ఆత్మ/ పంచభూతాల శక్తిని వివరించగలరు- ధన తెలుగు సంఘాల (వి)నాయకులు, జవాబు చెపుతారా, లెక్క చేస్తారా? - General - లోకం తీరు/ News / NRI
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2110 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2145 General Articles and views 2,129,863; 104 తత్వాలు (Tatvaalu) and views 239,542.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

*ప్రశ్న - ఆత్మ/ పంచభూతాల శక్తిని వివరించగలరు, ఉదాహరణతో.*
Can you explain the energy of Atma/ Panchabhuta, with example?

*నిన్న మన నాయకుల కధ చదివాము, ఎవరూ ముందు లెక్క చేయరు, చేతులు కాలిందాకా. మరి ఆ నాయకులకు వంగుతూ దండం పెట్టి, తెలుగు నేలకు సహాయం అని ముడుపులు ముట్టచెపుతూ తమ సొంత పనులు చేయించుకుంటూ, సినిమా వారి తో షికార్లు చేస్తూ, సొంత జిల్లా/ నియోజక వర్గం లో డప్పు కొట్టుకునే, వాట్సాప్ లో తెలుగు రాయడం రాని, ముదుసలి తల్లి దండ్రుల సేవ చెప్పుకోలేని/ఉత్తమ ప్రపంచ వైద్యం తో వెంట పెట్టుకోలేని, సంతానం కు తెలుగు రాయడం మాట్లాడడం పద్యాలు శ్లోకాలు నేర్పలేని, పేద్ద పేద్ద చదువులు ఉద్యోగాలు వ్యాపారాలు చేసే ధన తెలుగు సంఘాల (వి)నాయకులు, నిజాయితీగా రాసే మీ లాంటి చిన్న విలేఖరికి, జవాబు చెపుతారా, లెక్క చేస్తారా? అదీ 3 ఏళ్ళుగా లేని తీరికతో? మీది దురాశేమో.*

Will the leaders of the rich Telugu Sangha, who are unable to teach/ write/speak Telugu (verses, hymns, stories) themselves and family/ children, with big studies, jobs and businesses, answer/ account to a small reporter like you, who writes honestly? After 3 years of busy? Are you greedy?

జవాబు - నాయకులైనా, మిత్రులైనా, అధికారులైనా, బంధువులైనా ఒకటే పద్దతి. మంచి మాటలతో బుజ్జగించి జాగ్రత్తలు చెప్పడం వరకే. వారు జవాబు ఇస్తారా, వింటారా, మారతారా, అది మనకు అవసరము లేదు. ఆ తర్వాత, పంచభూతాలు, పరమాత్మ చూసుకుంటారు. గీత చెప్పింది అదే. సాత్విక ప్రయత్నం వరకే నీ పని, ఫలితము నాకు వదిలేయి అని. కాబట్టి మనకు ఇంక సంబంధము లేదు.

ప్రహ్లాదుడు ఎంతటి వాడు, రారాజు అయిన హిరణ్యకశిపుని ముందు? అర్ధం చేసుకోలేక ప్రహ్లాదుని ఎదిరించాడు, రాక్షసుడు పతనం అయ్యాడు. వామనుడు ఎంతటి వాడు, రారాజు అయిన బలి ముందు? బలి ఆత్మ జ్ఞానం తో, తలవంచి నమస్కరించారు, విష్ణువునే కాపలాగా సాధించారు. పెద్ద చిన్న తారతమ్యం, గుణం, సజీవ గురువు సేవ మరియు ఆత్మ జ్ఞానం ను బట్టి ఉంటుంది, పంచభూతాలకు.

వారి గురించి వారు, అంటే అన్ని తెలుగు సంఘాల వారు, 20 ప్రశ్నలకు జవాబు చెపితే లేదా చెప్పము లేదా గమ్ముగా ఉన్నా, మనకు వచ్చే ఆశ/ దురాశ/ నష్టం ఏముంది? కాని వారి భవిష్యత్ రాత మారడానికి మాత్రం, ఏళ్ళు పట్టినా, అది మార్గం సుగమం అవుతుంది. ఇది వారి గురించే కాదు, ప్రతి వ్యక్తి కి సంబంధించినది.

