చిన్నమ్మా, కమలం వికసించేనా? జగనన్న, చంద్రన్న సమానం? స్వార్ధం వీడి, బాధ్యత ఎరిగి, మోడీకి సాయం? - Politics - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2104 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2139 General Articles and views 2,047,868; 104 తత్వాలు (Tatvaalu) and views 235,592.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

Chinnamma, will the lotus of the state bloom with seats? Jagananna and Chandrananna are not equal? Let go of selfishness, be responsible and help Modi with values?

*చిన్నమ్మా, సీట్లతో రాష్ట్ర కమలం వికసించేనా? జగనన్న, చంద్రన్న సమానం కాదా? స్వార్ధం వీడి, బాధ్యత ఎరిగి, విలువలతో మోడీకి సాయం?*

1* మా పెద్దాడు బీజేపీ, 2వ వాడు తెదేపా, 3 వ వాడు వైసీపీ, 4 వ చిన్నోడు జనసేన. అందరూ మా (మన) పిల్లలే అని అనుకున్నాము. అందరికీ జాగ్రత్తలు చెప్పాము, బాధ్యత గుర్తు చేసాము.

మరి పెద్దాడు రాష్ట్ర బీజీపీ కి రధ సారధిగా హరిబాబు, కన్నా, సోము పాత్రలు అయినాక 4 జులై 2023 నుంచి దగ్గుబాటి. నాయకులైనా, కార్యకర్తలు అయినా, వీరి అందరిది ఒకటే దోవ, బీజీపీకి సీట్లు రాకూడదు, ఎదగ కూడదు - నమ్మక ద్రోహం లో నంబర్ 1, తమ కుటుంబ పతనము అని తెలిసి కూడా, వీరు తగ్గరు. కేంద్ర బీజేపీ మరి జనం దొరక్క ఇలా చేస్తారో, మరి అంచనాలు తప్పు వేస్తున్నారో తెలీదు.

2* తెలంగాణాలో, బండి లాంటి, పార్టీని నిలబెట్టే బతికించే, కార్యకర్తలను ఉత్సాహపరిచే, ఆవేశ కష్ట జీవిని మనిషిని, ఆంధ్రాలో పట్టుకోలేక, తెలంగాణాలో కూడా పక్కకు తప్పించారు, పొరపాటున గెలుస్తామెమో నని. కేసీయార్ కు ఇబ్బంది లేకుండా ఉండాలనేమో, కిషన్ తో మొక్కుబడిగా చప్పగా సాగిస్తున్నారు. తెలుగు స్థానాలలో, ఇప్పుడున్న పరిస్తితే కొనసాగాలి అని, ఇక్కడ దగ్గుబాటి.

3* స్తానిక పార్టీలకు కోవర్టులు గా ఉంటూ, కపట నటనల తో చెలిమి చేస్తూ, మోడీ/ కేంద్ర బీజేపీ కి ద్రోహము చెయ్యడమే, ఆంధ్రా కమలం నాయకుల/ కార్యకర్తల ఏకైక లక్ష్యం. కన్నా గారు పదవి దిగగానే చంద్రన్న చేతి కిందకు చేరారు, సిగ్గు బిడియం విలువలు ఏమీ లేదు, తుడుచుకు పోవాలి అంతే. మరి చంద్రన్న ఎందుకు ఇలాంటి వారిని ప్రొత్సహిస్తారు, ద్రోహుల పార్టీ అనా? తప్పుడు రకాలు అంతా ఒకవైపే ఎందుకు చేరతారు, చేరనిస్తారు? ఇంకొంతమంది జగనన్న వైపు.

4* హరిబాబు, దగ్గుబాటి ఎక్కడ ఉన్నా, వారి పసుపు లేత మనసు ఎటువైపో అందరికి తెలుసు. మొహమాటం లేదు. సోమన్న ఎంత ప్రయత్నం చేసినా, పార్టీలో మార్పు లేదు. మాధవ్, విష్ణురాజు మంచివారే కానీ మోత ఉండదు. జీవీయెల్, ఉత్తర భారత వాసి, జనం లో కదలిక తీసుకురాలేరు. సరే చిన్నమ్మతో బతిమాలుకుందాం న్యాయం చెయ్యమని.

