గురువు కోర్కెలు తీర్చరు, గురువు క్రుప జ్ఞానం తో, జీవిత కష్టాలు దాటాలి, పరమాత్మను చేరాలి - Devotional - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1241 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1271 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

నిన్న బాబా గుడి లో, 4 మరాఠా హారతులు, కంప్యూటర్ లో కాపీ చేసి, వారికి పాటలు ఇచ్చి వచ్చే, భాగ్యం కలిగింది.

ముందు రోజే, మొదటి సారిగా, సాయంత్ర మరియు రాత్రి, హారతి పాడే భాగ్యం కలిగింది.

అందరూ, వింత గా చూస్తున్నారు. ఏదో అలా షో కు వచ్చి, నిల్చుని, ఇలా పోయే వారము, పరాయి భాష బాబా కు కూడా, మేము అనవసర శక్తిని వాడి, పుస్తకము ఫోన్ చూసి చదువుతూ, అరగంట గొంతు ఎత్తి అరచి పాడాలా అని?

మరి ఇప్పుడు తప్పని సరై విధిలేక, కొందరు గొంతు కలిపే ప్రయత్నం చేసారు, ఈ బండ గొంతు (గార్ధభ స్వరం) ఇన్ని రోజులూ విన లేదే, ఇప్పుడు తగలబడింది అని.

వారు ఇప్పుడు దాకా, హిందీ హారతులు పెడుతున్నారు, సగం పైగా అర్ధము కావు మనకు, మరాఠా గీతాలు అలవాటు పడ్డాక. 4 హారతులు స్పష్టముగా వచ్చు, సగం చూడకుండా కూడా పాడ గలం, అని మీకు తెలుసు.

ఆయన లాగా, ఒంటి మీద సాధారణ దుస్తులు తప్ప, అలంకారాలు ఆభరణాలు ఉండవు, ప్రాపంచిక మోహానికి, సౌకర్యాలకు దూరం గా ఉంటాము. ఆయన లాగనే, నేల మీద నిద్ర పోతాము, మిత శాఖాహారము తో.

మరి, ఈ భక్తులు, ఆ పనులు చేస్తారా? చేయరు.

అంటే, మన తెలుగు గురువులను ఎటూ గౌరవించరు అనుకరించరూ, కనీసం ఇతర గురువులను కూడా, పూర్తిగా ఫాలో కారు, అంతా పై పైన.

నోటికి హారతులు 4 కూడా రావు సుమా, అయినా మేము బాబా భక్తులమే అంటారు వాదిస్తారు, ఖర్మ. అంతా కొంత కొంత, అందుకే పిల్లల జ్ఞానం కూడా, అంతంతే కదా?

ముందు పురుష సూక్తము, శ్రీ సూక్తము, మంత్రపుష్పం, ఇతర శ్లోకాలు పద్యాలు, వేమన పద్యాలు, బ్రహ్మం గారి కాలజ్ఞానం, అన్ని నేర్చుకున్నాక, ఇతర భాషల గురువు గీతాలు నేర్చుకోవడం తో, ఇబ్బంది లేదు కదా?

మా పూజలో తెలుగు జాతికి తండ్రి లాంటి వారు, బ్రహ్మం, రాఘవేంద్ర, వేమన కూడా ఉంటారు. మీరు మొన్ననే, ఫోటో కూడా చూసారు.

ఇది పిల్లలకు అర్ధము అయ్యేలా చెప్పకపోవడము వలనే, ముదుసలి తల్లి దండ్రులను వదిలేసి, పరాయి మోహములో పడుతున్నారు.

ఇన్నేళ్లు లేదా రోజులు, ఆ గుడి వారు హారతులు చేస్తున్నారు, ఎంతో మంది వస్తున్నారు, మరి సరిచేయడానికి ఎవరూ ముందుకు రాలేదు.

నిబద్దత లేని మనకెందుకు లే, ఏదో అందరూ చేస్తున్నారు, ఎందుకో తెలీదు, మనమూ గొర్రెలు లా అనుసరిద్దాము, అంతేనా మన సంస్కారం? వారు వినకపోయినా, కనీస ప్రయత్నం చేసి, ఓడి పోమా?

మరి కర్మ సిద్ధాంతం నమ్ముతారా? ఎందుకంటే బాబా, అంటే మన బాబాయి, నా కోసం ఆ పని ఆ భాగ్యం ఆపి ఉంచారు ఏమో, ఇన్నాళ్ళు.

అందుకే నిబద్దత తో, సొంత భాష తండ్రి లాంటి వారు, బ్రహ్మం రాఘవేంద్ర వేమన గార్లకు మొదట గౌరవం, బాబాయి లాంటి బాబా కి కూడా ఆ తర్వాత గౌరవం తప్పక ఇవ్వాలి.

తల్లి అందరికీ తల్లే, కాని కన్న తల్లి కాదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన జిల్లా కలెక్టరే, మనకు ముందు ముఖ్యం. అట్లని, ఇతర ముఖ్యమంత్రులు కలెక్టర్లు తక్కువ అని కాదు, వారి జనాలకు వారూ అంతే ముఖ్యం కదా. ఎవరి గౌరవం వారిదే.

మనము ఎంత మూర్ఖులము అంటే, పొరుగింటి పుల్ల కూర రుచి మరిగిన మనము, పక్కన ఉన్న, తమిళ రమణ మహర్షిని ఆరాధించము, మందిరాలు కట్టము. ఎందుకంటే, ఇతర బాబాల అంత పబ్లిసిటీ, తప్పుడు ప్రచారం లేదు కాబట్టి. లేదా గిరి ప్రదిక్షణ చేయాలి అంటే కష్టం కాబట్టి కూడా, కదూ?

గురువు కోర్కెలు తీర్చరు, ముక్తి కి మార్గం మాత్రమే చూపుతారు. అబద్ధాలు మోస గాళ్ళ మాయలో పడకండి. దూరపు కొండలు నునుపు.

పరాయి లేదా ఏ గురువు వలన అయినా, ధనం ఐశ్వర్యం వచ్చింది, పనులు అయ్యాయి అని చెప్పే వారు, తమను తాము మోసం చేసుకుంటూ, ఆ గురువు ను అవమానిస్తూ హేళన చేస్తూ, ఇతరుల ను మోసం చేస్తున్నారు.

గురువు ఎవరి కోర్కెలు తీర్చరు, బాహ్య మోహం వదలించి, తత్వ ఆత్మ జ్ఞానం పెంచి, దేవుని వైపు చూపు మరల్చి, కఠిన పరీక్షలు పెట్టి, ముక్తి మార్గం మాత్రమే చూపుతారు.

క్రుష్ణుడు, అర్జునికి అండగా ఉండి, యుద్దం చేయించారే గాని, మాయతో క్షణము లో గెలిపించ లేదు కదా?

ప్రజలను మోసగిస్తున్న వారిని, ఆ గురువే ఆదరించరు, వారికి శిక్షలు వేస్తారు భవిష్యత్తు లో.

బడిలో గురువు, పాఠం మాత్రమే చెప్పాలి, విద్య మాత్రమే నేర్పాలి. నేను తప్పక పాస్ చేయిస్తా, ఆ బాధ్యత నాది, పై వాళ్ళు తెలుసు లేదా శక్తి ఉంది అంటే? తప్పు కదా.

విద్యార్థులు, గురువు దగ్గర నేర్చుకున్న సొంత జ్ఞానం తో, పరీక్ష రాసి, ఎక్కువ మార్కులతో, పాస్ కావాలి.

అంటే, మనము గురువు దగ్గర నేర్చుకున్న జ్ఞానం తో, జీవిత కష్టాలు దాటాలి, పరమాత్మను చేరాలి.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1271 General Articles, 47 Tatvaalu
Dt : 25-Jul-2021, Upd Dt : 25-Jul-2021, Category : Devotional
Views : 137 ( + More Social Media views ), Id : 1226 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : baba , guru , desires , difficulties , life , wisdom , krupa , supreme , god
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content