పాటతో పరమార్ధం -ధర్మం చెయ్ బాబు త్యాగం(పేరడీ) -మిస్సమ్మ -ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్, సావిత్రి, జమున - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,312; 104 తత్వాలు (Tatvaalu) and views 226,424.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Dharmam Cheyi Babu, Tyagam (Parody) - Missamma - NTR, ANR, SVR, Savitri, Jamuna

బాబు ధర్మం చెయ్ బాబు, కాణీ ధర్మం చెయ్ బాబు, ధర్మం చేస్తే పుణ్యమొస్తది, ఖర్మ నసిస్తది బాబూ అనేది పాత పాట. ఆ కాణీ కూడా, వెన్నుపోటుతో తెచ్చినది అయితే, మనకు కూడా వారి పాపములో భాగం మిత్రమా, జాగ్రత్త.

దానం ఇవ్వడానికి, అలాగే తీసుకోవడానికి కూడా అర్హత కావాలి. అప్పుకు కూడా సవా లక్ష ప్రశ్నలు వేస్తారు, సాక్ష్యాలు అర్హతలు చూపాలి కదా?

మరి మన నేటి కొత్త పాట, బాబు ధర్మం చెయ్ బాబు, త్యాగం ధర్మం చెయ్ బాబు, త్యాగం/ ధర్మం చేస్తే పుణ్యమొస్తది, ఖర్మ నసిస్తది బాబూ అంటూ, మానసిక బలం ను నిద్రలేపడం.

పక్కన ఎవరినైనా అడగండి మనశ్శాంతి గురించి, బావురు మంటారు. కోటి విద్యలు కూటి కోసమే, శాంతితో గడవని ముష్టి జీవితం మనది, నీతి దోవనే మదికి రాదాయే, సాటి మనిషికి సేవరా బాబూ అంటే, కాలు చేయి కదలదాయే, కనీసం మాట సాయానికి కూడా అంటారు నవ్వుతూ.

మామూలు అన్నం కాకుండా, ఐస్ క్రీం లేదా ఇంకో చిరుతిండి తింటే ఆకలి పోదు, కాసులతోనే ప్రాపంచిక బ్రమలతోనే అసలు కడుపు నిండదు, వెన్నుపోటు తప్పదు. కాబట్టి అయ్యా అమ్మా బాబూ, చేసే త్యాగం చిన్నది అయినా, పాపాలన్నీ బావును బాబూ.

మన చెయి సాయం, వారి చెయి పట్టి, ఇచ్చి పుచ్చుకొను రుణమే బాబూ నేటి మరియు మరు జన్మకు. త్యాగం ఏమిటిది పరలోక బ్రహ్మ అంటే, మన చిట్టాలు రాసే జమలే బాబూ అని పెద్దల జవాబు. ధర్మం, న్యాయం, సేవా, త్యాగం మనము చేస్తూ పిల్లలకు నేర్పుదాము.

అదేమిటండీ త్యాగం అంటున్నారు, కపట నటన 2 నాల్కల వారిమి కదా - 1. ఎప్పుడు కూడా, తమ ముదుసలి తల్లి తండ్రి అత్త మామ ల సజీవ సేవ గురించి మాట్లాడం, కనీసం వినడానికి కూడా ఇష్టపడం - క్రుతజ్ఞతలు విశ్వసనీయత తెలీదు. 2. అప్పులతో ఆడంబరాలు సరదాలు భోగాలు లేకుండా బతకలేం 3. తమ సొంత సంస్కార బిడ్డల దగ్గర తమ ముదుసలి తనములో దేవతలు గా పూజింప బడతామని బల్లగుద్ది సాక్ష్యాలతో చెప్పలేం. ఇంక త్యాగాలు ధర్మాలు, అసలు మా వంశములో నే లేవు అంటారా?

ముందు అందరికీ అలాగే ఉంటుంది, కానీ జీవితం చివరకి, వాటి విలువ తెలుస్తుంది. ఎందిరా చిన్నోడు చెపితే వినాలా, ఇవి అబద్దాలేమో అంటారా? అవ్వ, ఈ పెద్దవారిని అడగండి.