5* చిన్నమ్మా బిడ్డలాంటి వారి మాట, శాంతముగా మంచి మనసుతో, వింటావా. మనం చేసే అర్ధం పర్ధం లేని పనులతో, మన ఇంట్లో బిడ్డకే అన్యాయం జరుగుతున్నది కదమ్మా? ఇకనైనా మారమా? మన ఇంటాయన, చేతులెత్తేసి మూలన కూర్చున్నారు కదమ్మా, చంద్రన్న తో మోసపోయి, నల్ల గురివింద తన నలుపెరగనట్లు ఓ పుస్తకం కూడా రాసేసి?

మన ఆత్మ ఘోష, ఏనాటికీ వినమా? కన్న తండ్రికి బహిరంగముగా, కన్నీళ్ళతో క్షమాపణ చెప్పలేరా, పాప శాంతి చేయలేరా? పంచభూతాల సాయం, జోక్యం కావాల్సిందేనా?

6* బీజేపీ లో జాతీయ సెక్రటరీగా ఉంటూ, మోడీ గారి విలువలు పాటిస్తూన్నట్లు పైకి కనపడుతూ, బిడ్డ కు వైసీపీ టిక్కెట్ ఎలా అడిగారు, తల్లి? అదేమంటే ఎవరిష్టం వారిది అని దబాయింపు. జగనన్న దయతో, బిక్షతో సీటు ఇచ్చారు, పోనీ నిలబెట్టుకున్నారా? బిడ్డ పోటీ చేయడానికి ఇబ్బంది అయితే పర్చూరు నుంచి, భర్త తో పోటీ చేయించారు. కానీ ఏలూరి సాంబన్న చేతిలో ఓడిపోయారు.

ఇంత చరిత్ర ఉన్న మనము, ఇంత గొప్పవారిమైన మనము, మన కారంచేడు పర్చూరులో ఓడిపోవడం ఏమిటి తల్లి? ఎప్పుడైనా ఆత్మ విమర్శ చేసారా? ఏలూరి సాంబన్న తన నిజాయితీ నిరూపించారు, పార్టీ మారకుండా. ఎవరికి ఇప్పుడు సంస్కారం క్రుతజ్ఞత ఉంది? ఇంటి పసుపు కనా, బయట పసుపు నయం కదమ్మా?

7* దగ్గుబాటికి జగనన్న, బాలయ్యకు రాజన్న సాయం, ఏమిటి తల్లి? రామన్న కు ఇది తెలిస్తే, ఇంత ఉన్నతముగా పెంచితే, నా బిడ్డలు, సాయం కోసం తల దించి, చేతులు చాచారు అంటే, ఆయన ఆత్మ ఎంత తల్ల డిల్లి పోతుందో మీరు గ్రహించి, జాగ్రత్తగా అడుగులు వేయలేరా?

ఇవన్నీ బాలయ్య కు తెలిసి కూడా, మరలా మా విలువలు లేని బ్రీడ్ వేరు అని, ఎందుకు అందరిముందు పదే పదే అంటారమ్మా? మన చంద్రన్న పసుపు మీడియా, పసుపు గుంపు, గొప్పగా రాజన్న జగనన్న సాయాలు చెప్పకుండా, ఎందుకు దాస్తున్నారు? క్రుతజ్ఞతలు విశ్వసనీయత వారికీ లేవు అంతేనా?

8* రామన్న కాంగ్రెస్ కి వ్యతిరేకముగా పోరాడితే, ఆ పార్టీ పదవి ఏందమ్మ, నాన్న ను అవమానిస్తూ? మన స్వార్ధం కోసం, తండ్రి విలువలకు వెన్నుపోటా?

చంద్రన్న వెన్నుపోటు డ్రామా లో, డిప్యూటి సీయెం పదవి అత్యాశతో, కోట్ల ఆస్తి అలాగే ప్రపంచమంత పేరు ఇచ్చిన, కన్న తండ్రి రామన్నను వంటరిని చేసి, చంద్రన్న వైపు అడుగులు వేసి, మడుగులు వత్తటము ఏమిటి తల్లి? ఉన్న ధనం ఆస్తులు చాలదా? దురాశకు అంతు ఎక్కడ తల్లి?

9* వెన్నుపోటుతో వచ్చే అశాశ్వతమైన దిక్కుమాలిన పదవి కావాలా, అదీ సొంత తండ్రిని కన్నీళ్ళ పర్వం చేసి, తమ్ముళ్ళు నా వైపుకు రాండి అంటే, చెప్పులు విసిరేంత మర్యాదగా? మన పసుపు మీడియా ల లో, పిచ్చివాడుగా ముద్ర వేసేంత దగాగ?

ఒక్కరు, మీరు మీ కుటుంబ సభ్యులు బయటకు వచ్చి, అంత ధనం పేరు ప్రఖ్యాతులు ఇచ్చిన, నాన్నకు అనుకూలము గా, మాట్లాడలేదు, ఒక్క బొట్టు కన్నీరు కార్చలేదు. ఈ రోజు చంద్రన్న కు అండ గా ఎన్ని మాటలు? ఈనాటికీ మీ రాతి గుండెలు కరిగి, క్షమాణలు రావా? అవసర అవకాశాలకేనా మన మాట, బాటా?

10* ఆనాడు మాకు ఇచ్చినా కూడా, రామన్న ను గుండెల్లో పెట్టుకుని చూసే వారము కదా, రామన్న ఇంకో 10 ఏళ్ళు దర్జాగా పాలించి ఉంటే, ఈ రోజు ఈ ఆంధ్రా, ఇంత దిక్కుమాలిన స్తితికి చేరేదా? మీరంతా దీనికి కారకులు కాదా?

మీ దురాశా ఇంత మంది దుక్కానికి మూలం కాదా? ఆనాటి చంద్రన్న వెన్నుపోటు బలం/ మదం, ఈ రోజు జగనన్న కు సీట్ల బలమై కూర్చుంది. మీ పాపమే వారికి వరమైంది, అది మీకు శాపం అయ్యింది, మన భవిష్యత్ అంధకారమైంది.

ఎవరు తీసుకున్న గోతిలో వారు, 20 ఏళ్ళ కైనా పడాలి, నీడనిచ్చే చెట్టును, కుట్ర కుతంత్రముతో దురాశతో నరుక్కోకూడదు అని నిరూపించారు. అయినా మన జనానికి బుద్ది రాదు.

11* ధనం పదవి అధికార మత్తు లేని, అరిషడ్వర్గా అష్టవ్యసన బానిసత్వం లేని, మధ్యతరగతి కుటుంబాలం, ప్రభుత్వ ఉద్యోగం లక్షల ఆదాయం వదలి, 3 ఏళ్ళు పైగా ఆదాయం లేకపోయినా, ముదుసలి కన్న తల్లి సేవ, సజీవ గురువు సేవ గా చేసుకుంటున్నాము. మరి మీకు కోట్లు ఉండి మంది మార్బలం ఉండి, ఆ పిచ్చి తండ్రి ని అనాధలాగా, ఎలా వదిలేసారు?

ఆయన అన్ని బహిరంగముగా చెప్పుకుని ఏడ్చుకుని, 2 వ పెళ్ళి కి వెళ్ళారు, తనను చూసే దిక్కు లేక, ఆ వయస్సులో కాషాయం కట్టి కూడా. ఆ రెండో భార్యను చూసి, మీకు కన్నుకుట్టి, అప్పుడు తండ్రి అధికారం ఎలా లాక్కోవాలని ప్లాన్. అంటే ఒంటరిగా ఉన్న తండ్రి క్షేమం అవసరం లేదు. జంట అయిన తర్వాత తండ్రి అధికారం కావాలి. ఆయన పార్టీని, వారిద్దరు ఏమి చేసుకుంటే మనకేమి. మనం కొత్తది పెట్టుకుని, దర్జాగా అధికారం సాధించుదాము. బంగారు బాతు కధ చిన్నప్పుడు చదివాము, కానీ జీవితములో కళ్ళకు కనిపించేలా చేసారు.

రామన్న కు వారసులు, తను ఇష్టపడి కట్టుకున్న భార్య అవుతుందా, చట్టం ద్రుష్టిలో ధర్మం ద్రుష్టిలో, లేదా పట్టించుకోకుండా వదిలేసిన పిల్లలు వారసులు అవుతారా? భార్య ఎలాంటిది అయినా, రామన్న కు ఇష్టం అయినప్పుడు, ఆమెను తప్పు పట్టే హక్కు మనకు ఎక్కడిది?

ఆమె తప్పుడు ది అయితే, మన రామన్న కూడా తప్పుడు వారు అని మనము ఒప్పుకున్నట్లే, రామన్న తప్పుడు వారు అయితే మరి వారి పిల్లలు తప్పుడు వారు కాదా, అన్న నిజం మీకు ఎందుకు ఎక్కదు? ఇవన్నీ పబ్లిక్ మాట్లాడుకునే మాటలు కాదా, మీరంతా రాజకీయాలలో లేరా? నేడు ప్రజల ముందు దోషి ఎవరు, అల్లుళ్ళు పిల్లలా లేదా 2 వ భార్యనా?

12* మరి ఇంత ఉత్తమ చరిత్ర విలువలు బాధ్యత క్రుతజ్ఞత విశ్వసనీయత ఉన్న మనకు, పిలిచి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారు అంటే, ఉత్తమ ఆర్ యెస్ యెస్ కార్య కర్తలా, మోడీ గారు క్షమించండి, మేము దీనికి అర్హులము కాదు అని, నిజాయితీ గా మన గత చరిత్ర చెప్పి, కార్యకర్త గా మిగతా పదవులు ఇచ్చారు చాలు అంటూ, పక్కకు వచ్చి, పాపం తగ్గించుకోమా?

పోనీ అధ్యక్ష పదవి తీసుకున్నా, న్యాయం చెయ్యగలమా? చేయలేక పోతే, దానికి భవిష్యత్ లో శిక్షణ పంచభూతాల నుంచి పొందాలని మీకు తెలియదా? ఎన్ని శిక్షణలు, ఎన్ని జన్మలకు, మనము భరించగలము?

13* జగనన్న అవినీతి మీద రోజూ ప్రశ్నలు వేస్తున్నారు, మంచిదే, మరి బావ చంద్రన్న అవినీతి గురించి మర్చిపోయారే? ఆయన ఎన్నికల పోటీలో లేరా? లేదా రేపు ఇంటి ఆయనకు లేదా పిల్లాడుకు, అస్సెంబ్లీ సీటు మహిమా? అప్పుడే బహిరంగ పక్షపాతమా? మీరు ఇంట్లో కలుసుకోండి బంధువులుగా, కనీసం ఏ పార్టీలలో ఉన్నామో తెలుసుకుని, చిత్తశుద్ది చూపండి. జస్టిస్ చౌదరి సినిమా చూడండి, ఆశ్రిత పక్షపాతం ఉండకూడదు అని నాన్న చెప్పారు.

జగనన్న కేసులు ఎప్పుడు తేలేది? అది మోడీ తో, అమిత్షా తో, సీజీఐ తో మాట్లాడి, తొందర గా తేల్చవచ్చును కదా? తప్పు లేకపోతే, జగనన్న కూడా సంతోషపడతారు కదా?

అలాగే చంద్రన్న స్టేలు తొలిగిపోతే, చంద్రన్న కూడా, కడిగిన ముత్యముగా లాగ బయటకు వస్తారు కదా? ఎందుకు మీరు కేవలం ఒక్కరి నే, విమర్శలు చేస్తున్నారు? ప్రజలు, అధిష్టానం గమనించడం లేదా?

14* జగనన్న 150 సీట్లు పైగా తెచ్చుకోవాలి అని చెపుతుంటే, మీరు కనీసం 100 సీట్లు తెప్పించగలను అన్న ధీమా ఉందా, కనీసం పవన్ పోత్తు తో అయినా? కార్య రంగము లోకి దిగి పాదయాత్ర ఎప్పుడు? ఓపిక లేకపోతే, యువ నాయకుడు కి పగ్గాలు ఇవ్వండి.

ఆ కొత్త ఓట్ల ఆకర్షణ పార్టీలో తెచ్చారా, కొత్త నాయకులతో? అసలు ఆసెంబ్లీ చీరాలలో వార్డు ల లో, కనీసం స్థానిక బీజేపీ నేత ఎవరు, అంటే తెలీదు. ఫేస్బుక్ స్థానిక పేజీలలో ఫోటో, ఫోన్ నంబర్ ఉండదు. స్థానిక సమస్యల కోసం వారు పోరాడరు. మీలాగే, స్థానిక రాజకీయ నాయకులకు సలాం. వార్డు బీజేపీ నేత ఎవరు, వారి ఫోన్ నంబర్ ఏమిటీ అంటే, ఊళ్ళో ఎవరికీ తెలీదు. ఇంక రాష్ట్రం లో ప్రతి నియోజక వర్గం పరిస్తి తి ఇదే, దౌర్భాగ్యం కదా?

పవన్ కు ఎప్పుడు ప్లాన్ ఇస్తారు? ఇంకా పవన్ సీయెం అభ్యర్ధేనా లేదా తూచ్ ఆనాడు ఊరికే అన్నామా, ఇప్పుడు చచ్చినట్లు చంద్రన్న తో తను కలవాలని? లేదా బీజేపీ తరపున, లోపాయ కారి ఒప్పందముతో, సోదరి పుత్రుడు లోకేశన్న నే సీయెం నా, పవనన్న అండతో?

ఈ కపట నటన అడ్డ దోవల తోనే కదా, చంద్రన్న కు ఇన్ని పాట్లు ఇప్పుడు. చంద్రన్న లేకపోతే, ఒక్క నిఖార్సైన నాయకుడు లేడు పార్టీని నడపటానికి, జూనియర్ రామన్న తప్ప.

15* చిన్నమ్మా, ఇప్పుడైనా మంచి మనసు చేసుకుని, ఎక్కువ సీట్లతో రాష్ట్ర కమలం వికసింప చేయండి, పాపం తగ్గించుకోండి ఇప్పటికైనా. మీ అబ్బాయికి ఓ మంచి దోవ చూపండి, విలువలతో కూడిన రాజకీయంతో. జగనన్న, చంద్రన్న ను సమానం గా చూడండి పొగడ్తలు విమర్శలలో, పక్షపాతం వీడి.

ఇప్పుడైనా స్వార్ధం వీడి, బాధ్యత ఎరిగి, విలువలతో మోడీకి సాయం చేస్తారని బీజేపీ అభిమానుల విన్నపాన్ని మీకు ఈ విధముగా తెలియ చేస్తున్నాము. మంచి మనసుతో అర్ధం చేసుకుని, మీ మరియు మా భవిష్యత్తును, పంచభూతాల శిక్షణకు గురి కాకుండా కాపాడండి.

16* జనం కళ్ళు తెరుస్తారు ఏదో ఒకనాడు, నేడు మత్తులో ఉన్నా. ఎందుకంటే కన్న ముదుసలి తల్లి తండ్రి సేవ, భాగస్వామిని ఇచ్చిన ముదుసలి అత్త మామ సేవ అంటే వీరికి గిట్టదు. అంతే కాదు, తమ సొంత పిల్లల దగ్గర ముదుసలి వయసులో, దేవతలు గా సేవించ బడతాము అని కూడా, ఈ కసాయి వారు సిగ్గుతో చెప్పలేరు.

ఇంకా వీరు, వీరి పిల్లలు, కనీసం సొంత తల్లి మీద క్రుతజ్ఞతలుతో, వాట్సాప్ లో తెలుగు రాయలేరు. నిత్య అప్పుతో, జీవ హింస తో, శవ మామసం భోజనం లేనిదే, ముద్ద దిగదు.

అంత గొప్పవారు, ఆవును వార్డ్ మెంబర్ గా గెలిపిస్తారా? గెలిస్తే ఊరుకుంటారా? మరి మనము ఆవులుగా, పవన్ తో కలసి, జనాలకు విన్నపాలు చేయగలమా?

17* గెలుపు ఓటములు దైవాధీనాలు, కానీ ధర్మం వీడవద్దు. చెడుతో కలవ వద్దు. ప్రజలు మంచిని చీత్కరిస్తే, నష్టం మనకు కాదు వారికే.

అందుకే మహానుభావులు మనకు ప్రత్యక్ష సాక్ష్యం ఇచ్చి వెళ్ళారు - రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, శ్రీదేవమ్మ, కోడెలయ్య, కాఫీడేఅయ్య - వీరి జీవితాలలో చివరి పేజీలు చదవండి, పిల్లలకు, ప్రజలకు చెప్పండి.

అలాగే మన 3 వ అబ్బాయి జగనన్న, 2 వ అబ్బాయి చంద్రన్న ను కూడా కేసులు, బెయిళ్ళు, స్టేలు, జైళ్ళు వదలలేదు. పాపిష్టి జనాలకు, రోగాలు బాధలు మోసాలు తగ్గవు. పంచభూతాలు ఎవరినీ వదలవు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2139 General Articles and views 2,047,868; 104 తత్వాలు (Tatvaalu) and views 235,592
Dt : 27-Sep-2023, Upd Dt : 27-Sep-2023, Category : Politics
Views : 324 ( + More Social Media views ), Id : 1929 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Pavananna , jagananna , chandranna , lokesh , Chinnamma , lotus , bloom , seats , selfishness , Modi , purandeswari
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content