చీరాల జగనన్న ఇళ్ళు పట్టాలు పంపిణీ సభలో, అభివ్రుద్ది కోసమా నాయకుల అరపులు? - Politics - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1251 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1281 General Articles, 47 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

చీరాల (లేదా మీ ఊరు, మీ ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ, మాజీ అని అనుకోగలరు ఇదే కధగా ఉంటుంది ఏమో) ఓటరు కు హఠాత్తుగా, ఈ మాటలు వినపడుతున్నాయి, అరుపులు తో కేకలుతో లీలగా.

ఎమ్మెల్సీ పోతుల గారు అరుస్తూ ఉన్నారు ఓ సభలో, ఆవేదన వెళ్ళగక్కుతున్నారు. నేను మన, ఆశాజ్యోతి బలహీన వర్గాల పెన్నిధి, అడిగితే కాదనకుండా చెల్లెమ్మల అభివృద్ధి కి ముందుకు దూకే, చేతి కి వెన్నెముక లేని, జగనన్న ను అడిగి వెంటనే, చీరాలకు జిల్లా తెస్తాను లేదా జిల్లా శాఖలు తెస్తాను.

ఫిషింగ్ హార్బర్, చేనేత పార్క్, స్మార్ట్ సిటీ, స్మార్ట్ బీచ్, నిమ్స్ రింస్ లాంటి ఆసుపత్రి తెస్తాను, ఊరక అధికారంలో ఉండి, మన సొంత పనులు చూసుకోవడం కాదు, జనం మన పేరు కలకాలం గుర్తు పెట్టుకోవాలి, పార్టీ మారినందుకు ప్రయోజనం చూపించాలి, మీరెవరూ చేయలేని పని, నేను చేస్తానని, తన అంతరంగం ఆవేదనను , అందరి ముందూ వెళ్ళగక్కారు, చీరాలకు జరుగుతున్న అన్యాయాన్ని, కళ్ళకు కట్టినట్లు చెప్పారు. జనం ఈలల తో చప్పట్లు కొట్టారు.

పక్కన ఇంకో మాజీ నాయకుడు, గమ్ముగా ఉండమ్మా, 40 ఇయర్స్ ఇండస్ట్రీ మా కరణం గారికే, సంవత్సరం నుంచి వాటి గురించి ఆలోచన చేసే సమయం లేదు, తేవడం చాతకాలేదు. ఇప్పుడు జనానికి అవసరం లేని, అభివృద్ధి గొడవ ఎందుకు? ఇప్పుడు ఈ మీటింగ్ ఉద్దేశ్యం వేరు, నన్ను మా ఎమ్మెల్యేని పొగుడుకోనీయి కాసేపు.

మన అనుభవ ఎమ్మెల్యే గారికే వల్ల కానిది, ఎమ్మెల్సీ వలన ఏమౌతుంది. ఈ సారి గెలిస్తే, తప్పకుండా అవన్నీ ఆలోచన చేస్తారు. ఓ పక్కన మాజీ ఎమ్మెల్యే తో తలనొప్పి, రెండో పక్కన నువ్వు ఏందమ్మా కూర్చో తల్లి, నీకు దండం పెడతా. పక్కన మీడియా వాళ్ళు ఉన్నారు, కధలు అల్లుతారు. ఆ అభివృద్ధి చేయగలిగింది మా కరణం గారు మాత్రమే బల్ల గుద్ది చెప్తునా, అయితే ఎప్పుడు అని మాత్రం అడగవద్దు, అని ఆయన ఆవేదన గా అన్నారు.

పక్కన ఉండి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి అనుచరుడు గట్టిగా అరిచాడు, మీ కలలు ఆపండి, స్వాములూ. పదేళ్ళు గా మా ఆమంచి అన్న, ఇవన్నీ అభివృద్ధిలు తెద్దామని ఆలోచన చేస్తుంటే, వల్ల గానిది, మీ వలన అవుతుందా.

మా అన్న మరలా గెలిచి, ఇంకొన్నేళ్ళు ఆలోచన చేసి, ఎట్లైనా ఈ అభివృద్ధి, జగనన్న లేదా చంద్రన్న లేదా పవనన్న లేదా వీరన్న ను అడిగి తీసుకువస్తారు. ఊళ్ళో పుట్టి ఇక్కడ ఉన్న వాడికే, ఇవి వల్ల కాలేదు ఇన్నాళ్లు, ఎక్కడ నుంచో వచ్చి ఉండే కనపడే, మీ వల్ల ఏమౌతుంది, ఇదేమన్నా నాయకులను ఊరికే తిట్టడమా, అభివ్రుద్ది. మా అన్నే, మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాక ఇవన్నీ తెస్తారు, ఇంకో 10 ఏళ్ళ కైనా, అని అరుస్తూ ఉన్నారు.

ఓటరు కళ్ళ వెంట, నీళ్ళు కారుతున్నాయి, చీరాల బాగు కోసం, మన నాయకులు వారి అనుచరులు భీషణ ప్రతిజ్ఞ లు చేస్తున్నారా, ఆశలు చిగురిస్తున్నాయి. చీరాల అభివృద్ధి ఇంక పరుగులు తీస్తుందా, పది ఏళ్ళు తర్వాత, అని ఇప్పుడే నమ్మలేక పోతున్నాడు.

ఇంతలో ఓటరు ను, తన అన్న కిరణ్ నిద్ర లేపాడు, రేయ్ లే ఏమిటి ఈ సమయంలో నిద్ర కలవరింతలు అని. అన్నకు, ఈ కల అంతా వివరంగా చెప్పాడు. అన్న, వెర్రి నవ్వు నవ్వాడు. ఇప్పుడే బజారు నుంచి వస్తా చూసాను, కలలో సగం నిజమే. కానీ, అక్కడ అరచుకుంది, చీరాల అభివృద్ధి గురించి కాదు, 2024 లో టిక్కెట్ ఎవరికి ఇవ్వాలని మాత్రమే ఇప్పుడే వాదులాడుతున్నారు.

జనం అరిచింది మాత్రం, ముందు జగనన్న ఇళ్ళు పట్టాలు ఇచ్చి, ఇంట్లో తీరిగ్గా, మీరూ మీరూ తేల్చుకోండి ఆ తర్వాత, మైకు ముందు జనం ముందు ఎందుకు ఈ గొడవ తలనొప్పి అన్నారు. అరగంట తర్వాత సద్దమణిగింది, ఆ గొడవ.

ముగ్గురు నాయకులు కూడా, ఒకే టికెట్ కోసం ఒకే పార్టీ లో, పోటీలు పడుతున్నారు. మనం అనుకునే 10 అభివృద్ధి పనులు కోసం మాత్రం, ఎవరూ నోరు విప్పరు, ముందుకు రారు, పౌరుషం గా అరవరు, ధర్నా లు చేయరు.

చిత్రం ఏమిటి అంటే, తెదేపా జనసేన బీజేపీ కూడా, స్ధానిక అభివృద్ధి నోరు ఎత్తవు. ఆ ముగ్గురు లో టిక్కెట్ దొరకని వారిని మన తరపున నిలబెడదామని, సొంతము గా నాయకులను తయారు చేసుకోలేక.

మన ఓటరు కు అవసరం లేని అభివృద్ధి, నాయకులు కు మాత్రం ఉండాలా, అని వీరికి ఉంటుంది కదా?

అందుకే నాయకులు, మన ఆలోచన ల సంస్కారాల మా రాజులు. వారిది ఎప్పుడూ తప్పు కాదు, ఏ ఊరు అయినా సరే, ఓటర్లు ము అయిన మనదే తప్పు మిత్రమా.

Note : వేటపాలెం మండలం అక్కాయిపాలెంలో ఇళ్ల స్థలాల పంపిణీ రసాభాసగా మారింది. కరణం బలరాం సమక్షంలో పాలేటి రామారావు, పోతుల సునీత మధ్య వాగ్వాదం జరిగింది. కరణం ను 2024లోనూ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని పాలేటి రామారావు అన్నారు. 2024 సంగతి ఇప్పుడెందుకని పాలేటి ప్రసంగాన్ని పోతుల సునీత అడ్డుకున్నారు. సముదాయించినా ఇరువురు నేతలు తగ్గలేదు. కరణం జోక్యంతో గొడవ సద్దుమణిగింది.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1281 General Articles, 47 Tatvaalu
Dt : 27-Dec-2020, Upd Dt : 27-Dec-2020, Category : Politics
Views : 269 ( + More Social Media views ), Id : 889 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : chirala , jagannanna , illa patta , housing scheme , distribution , leaders , shouting , development , amanchi , karanam , potula
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 9 yrs
No Ads or Spam, free Content