జిల్లాలలో స్థానిక - ఎమ్మార్వో, పంచాయతీ, ఎంపీడీవో, మున్సిపల్, సీఐ, ఆరోగ్య, ఇతర అధికారుల సోషల్ మీడియా - Request - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1247 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1277 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

అన్ని జిల్లాలలో మరియు అన్ని మండలాలలో కూడా, ఎమ్మార్వో, పంచాయతీ ఈవో, ఎంపీడీవో, గ్రామ సచివాలయం అధికారి, మున్సిపల్ కమిషనర్, డీయెస్పీ, సీఐ, వైద్య ఆరోగ్య మరియు విద్య అధికారులు కూడా స్థానిక ఫేస్బుక్ పేజీలు పెట్టి, ప్రజలకు సమాచారం ఇవ్వాలి. బాధ్యత గల ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రోత్సాహం చేయాలి, తమ పేజీలు చూపించి.

అందులో కోవిడ్ జాగ్రత్తలు, వాలంటీర్ సేవలు, ఫించన్లు, అంగన్వాడీ, సిబ్బంది సేవలు త్యాగాలు, జాగ్రత్తలు, ప్రభుత్వ పధకాలు, ఫించన్లు, నవరత్నాలు, లాక్ డౌన్, ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి గురించి చెప్పవచ్చు.

దైనందిక కార్యక్రమాలలో, ప్రజలకు స్థానికముగా అందుబాటులో ఉండే హీరోలు వీరు, ప్రజలు వీరి సేవల త్యాగాల, ఫోటోలు వీడియోలు, ప్రతి రోజూ చూడాలి. ఈ అధికారులు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలి. జిల్లా అధికారులు కూడా ప్రోత్సాహం చేయాలి, తమ పేజీల ఉదాహరణతో. మీరు అంటే పైవారు చెప్పనిదే మేము చేయము, అనే పాత మూస పద్దతిలో నే ఉన్నారు చాలా మంది గ్రామ పట్టణ అధికారులు, తమ ఇంట్లో పిల్లలు సోషల్ మీడియా టెక్నాలజీ వాడుతున్నా.

రోజూ ప్రజల కష్టసుఖాలలో పాలు పంచుకునేది వీరు, జనము తో తిట్టించుకున్నా పొగిడించుకున్నా, వీరి తర్వాతే ఎవరైనా, కాదంటారా? వీరికి రావాల్సిన గుర్తింపు రావడము లేదు, ఏదో పని చేసాము అన్నట్లు గా, అలా చాటుగా రిటైర్ అవుతున్నారు. వీరైనా, తమ సొంతము గా అయినా, సోషల్ మీడియాలో, తమ సేవల తీపి గుర్తులను, జ్ఞాపకాలుగా ఉంచుకోవాలి. ఇది, రాష్ట్ర మరియు జిల్లా ప్రభుత్వానికి కూడా, ఉపయోగం.

మొన్న ఒక పంచాయతీ సెక్రటరీ గారి గొప్పతనం గురించి రాద్దామంటే, ఫోటోలు వీడియో లు సాక్ష్యం లేవు ఫేస్బుక్ లో, అవి లేకుండా రాస్తే, మేము కావాలని రాశాము అంటారు. ఒక ఎమ్మార్వోను పొగిడాము అంటే, ఆ ప్రాంత ఎమ్మెల్యే ఎంపీ ఆర్డీవో డీఆర్వో కలెక్టర్ అందరిని పొగిడినట్లే గదా?

కొంత మంది జిల్లా అధికారులు, ఇంకో అడుగు ముందుకు వేసి, ప్రజలకు దగ్గరగా ఉండుటకు, తమ వ్యక్తి గతము గా ఒకటి మరియు ప్రభుత్వ పరం గా ఇంకోటి కూడా సోషల్ మీడియా వాడుతున్నారు - ప్రకాశం ఎస్పీ, అనంతపురం జిల్లా కలెక్టర్ గార్లు. ఇది, చాలా మంచి పద్దతి. మీకు ఇంతకుముందు లింక్ లు పంపాము కదా సాక్ష్యం. వీరికి, ముఖ్యమంత్రి గారు బొట్టు పెట్టి చెప్పాల్సిన పని లేదు.

ఒక జిల్లా ను ఉదాహరణకు తీసుకుని, ప్రకాశం జిల్లా మున్సిపల్ కమిషనర్ ల, సోషల్ మీడియా అప్డేట్స్ గురించి వివరణలు చూడండి. అన్ని జిల్లాల పట్టణాలలో, అదే విధానం కదా.

మీ జిల్లా లో, రోజూ అప్డేట్ చేసే మున్సిపాలిటీ (కార్పోరేషన్ కాదు), పంచాయితీ సెక్రటర్య్, ఇతర స్థానిక అధికారులకు సోషల్ మీడియా ఉంటే లింకు ఇవ్వగలరు.

