Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. *గౌరవ సభ్య పదవులకు, మీరు ప్రాపంచిక వ్యామోహ అర్హత లేదు అని బహిరంగముగా ఒప్పుకున్నప్పుడు, మరి సంస్కార పెంపకం ఉన్న, మన నాయకులు/ ఓటర్లు ఎందుకు ఒప్పుకోరు?*
కమలం పార్టీ చిన్నమ్మ, తిరుపతి దేవస్థానం చైర్మన్ లు
Why dont our cultured leaders/voters agree, when you openly admit that you are not eligible for honorary member positions because of no worldly obsession?
ప్రశ్న/ స్పందన - ఏమండీ, 2 కధనాలు నిన్నవి సూపర్. వ్యాపారాలు, ఉద్యోగాలు లేదా దానాలు కు, అహంకారం విడచి, 5+ ఏళ్ళ సజీవ గురువు సేవ చేసే, అలాగే అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లేని వారితో కలసి పనిచేస్తే/ అడుగులు వేస్తే, మన ఇల్లు ఒళ్ళు గుల్ల కాకుండా ఉంటాయి, మనకు అండగా ఉంటారు అని బాగా చెప్పారు.
3 ఏళ్ళు పైగా, 10 వేలు ఇస్తాము శనివారం సాధన లిస్ట్ చేస్తున్న ఉత్తములకు అన్నది కూడా, మాకే ఉపయోగం అన్నది నిజం. మా ఊళ్ళో లేదా చుట్టుపక్కలా, మీ ప్రతిబింబం ఉంటే, మేము వారిని నమ్మవచ్చు కదా. ఇదీ వికేంద్రీకరణే, నిస్వార్ధముగా.
మీరు అన్నట్లుగా, ఆ ప్రశ్నలకు జవాబులు, ప్రతి ఒక్కరు దైవ భీతి ఆధ్యాత్మిక శక్తి ఉంటే, తమను తాము తెలుసుకుంటే, తమ భాగస్వామికి, పిల్లలకు, మిత్రులు, బంధువులకు చెప్పాలి.
ఎందుకంటే, రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, శ్రీదేవమ్మ లాంటి గొప్పవారు, మన ఇంట్లో అలాగే మన చుట్టుపక్కల వారు - వీరంతా పంచభూతాలకు, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పే వెళ్ళారు.
మీరు మేము తప్పించుకోగలమా, ఆత్మకు జవాబు చెప్పకుండా? ఆత్మ ద్రోహం ఒప్పుకోకుండా?
సమూహ పదవి గురించి బాగా చెప్పారు, మనకు అర్హత లేదు, తగిన న్యాయం చేయలేము, మన్నించాలి అని, గౌరవముగా హుందాగా చెప్పారు.
మీరు ఆత్మ జ్యోతిని వెలిగించి, మిగతా మీ కుటుంబ/ సంఘ/ పార్టీ సభ్యులలో కూడా ఒప్పించి వారి ఆత్మలను వెలిగించండి, అదే ఆధ్యాత్మిక/ సామాజిక/ రాజకీయ వికేంద్రీ కరణ అని బాగా చెప్పారు. నాయకులకు/ ఓటర్లకు కనువిప్పు కావాలి.
ఈ బుద్ది ఓటర్లకు లేదు. వారి నుంచి ముదురి వచ్చిన, నాయకులకు అసలు ఉండదు. ఈ 5 ఏళ్ళు వీరి పక్కలో, మిగతా 5 ఏళ్ళు వారి పక్కలో, మధ్యలో గోడ దూకి ఇంకొకరితో. షేం టు షేం ఓటర్లు 3 దగ్గర తేసుకుని, ఒకరికి ఓటేసినట్లు.
ఎన్నికలు ఉండని, ఆ గౌరవ సభ్య పదవులకు, మీరు ప్రాపంచిక వ్యామోహ అర్హత లేదు అని బహిరంగముగా ఒప్పుకున్నప్పుడు, మరి సంస్కార పెంపకం ఉన్న, మన నాయకులు/ ఓటర్లు ఎందుకు ఒప్పుకోరు?
మా బుద్దులు పులి, నక్క, పాము లాంటివి, కపట నటన అప్పుల పరాధీన బతుకులు మావి, అలాగే మేము ఎన్నుకునే నాయకులు కూడా మా లాంటి వారే, అని స్వచ్చముగా ఎందుకు చెప్పరు? వీరు చేసే తప్పుడు పనుల వలన, వీరి పిల్లల భవిష్యత్ పాడవుతుంది అని తెలుసు కదా.
ఉదాహరణకు,
1) కమలం పార్టీ, ఇక రాష్ట్రం లో ఎవరూ దొరకరు అని, చిన్నమ్మ ను నాయకురాలి గా తీసుకున్నారు. రామన్న ఎదిరించిన, చేయి గుర్తు పార్టీలో పదవి కూడా చేసి వచ్చిన ఘనత కోసం, రామ రామ. చిన్నమ్మకు సొంత భర్త/ బిడ్డకే మన పార్టీ గురించి మంచి చెప్పి, మన పార్టీలో చేర్పించడం చేతకాదు. ఇది రాష్ట్రం మొత్తం కు తెలుసు.
