కౌరవులు వారి బంధువులు, తమ తప్పు సరి చేసుకోకుండా, క్రిష్ణునిది పాండవులది తప్పు అన్నారు - Health - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1629 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1664 General Articles, 64 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

కరోనా గురువుని గౌరవించి, ఆయనకు దూరము గా ఉండండి. ఆయన పోయిన సంవత్సరమే, వెనక్కి వెళ్ళిపోవాలి మనల్ని పలకరించి, ఇంకో గ్రహము లో పని ఉంది ఆయనకు.

కానీ మనము ఇష్టం వచ్చిన విధము గా, వీధుల్లో తిరుగుతూ, నిర్లక్ష్యముగా ప్రభుత్వం మాట వినకుండా, జనాభా ను తగ్గిద్దామన్న, సత్సంకల్పముతో చేస్తున్న అవిరామ క్రుషికి, గురువు గారు మన మాట కాదనలేక, మన సంకల్పానికి పరవశుడై ప్రీతి చెంది, సహకరిద్దాము అని నిర్ణయించుకుని, ఇక్కడే ఉన్నారు, మనల్ని వీడలేకపోతున్నారు.

దయచేసి గురువు గారిని, ఇంకో గ్రహము నకు వెళ్ళే, సదావకాశాన్ని మనమే కల్పించాలి, నీతి నియమాలు సంస్కారం, ప్రభుత్వ మరియు పోలీసు సూచనలు, పాటిస్తూ.

మన తప్పుడు ఓటుతో 20 ఏళ్ళు గా ఎన్నుకున్న, నాయకులు కూడా, నిర్లజ్జగా నిర్దయగా మనల్ని ఒంటరిగా చేసి, భాగ్యనగరము వెళుతూ, అక్కడ వైద్య సేవలతో సేద తీరుతూ, మనకు మాత్రం ఆంధ్రాలోనే, ఉచిత ఇహలోక మోక్ష అంతిమ సేవా, భాగ్యం కల్పిస్తున్నారు క్రుతజ్ఞతలు తో.

మనము వారి వారసులకే, ఇంకొన్ని తరాలు బానిసలుగా మరలా మరలా ఓటు వేసి, మిగతా భూ పాప భారాన్ని పూర్తి గా తగ్గిద్దాము.

మనదే ముమ్మాటికి తప్పు, కరోనా గురువు ది కాదు.

కౌరవులు వారి బంధువులు అంతా తమ తప్పు ఒప్పుకుని సరి చేసుకోకుండా, క్రిష్ణునిది పాండవులది తప్పు అన్నారు, చివరకు ఎవరూ మిగలలేదు.

అలాగే రావణ రాక్షసుడు వారి పరివారం కూడా, రాముని దే తప్పు అన్నారు, లంకను సర్వనాశనం చేయించాడు.

కరోనా జాగ్రత్తలు. బయట తిరగ వద్దు అనవసరముగా. 2 పొరల కాటన్ మాస్క్లు 2, చేతుల గ్లౌస్, ప్రతి మనిషికి 6 అడుగుల దూరం.

టీకాలు తప్పని సరి. వాటి తో పాటు గా, కాకర అల్లం వెల్లుల్లి పచ్చి రసం, రోజు ఉదయం 7 లోపు పరగడుపున.

ఇంకో రోజు కాకర బదులు గా, ముల్లంగి ఒక రోజు, కొత్తిమీర కరేపాకు పుదిన ఒకరోజు, సెలరి ఒకరోజు, కాలే ఒకరోజు, అలా అల్లం వెల్లుల్లి తో కలిపి, రోజు కు ఒక రకం రసం తీసుకుంటే, ఇమ్యూనిటి పెరుగుతుంది.

ఇలాగే మనము ఆరోగ్యము గా, మిగతా పండుగలు మిగతా సంవత్సరాలు జరుపుకుందాము కలసికట్టు గా, జగమంత కుటుంబం మనది.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1664 General Articles, 64 Tatvaalu
Dt : 20-Apr-2021, Upd Dt : 20-Apr-2021, Category : Health
Views : 468 ( + More Social Media views ), Id : 1106 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : kauravas , correcting , wrong , krishna , pandavas , fault , corona , kovid , immunity , precautions , mask , distance
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content