త్యాగం/ ధర్మం వీడవద్దు. చెడుతో కలవ వద్దు. అందుకే మహానుభావులు మనకు ప్రత్యక్ష సాక్ష్యం ఇచ్చి వెళ్ళారు - రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, శ్రీదేవమ్మ, కోడెలయ్య, కాఫీడేఅయ్య - వీరి జీవితాలలో చివరి పేజీలు చదవండి, పిల్లలకు, ప్రజలకు చెప్పండి.

Parody

బాబూ... బాబు, బాబు
బాబు ధర్మం చెయ్ బాబు, త్యాగం ధర్మం చెయ్ బాబు
ధర్మం చేస్తే పుణ్యమొస్తది, ఖర్మ నసిస్తది బాబూ ||ధర్మం చెయ్||

కోటి విద్యలు కూటి కోసమే, శాంతితో గడవని ముష్టి జీవితం
బాబు కోటి విద్యలు కూటి కోసమే, శాంతితో గడవని ముష్టి జీవితం
నీతి దోవనే మది రాదాయే, సాటి మనిషికి సేవరా బాబూ||ధర్మం చెయ్||

ఐస్ క్రీం తింటే ఆకలి పోదు, కాసులతోనే కడుపు నిండదు
అయ్యా..అమ్మా..బాబూ..
చేసే త్యాగం చిన్నది అయినా, పాపాలన్నీ బావును బాబూ||ధర్మం చెయ్||

మన చెయి సాయం వారి చెయి పట్టి, ఇచ్చి పుచ్చుకొను రుణమే బాబూ 2
త్యాగం ఏమిటిది పరలోక బ్రహ్మ, మన చిట్టాలు రాసే జమలే బాబూ
ధర్మం, న్యాయం, సేవా, త్యాగం ||ధర్మం చెయ్||

Original

బాబూ... బాబు, బాబు
బాబు ధర్మం చెయ్ బాబు, కాణీ ధర్మం చెయ్ బాబు
ధర్మం చేస్తే పుణ్యమొస్తది, ఖర్మ నసిస్తది బాబూ ||ధర్మం చెయ్||

కోటి విద్యలు కూటి కోసమే, పూటే గడవని ముష్టి జీవితం
బాబు కోటి విద్యలు కూటి కోసమే, పూటే గడవని ముష్టి జీవితం
పాటు పడగయే పని రాదాయే, సాటి మనిషిని సావనా బాబూ||ధర్మం చెయ్||

ఐస్ క్రీం తింటే ఆకలి పోదు, కాసులతోనే కడుపు నిండదు
అయ్యా..అమ్మా..బాబూ..
చేసే దానం చిన్నది అయినా, పాపాలన్నీ బావును బాబూ||ధర్మం చెయ్||

నీ చెయి పైన నా చెయి కింద, ఇచ్చి పుచ్చుకొను రుణమే బాబూ 2
ముష్టి ఏమిటిది ముసలి బ్రహ్మ, మన చిట్టాలు రాసే జమలే బాబూ
ధర్మం, అరణా, ఒరణా, రెండణా ||ధర్మం చెయ్||

మన గాత్ర నైవేద్య సేవ - దయచేసి నాభి నుంచి పాడే/ జపించే ప్రయత్నం చేయగలరు - మనము గాయకులము కాదు, అయినా, మీరూ పాడే ప్రయత్నం చేయాలి, శ్వాస వ్యాయామం కు; గొంతులో కఫము తగ్గడానికి; మనసు నియంత్రణ బలం కు; ధైరాయిడ్, ఊపిరితిత్తులు, గుండె, బీపీ, మానసిక వ్యాధుల నివారణకు; ఉత్తమ ప్రాణాయామ, ఆరోగ్యం, వాక్సుద్ది, మనశ్శాంతి, ఆధ్యాత్మికత, పూజకు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,312; 104 తత్వాలు (Tatvaalu) and views 226,424
Dt : 28-Sep-2023, Upd Dt : 28-Sep-2023, Category : Songs
Views : 222 ( + More Social Media views ), Id : 1931 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Dharmam , Cheyi , Babu , Tyagam , Parody , Missamma , NTR , ANR , SVR , Savitri , Jamuna
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content