మీకు గుర్తు ఉందా గతంలో, మన ప్రకాశం జిల్లాలో, సోషల్ మీడియాలో ఉత్తమ నగర పంచాయతీ మరియు మున్సిపాలిటీ ల లిస్టు పంపాము. వాటిలో కొన్ని మున్సిపాలిటి లు అయి ఉండవచ్చు, కానీ రాష్ట్ర మున్సిపల్ వెబ్సైట్ లో అప్డేట్ చెయ్యలి మరి వారు. ఒంగోలు మున్సిపల్ కార్పోరేషన్ పెద్దది, దాని లెక్క వేరు. Link

ఉత్తమ కనిగిరి మున్సిపాలిటి/ నగర పంచాయతీ, ఫ్రొఫెషనల్ గా ఫేస్బుక్ పేజీ పెట్టి అప్పుడు అప్పుడు, తమ ప్రాంత ప్రజల కోసము, ఈ జూన్ నెలలో కూడా అప్డేట్ చేశారు. ఒకసారి చూడండి ఆ లింక్ లో. ఈరోజు రాష్ట్ర మున్సిపల్ అధికారులు కు మరియు కలెక్టర్ గారికి కూడా ఈ లిస్టు పంపాము.

చీరాల మున్సిపాలిటీ పెద్దది, జిల్లా చిన్న మిగతా వాటి లో. కానీ ఫేస్బుక్ పేజీ, సరైనది లేదు. ప్రతి రోజు సమాచారము కోసము చీరాల మున్సిపాలిటీ కి లైక్ లేదా ఫాలో అవుదామని రెండు నెలలుగా ఎదురు చూస్తున్నా, మన అద్రుష్టము ఇంకా పండ లేదు. కానీ ఆప్షన్ లేదు. ఒక పేజీ లో 2019 నుంచి, అప్డేట్స్ లేవు. ఒక ఫేస్బుక్ ఎకౌంటు లో ఫ్రెండ్స్ అయితే తప్ప, మనకు సమాచారం రాదు. ఇతరుల వ్యక్తి గత ఫోటో లు పోస్ట్ లు కూడా వస్తున్నాయి. ఆ లింక్ లోపల చూడండి.

అది తప్పు విధానం, ప్రజలు, లైక్ లేదా ఫాలో అయితే చాలు, వ్యక్తిగతముగా స్నేహితులు అవ్వవలసిన పని లేదు. చీరాల కమీషనర్ గారి అఫీషియల్ పోస్ట్ లు తప్ప, ఇతరుల వ్యక్తి గత ఫోటో లు మరియు మెసేజ్ లు ఉండకూడదు.

కమీషనర్ గారికి కూడా ఈ విషయం విన్నవించాము, రెండు నెలల ముందు. అది సరి చేయాలి అంటే, కొత్త పేజీ అన్నా వాడాలి లేదా ఉన్న ఫేస్బుక్ ఎకౌంటు నుంచి కొత్త పేజీ గా మార్చాలి.

కనిగిరి మున్సిపాలిటీ ఫేస్బుక్ పేజీ లాగ, మన చీరాల వేటపాలెం పర్చూరు మండలము (అన్ని జిల్లాలలో మరియు అన్ని మండలాలలో కూడా) లో అధికారులు కూడా ఫేస్బుక్ పేజీలు పెట్టి, ప్రజలకు సమాచారం ఇవ్వాలి.

ఫేస్బుక్ పేజ్ ఎలా పెట్టాలి మరియు ఎలా అప్డేట్ చెయ్యాలి అని నేర్చుకోవాలి అంటే కనిగిరి వెళ్ళాల్సిన పని లేదు. ఫేస్బుక్ పేజీలు మన ఎమ్మెల్యే కరణం గారు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి గారు, ఎమ్మెల్సీ పోతుల గారు, ఎమ్మెల్యే ఏలూరి గారు కూడా వాడుతున్నారు. వారిని అడిగి తెలుసుకోవచ్చు.

ప్రభుత్వ శాఖా పరంగా ఒక పేజీ లేదా వ్యక్తి గతంగా నైనా ఒక పేజీ ఉచితంగా వారు క్రియేట్ చేసి అప్డేట్ చేయవచ్చు.

మరి ఈ కల అంటే ప్రజలకు సమాచారము అందుబాటులో ఉండాలి అన్న వాస్తవం ఎప్పుడు తీరుతుందో, కరణం గారు ఎమ్మెల్యే గా, బాలినేని గారు మంత్రి గా, సురేష్ గారు ఎంపీ గా, ఉండగా నే సాధ్యపడుతుంది అని ఆశిద్దాం. మంచికి ఆశ పడటములో తప్పు లేదు కదా.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1277 General Articles, 47 Tatvaalu
Dt : 24-Jul-2020, Upd Dt : 24-Jul-2020, Category : Request
Views : 457 ( + More Social Media views ), Id : 610 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : chirala , vetapalam , parchuru , municipal commissioner , mro , panchayat , eo , mpdo , mdo , health , education , officers , social media , facebook pages
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content