మనల్ని ఒక వ్యక్తి తన అవసరం అవకాశం కోసం, ఓ రూపాయి, లేదా ఓ పదవి, లేదా ఓ సహాయం అడిగారు అనుకోండి - జవాబు మీ ఇష్టం, మీ సంస్కారం, పెంపకాన్ని బట్టి, నాటి పరిస్తితిని బట్టి.

కానీ అదే వ్యక్తి, ఏమీ అడగకుండా నిస్వార్ధముగా, బాబూ ఈ తప్పుడు దోవలో వెళుతున్నావు, సరి చేసుకో అన్నారు అనుకోండి? సంస్కార పెంపకం ఉంటే, తప్పక జవాబు చెప్పాలి, ఎందుకంటే అతను ఇప్పుడు వ్యక్తి కాదు, జీవ ఆత్మ.

దైవం, మానవ రూపములో, మనకు మార్గ నిర్దేశం చేస్తున్నారు, భవిష్యత్ పరిణామాలు ఆపడానికి ఒక అవకాశం ఇస్తూ. అది మన ఊహకు అందదు, దాని పని మొదలు పెట్టినాక ఇంక ఎవరూ ఆపలేరు, అది ఆగదు.

అదీ వారు 9 ఏళ్ళ సజీవ గురువు సేవ చేస్తూ, వాక్సుద్ది, దైవ ఉపాసన, ఇతరులు చేయలేని చిత్ర విచిత్ర మానసిక నియంత్రణ పద్దతులు, అరిషడ్వర్గ అష్టవ్యసన నియంత్రణ సాధన, శాఖాహారము చాపనిద్ర తో, దానం ఇవ్వడానికి తీసుకోవడానికి కూడా మన అర్హత పాత్రత నిరూపించమని అడిగారు అనుకోండి, నిస్వార్ధముగా మనల్ని ఏదో ఒకటి మన బాగు కోసం అడిగారు అనుకోండి. ఇంకెంత జాగ్రత్త గా, మర్యాద గా ఉండాలి, గత కధనాలు లో చూసాము. ప్రత్యక్ష సాక్షాలు బహిరంగముగా ఉన్నాయి.

ఇంకోటి తెలుగు వారికి సేవ చేస్తున్నాము అంటూ, జవాబు లేకపోతే, ఇంక తమది నటన సేవ అని ఒప్పుకున్నట్లేకదా? వారు చేస్తున్నది బానిసత్వ రాజకీయ భిక్ష గాడ్ ఫాదర్ సేవ, అంతేనా?

వారు లెక్క చేయడము లేదు అంటే, ఎవరిని? మనల్నా లేదా వారి వంశాన్నా/ పంచభూతాలనా? నిస్వార్ధముగా వారి మంచి కోరి అడిగినప్పుడు, మనము ఆత్మ. అంటే వారు తన ఆత్మకు దైవ/ఆత్మ జ్ఞానం రగిలించడానికి, జరుగుతున్న ప్రయత్నం ను లెక్కచేయడము లేదు.

ఆత్మ అనేదానికీ రంగు రూపు వాసన లేదు, అన్ని పరమాత్మ లో కలిసేవే. అంటే, వారు లెక్క చేయనిది, వారి ఆత్మనే. వారి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? వారి తల్లి దండ్రుల నుంచి. అంటే వారు లెక్క చేయంది వారి తల్లి దండ్రులనే, కదా? వారు ఎక్కడ నుంచి వచ్చింది? వారి పూర్వీకుల నుండి. అంటే వారు లెక్క చేయంది, వారి వంశాన్ని? అంతేనా?

వారి వంశం ఎక్కడ నుంచి వచ్చింది? దైవం/ పంచభూతాలు నుంచి. అంటే వారు లెక్క చేయంది దైవాన్ని? దైవం ఎక్కడ ఉంది? ఇందు లేడు అందు గలడ ను సందేహము వలదు, ఆ మహా విష్ణువు అన్ని చోట్లా ఉన్నారు అని ప్రహ్లాదుడు ఎప్పుడో చెప్పారు. అంటే మన చుట్టూ అలాగే మన లోపల ఉన్న, పంచభూతాలు లో ఉంది, విష్ణు మాయనే. అంటే వీరు లెక్క చేయంది, దైవం తో పాటు, పంచభుతాలను/ సొంత ఆత్మను కూడా. నష్టం ఎవరికి? మనకా, వారికా?

భూమి, ఆకాశము, వాయువు, జలము, అగ్ని లను పంచభూతాలు అని అభివర్ణిస్తారు. వీటి శక్తి హనుమంతుని లో చూస్తాము. భూమిని కాలితో తన్ని, ఆకాశానికి ఎగిరి, వాయు వేగముతో, జలమనే సముద్రాన్ని దాటి, తోకకు అంటించిన నిప్పుతో, లంకను తగులబెట్టి వచ్చారు. అవి ఏవీ, హనుమంతుని ఏవీ చేయలేదు. సహకరించాయి. అవి ఎదురు తిరిగితే? ఆయన అది సాధించలేరు. అందుకే రామ అనే నామంతో, భగవంతుని తన హ్రుదయములోనే పెట్టేసుకున్నారు. అంటే, పంచభూతాలు కూడా, తనకు తల వంచాలి సహకరించాలి.

80 శాతం జనాభాకు ఇవి అర్ధము కాదు, చేతులు కాలిందాకా. మాకు ఎదురు లేదు, మమ్మల్ని ఎవరూ ఆపలేరు అని విర్రవీగుతారు. కాబట్టి, మన చుట్టు జరిగే తప్పులు, జనాలు సంఘాలు నాయకులు ప్రభుత్వాలు, పట్టించుకోకపోవచ్చు. కానీ పంచభూతాలు పట్టించుకుంటాయి, కాల రాస్తాయి, మనము మన సంతానం, వాటి పరిణామాలు అనుభవించాలి. మన చుట్టూ అవి చూస్తున్నాము సుమా. ప్రతి క్షణం పంచభూతాలు మనల్ని గమనిస్తున్నాయి, అనుసరిస్తున్నాయి, మరువద్దు.

*వారికి మరలా విన్నపము కూడా పంపాము - అన్ని తెలుగు సంఘాలకు - ఎవరో ఒకరు పంపుతారు 3 ఏళ్ళుగా*

ఏవండీ, దయచేసి మీకు గతములో పంపిన ఆ 20 ప్రశ్నలు కు, మీకు తెలిసిన/ తోచిన సమాధానాలు తెలుగు మాటలలో పంపగలరు, స్పందించే హృదయం గా.

అవి మిమ్మల్ని తప్పు పట్టడానికి కాదు, ఇతరుల కు మన సాత్విక జవాబు తో, అపోహలు తొలగించాలని. ఒకవేళ తప్పు ఉంటే ఆత్మ విమర్శ తో రాబోయే రోజుల్లో సరి చేసుకుందాం అని. మనం మాత్రమే, మిగతా వారి కన్నా, మంచి మార్పు కు ముందు ఉంటాం, అని గట్టిగా చెప్పాలి. ఎందుకంటే పంచభూతాల నుంచి, క్షేమం గా ఉండాలి మనందరం.

మీ గురించి మంచి చెప్పు అవకాశం, మాకు ఇవ్వమని విన్నపం. ఒకవేళ ఆరోపణలు మాత్రమే అయితే అదే రాయండి. కొత్త మార్పు ఉంటే అదే రాయండి. మనసును కదలించండి, మన తల్లి దండ్రుల/ పిల్లల సంస్కార పెంపకాన్ని చాటండి. ధన్యవాదములు.

energy Atma Panchabhuta Telugu Sangha leaders verses hymns stories old parents answer to a reporter  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2145 General Articles and views 2,129,863; 104 తత్వాలు (Tatvaalu) and views 239,542
Dt : 16-May-2023, Upd Dt : 16-May-2023, Category : General
Views : 400 ( + More Social Media views ), Id : 1749 , Country : USA
Tags : energy , Atma , Panchabhuta , Telugu , Sangha , leaders , verses , hymns , stories , old , parents , answer , reporter
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content