Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.
ఎక్కడ అయినా, ధీమ్ పార్కు వారు మంచి మనసుతో సహ్రుదయముతో, మీ వీలైనంత(ఇష్టమైనంత) చమురు వదిలించుకో పధకం, అమలు చేసే సదావకాసం మనకే ఇస్తారు. చమురు అంటే ధనము అని అందరికీ తెలుసు గదా.
అంటే ఏదైనా పార్క్ లో ఆనందముగా గడుపుదాము అని తక్కువలే $70 అని ఒకరు వెళితే, దానితో పాటు కారు కు 20 , ఇంకా దగ్గర పార్కింగ్ లేదా వేరే మనిషి తో పార్కింగ్ అంటే ఇంకో 10 కలుపుతారు.
తిండి పెడతాము మరి తింటావా అని అడుగుతారు. మనము ఓకే అంటే ఇంకో 20 కలుపుతారు. విడిగా మనము ఏది కొనుక్కుని తిన్నా, చేతులు మండిపోతాయి ఆ రేట్లు తో. స్పెషల్ గా ముందు గా చూస్తావా లైన్లో లేకుండా అంటే ఇంకో 20, అన్నీ ఎక్కుతావా స్పెషల్ షో చూస్తావా ఇంకో 20.
అన్ని ఒక రోజులో చూడలేము, కాబట్టి మొత్తము రెండు రోజులు కు ఇంకో 50 కలుపు.
చూసారా, 70 దగ్గర మొదలు పెట్టింది ఎక్కడ ఆగుతుందో. ఇదంతా ఒకరు కే , మరి ఇతర కుటుంబ సభ్యులకు మరియు పిల్లల కు. వామ్మో, తడిసి మోపెడు అవుతుంది.
హోటల్ గది కూడా ఇస్తారు , ఇంకో 100 నుంచి 200. ఇవన్నీ డాలర్లు. చూసుకోండి, ఎంత పెరిగిపోతుందో మొత్తము ఖర్చు. ఐతే, వారిని తప్పు పడటానికి ఏమీ లేదు వారేమీ బలవంతము చేయడము లేదు రమ్మని, ఎందుకంటే, మనమే పరుగెత్తుతున్నాము ఎలా గయినా డబ్బు వదిలించుకోవాలి.
అందుకే తిరుపతి లేదా తీర్ధ యాత్రకు వెళ్లి నా పుణ్యం వస్తుంది, వీళ్ళ కు చెల్లించే ముడుపులకు శోష దిగులు వస్తుంది ఇంటికి వెళ్ళేటప్పుడు అంటారు.
మరి ఈ అద్భుత పధకం, వీలైనంత చమురు వదిలించుకో, మీరు ఒకసారైనా ఆచరించి, ఆనంద పడతారని ఆశిస్తున్నాము.
Sri, Telugu ,
10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 951 General Articles, 46 Tatvaalu
Dt : 13-Nov-2019, Upd Dt : 13-Nov-2019, Category : America
Views : 260
( + More Social Media views ), Id : 217
, Country : USA
Tags :
Theme parks visit expenditure
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments