.
మేలుచేసిన వారికి కీడు చేయుట, మాకిది న్యాయము కాదు.., ఇది మాకే న్యాయము కాదు, అమ్మా.
ఎవరమ్మా ఈ లోకములోనా..2, మోహాలను వదిలించే దాతా..,
మాతా..మాతా.. ||మొరనువిను||

హే జగదంబా, మా నోములలో లోటేదైనా కలదా.., ఏ లో.టే.దైనా కలదా., అమ్మా.
తప్పే చేస్తే తప్పదు దండన, ఈ విష పాపులపైనా.., ఈ విష పాపులపైనా., అమ్మా.
అందరికీ అమ్మవు నీవే..2, శిక్షించి పా.లించగ రా.వా.
మాతా..మాతా.. ||మొరనువిను||

Original

మొరవిన రా.దా. మొరవిన రా.దా.
మొరనువిను సంతోషీ మాతా . . .2
భక్తుల కేలా ఈ పరీక్షలమ్మా. . .
అం.దరి ముందే అపనిందేనా. . . , మాతా. . మాతా. . ||మొరనువిను||

మారనిదీ నా కధా అన్నిటా, వేదనలే మిగిలేనా.., ఆవేదనలే మిగిలేనా., అమ్మా.
పగబూనే ఆ విధి నాపైనా, శోకాలే రగిలేనా.., పెను శోకాలే రగిలేనా.. , అమ్మా.
మరణించడమే నాకు శరణ్యం 2, నా. పుణ్య భా.గ్యమిదే.నా.?
మాతా..మాతా.. ||మొరనువిను||

భక్తుల మనసు రోదిస్తే, మరి భక్తికి విలువే లేదూ.., వ్రత పూజకు మహిమేలేదు., అమ్మా.
వేడిన వారికి కీడు చేయుట, నీకిది న్యాయము కాదు.., ఇది నీకే న్యాయము కాదు, అమ్మా.
ఎవరమ్మా ఈ లోకములోనా..2, మొరాలించి పాలించే దాతా..,
మాతా..మాతా.. ||మొరనువిను||

హే జగదంబా, నా నోములలో లోటేదైనా కలదా.., ఏ లో.టే.దైనా కలదా., అమ్మా.
తప్పే చేస్తే ఎందుకు దండన, ఈ పసి పాపలపైనా.., ఈ పసి పాపలపైనా., అమ్మా.
అందరికీ అమ్మవు నీవే..2, మన్నించి పా.లించగ రా.వా.
మాతా..మాతా.. ||మొరనువిను||  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,078; 104 తత్వాలు (Tatvaalu) and views 226,385
Dt : 26-Feb-2024, Upd Dt : 26-Feb-2024, Category : Songs
Views : 128 ( + More Social Media views ), Id : 2037 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Mora , Vinaraadaa , Moravinu , Radha , Moravina , rada , Moranuvinu , Bhakti , Parody , Jai , Santhoshi , Maa , mata , Santoshi , Kanan , Kaushal , Ashish , Kumar , Anita , Guha , Bharat , Bhushan , Rajani , Bala
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content