లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే, తొలి చూపు ప్రేమ, గుడ్డి ది అంటారు? ప్రేమికుల దినం - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1625 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1660 General Articles, 64 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

95 శాతం నిజం, ప్రేమ వెనుక బాధ్యత ఉంటే మాత్రము, అది కరెక్టే, అలాంటి వారు తొందరపడరు దేనికీ. ముందు ఒక అభిప్రాయం ఏర్పరచుకున్న తర్వాత, కొన్ని నెలలుగా అన్ని గమనించి, ఇంట్లో మంచి తనం మరియు బాధ్యత గల, పెద్దలు లేదా అన్నలు అక్కలు మావలు తో చెప్పి, ఆ తర్వాత మాత్రమే ముందుకు కదులుతారు, పబ్లిక్ గా అందరి ఎదురుగా.

కానీ ప్రేమ ముసుగులో, మోహం, వ్యామోహం, కామం ఉన్న వారు, ఎవరికీ చెప్పకుండా, దొంగ చాటుగా, ముందు ఆత్రం అవివేకం లో, బురద గుంటలో కాలుపెడతారు.

ముందు బురద ఆరోగ్యం అని అందరికి ఉపన్యాసాలు ఇచ్చి, అ తర్వాత తలనొప్పి తో కోర్టు లో, కడుగుకునే ప్రయత్నం చేస్తారు. లేదా జీవితాంతం ఆ భయము తో వ్యామోహం తో, బంధీలుగా బానిసలు గా, జీవితం కొనసాగిస్తారు, తప్పు కోవడానికి ఇంకో దోవ లేక.

ఇంకా విచిత్రం ఏమిటి అంటే, వయస్సు 40 దాకా, ప్రేమ కోసం రక్త తర్పణం చేసిన వారే, మరలా తమ పిల్లలకు మాత్రం, ప్రేమ వద్దు జీవితము ముఖ్యము అంటారు.

అయితే, నూటికి ఓ ఐదుగురు సక్సెస్ అయిన వారూ ఉంటారు కదా ఎందులో అయినా. ఎందుకంటే వారికి బాధ్యత తెలుసు, అది మోహం కాదు కాబట్టి.

మరి పెద్దలు చేసిన పెళ్లి కూడా విఫలం అవుతుంది కదా? అంటారా. అది కూడా నిజం ఎందుకంటే, పిల్లల పెద్దల గుణ గణాలను బట్టి, పెళ్లి చేసే రోజులు ఇప్పుడు ఉన్నాయా? చరిత్ర చూస్తున్నారా? లేదు కదా. మరి ఫలితాలు దాన్ని బట్టే.

కోటీశ్వరులా, బెంగుళూరు లేదా ఢిల్లీ లేదా విదేశీ ఉద్యోగమా, ఆస్తులు, పలుకుబడి, పదవులు, అవసరాలు మాత్రమే ఈనాడు అందరికి కొలబద్దలు.

పిల్లల మనసులు, స్వభావాలు, విలువలు, కలసి పది రోజులు ఉంటారా, అన్న విషయం ఎవరికీ పట్టడం లేదు, అవసరము ఉన్నట్టుగా భావించడము లేదు.

అందుకే ఎక్కడ చూసినా ప్రేమ వివాహాలు లేక పెద్దల వివాహాలకు కళ్యాణ మండపాలు ఖాళీ లేవు. నేడు అది ఒక పెద్ద వ్యాపార పరిశ్రమ. అలాగే విడాకులకు కోర్టులు కూడా ఖాళీగా లేవు. లాయర్లకు చేతి నిండా పని.

అయితే విడిపోయేటప్పుడు, పెద్దల వివాహం లో మాత్రము కనీసం ఇద్దరు కుటుంబ సభ్యులు అయినా తోడుగా ఉంటారు. ప్రేమ వివాహం కు చెందిన, విడాకుల లో అవీ కూడా ఉండవు, ఎవరు కూడా తోడు రారు, ఎందుకంటే మనము ఎవరినీ లెక్క చేయలేదు కాబట్టి.

25 ఏళ్లుగా పెంచిన తల్లి దండ్రుల మీద లేని ప్రేమ విశ్వాసము బాధ్యత, ఈ రోజు మధ్యలో వచ్చిన జీవిత భాగస్వామి మీద ఉంది అంటే, మనస్పూర్తిగా నమ్మేవారి గురించి, అనుకోవడం అనవసరం. కాలమే అందరి భ్రమలు తొలగించి, తగిన తీర్పు చెపుతుంది.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1660 General Articles, 64 Tatvaalu
Dt : 14-Feb-2020, Upd Dt : 14-Feb-2020, Category : General
Views : 803 ( + More Social Media views ), Id : 338 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : love marriage , arranged marriage , love at first sight
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content