పిల్లల గుణాలు, బంధువులు స్నేహితులు కు దాచడం, తప్పు. అబ్బాయి విడాకులు సంవత్సరం కే? - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1620 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1655 General Articles, 61 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

ఏవండీ పిల్లల గుణగణాలు, బంధువులు స్నేహితులు కు చెప్పకుండా దాచి, తప్పు చేస్తున్నాం. మా అబ్బాయి విడాకులు సంవత్సరం కే, బాధగా ఉంది. ఇకనుంచి నిర్భయంగా చెప్పాలి, మన జాతి రత్నాల గురించి.

జవాబు, అవునండీ ఈరోజుల్లో చాలా మంది అలాగే చేస్తున్నారు, దాచిపెట్టి మోసపుచ్చుతున్నారు. అరచేతి ని అడ్డుపెట్టుకుని, సూర్య కాంతిని ఆపగలమా?

అలాగే మన పిల్లల మంచి చెడు గుణాల నూ, అందరితో స్పష్టంగా చెప్పాలి, పంచుకోవాలి. అలాగే పిల్లలు కూడా, వివరముగా తమ అలవాట్లు అందరికీ చెప్పాలి. అది అందరికీ శ్రేయస్కరం, నటనతో అందరికీ నష్టం. ఆ సుగుణాలు లేదా దుర్గుణాలకు, ఇష్టమైన వారే వస్తారు.

ఎందుకంటే నిజం దాగదు, ఏరోజైనా బయటకు వస్తుంది. మనం దాస్తే నటిస్తే, అవతలి వారి బతుకు, అలాగే మన పిల్లల బతుకు, చేతులారా నాశనం చేసిన వారము అవుతాము.

ఇప్పుడు 2000 సంవత్సరం తర్వాత, ఏ చిన్న తప్పు విషయం కూడా, సర్దుబాటు చేసుకోలేక, పెద్దల మాట వినలేక, జంటల మధ్య దూరం ఎకువగా పోయేలా ఉంది, చిన్నప్పటి పెంపక లోపం వలన.

ఈ సంవత్సరం లోనే, మా బంధువుల పిల్లాడి, రౌడీ అమర్యాద లక్షణాలు ఊరి అప్పులు దాచి, మోసం చేయబోయారు. బ్రతుకు జీవుడా, చివర క్షణం లో బయట పడింది.

ఎందుకంటే తాగుబోతు లేదా అబద్ధాలు మనుషులు కు, పది రూపాయలు ఊరక ఇచ్చిన కూడా, మనకు పాపమే వస్తుంది, ఫలితాలు వెంటపడుతాయి.

మంచి వాడు ఎప్పుడూ, మన లేదా ఇతరుల దగ్గర ధనం తీసుకోడు, ఆత్మాభిమానం తాకట్టు పెట్టి.

అందుకే, గతంలో రాజులు కూడా, ఉత్తములను సంస్కార వంతులను బ్రతిమాలే వారు, దయచేసి మా బహుమతులు స్వీకరించి, మమ్మల్ని ఆనందింప చేయమని, మా పుణ్య సంపాదనకు పెంపొందించుటకు అని.

ఇంకొక సంఘటన లో, అన్న రాముడు అని తమ్ముడు కూడా శాంత స్వభావి పెద్దలను గౌరవిస్తాడు, అని భ్రమ పడ్డాము. ఎందుకంటే, ఆ లక్షణాలు ఎవరూ చెప్పలేదు. కానీ విపరీతమైన కోపం తో ఊగిపోతూ, ఎవరిని ఎంత మాట అయినా, అనే రకం అని తెలుసుకుని, అప్పటినుంచి దూరంగా ఉన్నాము.

కానీ వివాహ జీవితంలో, అలా సర్దుకోరు కదా, లక్షలకు కొనుక్కుని ఉంటారు లేదా అమ్ముకుని ఉంటారు. ఇంట్లో ఉండే గుణం వారికి, వీధుల్లో తిరిగే గుణం వారికి, పొంతన కుదరదు. ఆఖరికి టీవీ దగ్గర కూడా, అలుగుడు తగవులు.

ఇడియట్ సినిమాలో చూపిస్తారు, జులాయి రౌడీ గాలికి తిరిగే కోపిష్టి అయినా, ఇష్టపడే స్వభావం గల వారూ ఉంటారు. తప్పు ఏముంది, రౌడీ అని తెలిస్తే, పార్టీలు గూడా, టిక్కెట్ ఇచ్చి గౌరవిస్తారు, జనం కూడా వారికే ఓటు వేస్తారు. మంచి వారు అని తెలిస్తే, ఓటు వేయరు కదా?

ఇప్పుడు చూడండి, మైనర్ కేసులో అరెస్టు అయిన, టిక్ టాక్ భార్గవ కు, 8 లేదా 80 లక్షలు కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు అంట సోషల్ మీడియాలో.

ఆ ఉత్తమ సంస్కార జనం లో, మనమూ మన పిల్లలు కూడా ఉన్నారేమో, అలాంటి వీడియో లు చూస్తున్నారు ఏమో, సరిచేసుకోవాలి లేదా గర్వంగా బయటకు చెప్పాలి.

కాబట్టి గుణాలు దాచి అబద్ధాలు అవసరం లేదు, దాచినా దాగదు. నటన ఎల్లకాలం సాగదు.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1655 General Articles, 61 Tatvaalu
Dt : 23-Apr-2021, Upd Dt : 23-Apr-2021, Category : General
Views : 512 ( + More Social Media views ), Id : 1126 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : children , boy , girl , attributes , characteristics , hiding , relatives , friends , wrong , divorce , year
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content