వేదం మనకు రాకపోయినా చదవలేక పోయినా, వేద మంత్రాన్ని వింటే లాభమొస్తుందా? - Devotional - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1001 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

పెద్దలు చెపుతూ ఉంటారు, వేదం మనకు రాకపోయినా, కనీసం వింటే చాలు, లాభం అంటారు. మంత్ర శబ్దాన్ని వింటేనే ఏమి లాభం అనేది చూద్దాము.

చిన్నప్పుడు అమ్మ సన్నగా లాలి పాట పాడుతుంది. కేవలం కొన్ని పదాలతో జోకొడుతుంది. ఆ పాటలో ఉన్న పదాల అర్ధం రాగం టాళం, ఆ చంటిపిల్లలకు తెలియనవసరం లేదు, కేవలం తల్లి ఆ పాట పాడితే నిద్ర వస్తుంది పిల్లలకు.

ఇదే విధంగా దైవ వేద మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా, మన చుట్టూ తయారయ్యే ఆ శబ్ద తరంగాలు, అంతటినీ ప్రభావితం చేస్తాయి. ఆ శబ్ద బ్రహ్మం, మనకు రక్ష అవుతుంది.

ఉదాహరణకు మన చుట్టూ ఎన్నో తరంగాలు ఉంటూ ఉంటాయి.

కొన్ని రేడియో ఆడియో వీడియో తరంగాలు, ఇలా మన చుట్టూ ఎప్పుడూ మనకు తెలియని శక్తి తరంగాలు, వాటి వాటి నిర్దుష్ట ఫ్రీక్వెన్సీ తో మనను చుట్టూ వుంటాయి.

రేడియో లేదా మొబైల్ నుండి ఒక మంచి పాట రూపంలో అవగతం అవుతాయి. ఒక ఫోన్ కాల్ గానో అందుకోగలము. అందులో మంచి చెడుని బట్టి, మన ఫీలింగ్స్ మారుతాయి.

ప్రతి మంత్రానికి పలికే విధానంలో, ఒక నిర్దుష్టమైన రీతిలో పలికే పద్ధతి వుంది. ఆ పద్ధతిలో ఆ మంత్రోచ్చారణ చేస్తే ఆ విధమైన పాజిటివ్ తరంగాలు, మన చుట్టూ ప్రకటితం అవుతాయి.

పాజిటివ్ అని ఎందుకు అంటున్నాము అంటే, దైవ మంత్రం అని తెలుసు అండ ఉంటుంది అని తెలుసు కదా, అర్ధం కాకపోయినా అందులో విష్ణు శివ నారయణ అమ్మవారు అనే పదాలు వస్తునే ఉంటాయి.

చనిపోయేటప్పుడు కూడా, నారాయణ నామ శబ్దం వింటే లేదా స్మరణ తో, స్వర్గానికి వెళతాము అని అంటారు.

ఈ తరంగాలు మంచిని ప్రేరేపించే భావాలను పెంపొందించి, చెడుకు ప్రేరేపించే ఆలోచనా తరంగాలను, తొక్కిపెట్టి ఉంచుతాయి.

తద్వారా కేవలం మన చెవుల ద్వారా, కేవలం మంచికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ, మెదడుకు అందిస్తుంది. మానసిక దౌర్భాల్యం మాయమై, ఒకానొక శక్తి ప్రవేశిస్తుంది.

అదే మంత్రం మరిన్ని సార్లు, మనమే చదవగలిగితే, ఆ ఎనర్జీ మనమే తయారు చేసుకోగలము కదా.

మంత్రాన్ని కేవలం వినడం ద్వారా, చుట్టూ ఉన్న నెగటివ్ సిగ్నల్స్ ను దూరం చేస్తే, అదే మనమే ఉచ్చరించ గలిగితే, మరింత శక్తియుతం గా, ఆ పాజిటివ్ శక్తిని గ్రహించగలము.

ఎలాగంటే ఒక గదిలో చెడు వాసన వస్తుంటే, ఒక్క రూమ్ స్ప్రే ద్వారా ఆ చెడు వాసనను పోగొట్టి, మంచి సువాసనను ఆ గదిలో కొంత సేపు నిలపగలమో, అలాగే మంత్రాన్ని విన్నంత సేపు అదే జరుగుతుంది.

అదే ఆ చెడు వాసన ఎక్కడ నుండి వస్తోందో కనిపెట్టి, దాన్ని బయటకు పంపి సంపూర్ణంగా నివారించడం అనేది, మనమే మంత్రోచ్చారణ చేస్తుంటే, ఆ మంత్రం మనకున్న మనలో ఉన్న చెడు వాసనలను పోగొట్టి, దైవత్వం నింపడం లాంటిది.

అదే విధంగా కేవలం మంత్రోచ్ఛారణ తో ఆగకుండా, ఆ మంత్రం ప్రయోజనం మీద, మనం ధ్యానం చెయ్యగలిగితే, ఆ పరమార్ధం ఆ మంత్రాధిష్టాన దేవత, ప్రచోదయం చేస్తుంది. తద్వారా మనం మంత్రం వలన సంపూర్ణలాభం పొందుతాము.

మననాత్త్రాయతే ఇతి_మంత్రః - మననం చెయ్యడం మాత్రం వల్ల రక్షించేస్తుంది.

ఇక నిధి ధ్యాస చేసి ఆ మంత్రం మీద తపిస్తే లభించే శక్తి, మనకే కాదు మన చుట్టూ మొత్తం ప్రపంచానికి శాంతిని కలుగచేస్తుంది.

మన కర్మల వలన లోకశాంతి ఆశిస్తే, ఆ లోకంలో మనం ఒక వ్యక్తిమి కాబట్టి, మనకు కూడా ఆ లాభం వస్తుంది. మన సనాతన_ధర్మం ఎప్పుడూ లోకహితం చెబుతుంది.

అష్తోత్తరంలో మన నక్షత్ర పాదానికి, ఒక్క నామం అయితే మిగిలిన 107 నామాలు 27 నక్షత్రాల * 4 పాదాలకు చెందిన, లోకం అంతటికీ మంచి జరగాలని ఆకాంక్షించే విధంగా, మనకు 108 నామాలు జపించమని చెప్తుంది శాస్త్రం.

ఏది చేసినా అందరూ సుభిక్షంగా శాంతిగా వుండాలని, ఆకాంక్షించే అద్భుతమైన ధర్మం మన సనాతన_ధర్మం. సనాతన హిందూ సంప్రదాయాలను గౌరవించండి - పాటించండి.

సేకరణ సవరణ  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1029 General Articles, 46 Tatvaalu
Dt : 17-Jan-2021, Upd Dt : 17-Jan-2021, Category : Devotional
Views : 138 ( + More Social Media views ), Id : 928 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : cant , read , speak , understand , veda , beneficial , listen , vedic mantra
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content