APLatestNews.com top Banner

Social Media links
కోవిడ్ గురువు కు ప్రాణదక్షిణ, జనాభా అప్పులు నియంత్రణ, త్యాగధనులకు వందనాలు - General - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 నిమిష చదువు సమయం.

చూడండి, మన చుట్టుపక్కల ఎంతోమంది, మన కోసం, వాళ్ళ కుటుంబాలకు అన్యాయం జరిగినా పర్లేదు అని, భారత జనాభా ను తగ్గించుటకు, ప్రభుత్వ పధకాల ను ఇతరులకు అందించుట కొరకు, కరోనా గురువు కు, తమ ప్రాణాలను ధారపోసే, ఉత్తమ త్యాగ ధనులను, బాధ్యత గల పౌరులను, మనం అనవసరంగా ఆడి పోసుకుంటున్నాము. వారి మంచితనం గుర్తించలేక పోతున్నాము.

ప్రపంచ బాంకు లో మోడీ, కేసీఆర్, జగన్ ల అప్పు భారం తగ్గించాలని వీరి తపన. తక్కువ జనాభా, తక్కువ పధకాలు, తక్కువ ఖర్చు, తక్కువ అప్పు సూత్రం తో, ముందుకు దూకుతున్నారు మన సోదరులు.

ఆ త్యాగ ధనుల సేవలను స్మరిస్తూ, మనం కూడా ఆ కేటగిరీ లో ఉండాలా వద్దా అని, వీపు మీద చెయ్యి వేసుకుని, టీవీ చూస్తూ వేరుశనగ లు తింటూ, తీవ్రంగా ఓ ఆలోచన చేసి, తిన్నగా ఓ తప్పుడు నిర్ణయం తీసుకుందాం. మన వన్నీ భ్రమలలో ఆవేశ నిర్ణయాలు, అలాగే ఉంటాయి కదా.

అధికారులు, పోలీసులు ఎంత మొత్తుకున్నా, వాట్సాప్ లో ఫేస్బుక్ లో ఎన్ని చదివినా, వీరందరిదీ ఒకటే బాట ఒకటే మాట ఒకటే పాట - కరోనా నాకు నా కుటుంబం కు తప్ప, ప్రపంచంలో మిగతా వారందరికీ రావచ్చు నేమో గాని, మాకు మాత్రం రాదు అంటే రాదు, బంగారు రాజ ముద్ర ఉంది మాకు అనుకుంటారు.

బయట ఊళ్ళో ఎన్ని బాధాకర కన్నీళ్ల వార్తలు విన్నా చూసినా, వీరి తీరు మారదు, దేశ సేవ తలంపుతో. ఈ త్యాగమూర్తుల వివరాలు చూద్దామా. బయటకు వస్తే, నిండు బట్టలు, చేతి గ్లౌజులు, మూతి ముక్కు కవచం, 6 అడుగులు దూరం, సబ్బుతో నిమిష నిమిష కడుగుడూ, పాటించరు గాక పాటించరు.

* లాక్ డౌన్ లో కొన్ని గంటల షాపులు తెరిస్తే, పోలోమని ఎటువంటి కరోనా జాగ్రత్తలు లేకుండా , తోసుకుంటూ పక్కనే తిరుగుతూ ఉంటారు, పాత రోజుల లో పెళ్లికి వచ్చినట్టు, పెళ్లి భోజనం దొరకదేమో అని ఆత్రం. ఎందుకు? దేశం కోసం త్యాగం, ఊరు లో, జన సాంద్రత తగ్గించడంలో, తమ వంతు కర్తవ్యం తో కూడిన బాధ్యత.

* మందు షాపులో, ధనం టాక్స్ గా కట్టి, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతూ ఒక పక్క, తాను క్యూ లైను లో ఏ బ్రాండ్ దొరికినా చాలు, కరోనా బారిన పడినా పర్లేదు, కుటుంబం రోడ్డు న పడినా పర్లేదు, ధనం లేక మందు లేక గొంతు పిడచ గట్టుకుపోయి, శానిటైజర్ తో అన్నా అల్ప సంతోష తృప్తి పడే ప్రాణాలు వదిలే, ఆ త్యాగమూర్తులు ను, ఏమని పొగడాలి? కొవ్వొత్తి లా మనకోసం కాలిపోతున్నారు కదూ, ఆ అన్నలు. ఇది దేశ సేవ కాదా?

* పార్క్లో లేదా రోడ్ల మీద, వ్యాయామ పరుగులు తీస్తున్న చదువు కున్న ఉద్యోగస్తులు కూడా, మాస్క్ లు ధరించకుండా, తాము కరిగి, రాబోయే యువతరం కు తమ ఉద్యోగాలు ధారపోసే, ధీరులను ఏమని పొగడాలి. తనతో పాటుగా, ఇంట్లో వాళ్ళ కు అంటించడం అనే అంకిత భావం. ఇదీ దేశ సేవే.

* పుట్టినరోజు పండుగ అంటూ పదిమంది ని పిలిచి, కనీసం పిల్లలు కు మాస్క్ లు తొడగకుండా, ఆ రోజే కరోనా గురువు కు ఎవరో ఒకరం చిక్కుతాం బలైవుతాం అంటూ, జనాభా నియంత్రణ లో భాగస్వామ్యం అవుదాం అంటూ, ఫోటోలు ఆనందంగా వాట్సాప్ స్టేటస్ లో పెట్టి, స్నేహితులు ను కూడా ప్రోత్సాహం చేసే, ఆ త్యాగమూర్తుల ను ఏమందా?

* నాయకులు హైదరాబాద్ లో చూపించుకుంటారు, మనము మన కుటుంబం మాత్రం ప్రభుత్వ ఆసుపత్రిలో నానా పాట్లు పడినా పర్లేదు, అని తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, నాయకుల వెంట తిరిగే అనుచరులను ఏమని పొగడాలి? ఇది దేశ సేవ కాదా?

ఇలా చెప్పకుంటూ పోతే, ఎన్నో ఎన్నెన్నో ఉదాహరణలు, కడుపు చించుకుంటే, కాళ్ళ మీద పడుతుంది అంటారు కదా.

మనం మారం, ఎందుకంటే, మన అందరి లక్ష్యం, భారత జనాభా తగ్గించడం, ప్రభుత్వ పధకాల ధనం మిగిలించి అప్పులు తగ్గించడం, భూభారం తగ్గించడం, అంతే కదూ మిత్రులారా? సాహో, కరోనా గురు ప్రాణ దక్షిణ, దాతలారా, వందనాలు మీకు శత వందనాలు మీకు.

ఇట్లు ,దుఃఖ భాష్పాలతో, వెటకారం వెంకన్న, కరోనా ప్రపంచం, కోవిడ్ 19 పిన్ కోడ్, ప్రతి ఇంటి పక్కన స్పీడ్ పోస్ట్.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 793 General Articles, 46 Tatvaalu
Dt : 07-Aug-2020, Upd Dt : 07-Aug-2020, Category : General
Views : 122 ( + More Social Media views ), Id : 635 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : public , giving life , corona , kovid , guru , population control , sacrifices , state , central , loan , credit
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content