వారు చిన్నమ్మకు ఎందుకు అధ్యక్ష పదవి ఇస్తాము అన్నారు, నాయకులకు గతి లేకనా? ఒకవేళ తెలుగు భాష రాక, తెలుగు నాయకుల కుట్రలు కుతంత్రాలు కపట నటన చాటు 2 నాల్కల ధోరణి, అర్ధం చేసుకోలేక, అధిష్టానం ఇచ్చినా, ఆత్మాభిమానం ఉన్నవారు, తగుదునమ్మా అంటూ తీసుకోవడమేనా.
మాకు అర్హత లేదు, సొంత ఇంటి వారికే చెప్పి, పార్టీలో ఉంచలేము అని నిజాయితీగా చెప్పి, దూరం గా పోరా? ఈ పార్టీని ఎదగ కుండా చేసి, బావ పార్టీ కు రహదారి చేస్తారా? బావను టార్గెట్ చేసి విమర్శలు ఉన్నాయా అసలు? ఉన్నా, లోగుట్టు పెరుమాళ్ళకు ఎరుక అంటే ఇదే కదా? ఎంత పాపం.
ఆ మిగతా కమలం నాయకులు, దద్దమ్మల్లా ఉంటారు, అడగరే, ఇది అన్యాయం అని? ఇతరులు గమ్మున ఉన్నా, తమ సొంత బిడ్డకు ఇప్పటికే రాజకీయము గా, అనిశ్చితి ఉంది కదా? అయినా కళ్ళు తెరవరా? నీతి నిబద్దత రుజు మార్గం ఉన్న, రామన్న పరువు, తీయడం ఇకనైనా ఆపరా?
2) ఇక తిరుపతి దేవస్థానం చైర్మన్ గా, ఇతర మత సాంప్రదాయాలు పాటించే వారు, సజీవ గురువు సేవ లేని వారు, అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వ నియంత్రణ లేని వారు, రాజకీయ సారా నీసు పేకాట గనుల దొంగ వ్యాపారాల క్లబ్ ల కాంట్రాక్టరు/ వాసన లు ఉన్న/ చేసిన వారు, నోటికి మంత్ర ఉచ్చారణ పురాణాలు పద్యాలు శ్లోకాలు రాని వారు, మాకు వద్దు అని, నీతి నిజాయితీ గల, ప్రజా పధకాలకు (బీసీ ఎస్సీ మైనారిటీ రిజర్వేషన్ లేని) సొంత కుటుంబ పేర్లు దయతో అంగీకరించే, ప్రజాస్వామ్యం కన్నా రాజకీయ వారసత్వ బానిసత్వమే ముద్దు అనే ఆధ్యాత్మిక సాంస్క్రుతిక కుటుంబ జ్ఞానాన్ని తెలుగు ప్రజలకు పంచే, మన చంద్రన్న జగనన్న మరియు ఓటర్లు, చెప్పరా?
వారు చెప్పినా, పదవి ఇచ్చినా, సిగ్గు అభిమానం నీతి నిజాయితి పెంపక సంస్కారం ఉన్నవారు ఎవరైనా, మాకు ఆ అర్హత లేదు అని, గత 10 ఏళ్ళుగా, తప్పుడు దోవలో చైర్మన్ పదవులు మాకు ఎందుకు అని, దూరంగా ఉండరు ఎందుకండి? వారి మరియు వారి పిల్లల భవిష్యత ఎందుకు పాడు చేసుకుంటారు. ఆ దేవుడు వారిని ఊరక వదిలి పెడతారా?
జవాబు/ ప్రతిస్పందన - మాకు పోటీ గా మీరే మొత్తము రాసేసారు. కాబట్టి, ఇంక మేము చెప్పేదేమి లేదు, మీతో సంస్కార పెంపకం ఉన్న ప్రతి ఒక్కరు అంగీకరిస్తారు.
వారు అయినా, వీరు అయినా, వారి పిల్లలు/ తరాలు అయినా, దాని ఫలితాలతో పతన దోవ పడటమే జరుగుతుంది. అలాంటివి ఎన్నో ఉదాహరణలు మన చుట్టూ ఉన్నాయి.
అందుకే అంటారు, పెద్ద పదవులలో ఉన్న వారు, ఆచి తూచి అడుగు వేయాలి. లేదంటే, తరతరాలు జన శాపనార్ధాలు, వారికి నీడలా వెంట ఉంటాయి మిత్రమా.
రాముడు అగ్ని ప్రవేశం ఎందుకు చేయమన్నారు? ప్రజలకోసం నీతి నిజాయితీ నిబద్దత కాపాడాలి కాబట్టి. మరి ఆ దైవ రామ లక్షణాలు ఓటర్లు/ నాయకులకు ఉన్నాయా? ఉన్నాయి అని నీటి మీద రాయండి, కలకాలం స్థిరముగా ఉంటుంది కదూ?
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,325,929; 104 తత్వాలు (Tatvaalu) and views 252,439 Dt : 21-Aug-2023, Upd Dt : 21-Aug-2023, Category : General
Views : 371
( + More Social Media views ), Id : 1886 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
cultured ,
leaders ,
voters ,
agree ,
eligible ,
honorary ,
member ,
positions ,
worldly ,
obsession ,
kamalam ,
chinnamma ,
ttd Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments