Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time. కమీషన్ అవకాశ అవసర వెన్నుపోటు రౌడీ తమ్ముడు,
నీ మొదటి గొంతు వార్నింగ్ నచ్చింది, సంగతి తెలుస్తా అన్న నీ మాట బాగుంది, మరి ఇప్పుడు నన్ను కాపాడేది ఎవరు? దేవుడా.. పిన్నీ, చెల్లీ, చిన్న తమ్ముడూ మీరెవరూ నన్ను రక్షించ లేరా, మీ రౌడీ తోబుట్టువు నుంచి?
ధనం ఇవ్వకముందే వార్నింగ్ అంటే, ధనం ఇచ్చినాక అడిగితే, అసలు మన సాల్తీ నే గల్లంతు చేస్తాడా ఏమిటి? కొంపముంచి. తమ్ముడికి అంత బలం బలగం ఉందని, ఎవరూ చెప్పలేదు? మన్నించు తమ్ముడు, నీ శక్తి తెలీ లేదు.
గత సంవత్సరం నుంచి 5 సార్లు ఫోన్ చేస్తే నీకు సహాయం చేద్దామని, సంవత్సరం తర్వాత, నీ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, అంటే సంతోషము వేసింది. ఇక్కడ కమీషన్ అంటే, లాభం లేనిదే పని చేయవు, అని మాత్రమే సుమా.
సత్య ప్రమాణము గా, నేను ఫోన్ చేసింది, నిన్ను అప్పు అడగడం కోసం కాదు, అవసరానికి వాడుకోవడానికి కాదు, నమ్మించి మోసం చేయడానికి కాదు, ఫోన్లు ఎత్తకుండా దొంగలా పారిపోవడానికి కాదు, అక్క తమ్ముడు అప్పుల వాళ్ళ కన్నీళ్ళు పెంచడానికి కాదు తమ్ముడూ.
కేవలం కుటుంబ క్షేమం మంచి చెడ్డ ఆరోగ్యం మాట్లాడటానికే సుమా, వద్దు అంటే చేయము కదా. మీ నాన్న అంటే మా బాబాయి పిన్ని మీద ఉన్న గౌరవముతో, నిజమేమిటో ఎందుకో అక్కను అమ్మను అడగవచ్చు.
పిన్నే చెప్పింది, ఎన్ని సార్లు చెప్పినా వినడు చేయడు అని, తప్పు లేదు లే, మా లాంటి చిన్నవారు అంటే చిన్న చూపే ఉండాలి కదా.
బంధాలను వ్యాపారం, ధనం, అవసరం, అవకాశం కోసం వాడుకోవడం, నీ అంత నాకు తెలీదు, తెలుసుకోను. అవసరమైతే, నీ దగ్గరనే ట్రైనింగ్ తీసుకుంటా.
ఈ వారములో కూడా ఫోన్ చేసినా, అలాగే అక్క అమ్మతో ఎన్నిసార్లు చెప్పినా దొరకవు, నీకు సహయం చేద్దమన్న పిచ్చి వెర్రి ఆలోచనతో. ఎందుకంటే అమ్మ, అక్క, తమ్ముడు అందరూ అడిగారు సంవత్సరముగా నీకు సహాయం చేయమని ఎన్నో సార్లు, వారి మాటలు నిజమని నమ్మాను. అలాగే నువ్వు ఎన్నో సార్లు అడిగావు గతములో, అలాగె కరోనా సమయము లో, నీ మాటలు నమ్మాను.
పెద్దలతో నాయకులతో మంత్రులతో కోటీశ్వరులతో, ఎప్పుడూ బిజీగా ఉండే నీకు, ఖాళీ చిక్కలేదు, తప్పులేదు. పిన్ని అక్క చెప్పలేదు, నా లాంటి చిన్న ఉద్యోగం వారికి, ఇప్పుడల్లా అపాయింట్మెంట్ దొరకదు, ఓ స్థాయి ఉండాలి, మా వాడు జవాబు చెప్పాలి అంటే.
కానీ ఇప్పుడు వడ్డీ బాబాయి స్థాయికి నేను పెరగాలి అంటే, నీతో మాట్లాడాలి లేదా ఇంటికి రావాలి అంటే, కష్టం తమ్ముడు. ఎందుకంటే మాది ఇచ్చే చెయ్యేగాని, 100 మంది రక్తం తాగి, వారి సొమ్ములతో వ్యాపారం చేసి, వారినే ఏడిపించే ఎగకొట్టే నీచ స్థాయి, కి ఎదగాలంటే కష్టం. ఆ స్థాయి నాకు లేకపోతే, నువ్వు దొరకకపోయినా నష్టం లేదు. కానీ ఆత్మను చంపుకోను, ఆడవాళ్ళ సొమ్ము, అలాగే ఇతరుల సొమ్ము పై బతకను.
కానీ నువ్వు మీ శని వారం (ఏప్రిల్ 17, 2021) సమయం రాత్రి 11 గంటలకు ఫొన్ అప్పాయింట్మెంట్ ఇచ్చాను, అని ముందుగా ఒక్క మాట చెపితే, నేను రెడీ గా కాచుకుని ఉండేవాడిని, మరలా నీ లాంటి పెద్ద మనిషి చూపు పడాలి, అంటే ఎంత భాగ్యం కావాలి మా లాంటి చిన్నవారికి. మన్నించాలి అందుకోలేకపోయాను.
ఎవరి దగ్గర అంటే వారి దగ్గర, సొంత తల్లి, అక్క, తమ్ముడు, మామ దగ్గర, కనపడిన అందరి దగ్గర అప్పు చేసే ధైర్యం హీన సంస్కారం పెంపకము లేక, సిగ్గు లేకుండా సొంత తండ్రి సంపాదించి ఇచ్చిన కోట్ల ఇంట్లో నే, ఇంకా కుటుంబము సంసారము జరుపుతూ బతుకుతూ, తల్లి అద్దెలు కూడా వాడుకుంటూ, పైన ఇంట్లో ఒంటరిగా తల్లిని భర్త సంపాదనతో వదిలేయలేక మనసొప్పక,
సొంత గా కష్టపడి చదివిన సంస్కారముతో తెల్ల ధనం సంపాదిద్దామని, పరాయి నేల పొట్ట పట్టుకుని వచ్చి, 7 ఏళ్ళుగా నా సొంత సంపాదన అద్దె ఇంట్లోనే, నా సొంత సంపాదనతోనే, నాతోనే కర్రతో నడిచే ముదుసలి తల్లిని పెట్టుకుని పాద సేవ చేసుకుంటూ, రూపాయి అప్పు లేకుండా విలువగా నిజాయితీగా,
అందరి ఫోన్ లు ఒక్క రోజులోనే సమాధానము చెపుతూ, నీ కుటుంబము తోబుట్టువుల బాధలు వింటూ ఓదారుస్తూ, చిరు సంపాదనతో బతికే బీదవాళ్ళ మని, ఇంకా చాపమీద నే నిద్రపోతామని, ముదుసలి తల్లి కి అత్యుత్తమ వైద్యం ఇప్పిస్తూ, నీ లాగా ఇతరుల ధనం పై వ్యాపారం చేసే చేతకాని వాడిని కాదు అని, చిన్న చూపు తగదు తమ్ముడు.
నీ ఫోన్ గొంతు మెస్సేజ్ చూసాను. ఎంత ఎదిగి పొయావో అర్ధము అయ్యింది, మాటలో సంస్కారం అభిమానం గౌరవం, అబ్బా మీ నాన్న అమ్మ వింటే, సంతోషపడతారు. వడ్డీ బాబాయి తో తిరిగితే అలాగే ఉంటుంది, ఏమో.
కానీ వడ్డీ బాబాయే నీ కన్నా, చాలా సంస్కారముగ మర్యాదగా జవాబు చెప్పాడు, నువ్వు ఎన్ని మెస్సేజ్ లు అయినా పెట్టుకో నాకేమి భయము లేదు అని. కానీ నీలాగా, మాట అదుపులో పెట్టుకో జాగ్రత్త గా ఉండు, తర్వాత నీ సంగతి తేలుస్తా, నా శక్తి పవర్ ఏమిటో నీకు తెలీదు, అని అనలేదు ఎప్పుడూ, ఎందుకంటే తన తప్పు తనకు తెలుసు, బంధాలకు విలువ ఉంచారు, ఆయన నీ కన్నా పెద్ద వస్తాదు అయినా కూడా. ఇది మొదటి వార్నింగ్ అని కూడా బాబాయి చెప్పలేదు, అన్ని కోట్లు ఉండి.
2 వ వార్నింగ్ లో ఏమి చేస్తావో కూడా దయచేసి చెప్పు, భయము వేస్తే జిల్లా ఎస్పీ, అలాగే రాష్ట్ర వైసీపీ అధిష్టానం సహాయం తీసుకుంటా. ఎందుకంటే, వార్నింగ్ లు ఇచ్చే ఒక రౌడీకి గూండాకి, ధన సహాయము చేయమని, ఇన్నాళ్ళు నా పిన్ని చెల్లెలు తమ్ముడు అడిగారు, అని సంతోష పడతాను.
ఇంకో మాట అన్నావు, మా చెల్లెళ్ళు బాబాయి లు పలకరు అన్నావు. వారిని ఇప్పుడైనా అడుగు, వారి ధనము తీసుకున్నానో లేక వారిని మోసము చేసానో, కారణం ఏమిటో, నీకు అవసరము అనుకుంటే. నీ అక్కకు, తమ్ముడుకి, అప్పుల వారికి, ఫోన్ ఎత్తు ముందు చాలు.
మా నాన్న కు వైద్యం హైదరాబాద్ లో మద్రాస్ లో నా సొంత ధనముతో చేయించాను, 5 ఏళ్ళు. నీ లాగా తండ్రి సంపాదనతో కాదు, ఒక నెలకి. చివరి రోజుల్లో ఎందుకు రాలేదో, మా బాబాయికి మా నాన్నకు అమ్మకు అందరికీ తెలుసు కాబట్టే, వారు అండగా ఉన్నారు అప్పుడు.
ఇప్పుడు నా తల్లి, నాతో నే ఉంది, 7 ఏళ్ళు గా. పెద్దమ్మ ఎలా ఉంది, అని అడిగే సంస్కారము ఎటూ నీకు లేదు. కనీసం, నీ తల్లిని, నీతోనే ఇంట్లో ఉంచుకో చాత అయితే, ఒంటరి గా వదలకుండా.
నీ గురించి నీ ఇంట్లో వాళ్ళు ఎంత ఏడుస్తున్నారో, బయటకు చెప్పలేను, చెప్పను. ఎందుకంటే, నా మెస్సేజ్ ల ఉద్దెశ్యం బంధాల గురించి కాదు, కేవలము
నీ అప్పులు, ధన పిచ్చి, మోసము, దాంక్కోవడము, సొంత తల్లికి తమ్ముడుకు అక్కకు, చేస్తున్న మోసం తెప్పిస్తున్న కన్నీళ్ళు గురించి, అలాగే వడ్డె బాబాయి కి పక్కన ఉండి, చెసిన వెన్నుపోటు గురించి మాత్రమే.
నేను నీ మోసాలు కుట్రలు, బయటకు చెప్పనివి చాలా ఉన్నాయి, అవన్నీ చెపితే, పిన్ని బాధపడుతుంది అని చెప్పలేదు. ఇప్పుడు నీ గొంతు మెస్సేజ్ చూసాక అర్ధము అయ్యింది, నువ్వు ఎవ్వరి మాట వినే స్టేజ్ లో లేవు అని.
చూద్దాం, కాలం నిర్ణయం చేస్తుంది, మన లేదా మన పిల్లల సంస్కార భవిష్యత్ ను.
తమ్ముడు గా, చాటు గా తప్పులు ఒప్పుకుంటావు అనుకున్నాను, పిన్ని మంచి కోసం, ఆమె మీద గౌరవముతో. కానీ చాలా పైకి ఎదిగి, వార్నింగులు ఇస్తున్నావు కాబట్టి, బహిరంగముగా ఇలాగే అందరి ముందూ మాట్లాడదాము, నువ్వు గొంతు మెస్సేజ్ పెట్టు 2 వ వార్నింగ్ కూడా.
మన పెద్దలే నిర్ణయం చేస్తారు, నేను మర్యాద సంస్కారం వీడి తప్పు మాట్లాడుతున్నానో లేక మీరంతా సహాయం నన్ను అడిగి, మరలా నాకే వార్నింగు లు ఇచ్చే, మంచి సంస్కారం నీకే ఉందో, వారే చెపుతారు.
చిత్రం ఏమిటి అంటే, అడిగిన 6 ప్రశ్నలకు మాత్రం జవాబు చెప్పలేదు, అవి అన్ని నిజం కాబట్టి, నీకు ధైర్యం లేదు కాబట్టి.
ఎందుకంటే నీలో తప్పు ఉంది, నిజాయితీ సంస్కారం లేవు కాబట్టి. అందుకే వార్నింగ్ లు ఎదురు ప్రశ్నలు. శభాష్, రాజకీయాలలో తప్పక ఉపయోగపడుతుంది తమ్ముడూ.
అని తన తమ్ముడు లోకెష్ కి బదులు ఇచ్చాడు సోమేష్.
- - -
తమ్ముడు గొంతు మెసేజ్ పెట్టు చాలు. ఫోన్ తో ఇంక పని ఏముంది, 2 వ వార్నింగ్ కోసం.
మంచి తమ్ముడు తో మాట్లాడాలి అన్నాను, నీకు సహాయం చేయడం గురించి, కొన్ని అనుమానాలు గురించి.
ఇప్పుడు నువ్వు రౌడీ గూండాలా వార్నింగ్ ఇచ్చిన తర్వాత, ఫోన్ ఎందుకులే, అనవసరంగా ఆయాసం కోపం, చిన్న పెద్ద మాటలు రాకూడదు కదా. పిన్ని బాధ పడకూడదు.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,881,593; 104 తత్వాలు (Tatvaalu) and views 226,292 Dt : 17-Apr-2021, Upd Dt : 17-Apr-2021, Category : General
Views : 768
( + More Social Media views ), Id : 1109 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
warning ,
money ,
asked ,
life ,
trouble ,
brother Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments