APLatestNews.com top Banner

Social Media links
కేంద్ర పధకం పేరు రాష్ట్రం కు మారుద్ది. జిల్లా, నియోజకవర్గ స్ధాయిలో పేర్లు మార్చి స్ధానిక నాయకుల? - Request - లోకం తీరు/ News
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 నిమిష చదువు సమయం.

మీరు చెప్పండి, మేము అడిగింది తప్పా? పధ్కాలకు మన పేర్లు ఉండటం ప్రజలకు ఇష్టం అయితే, స్ధానిక నాయకులు పేర్లు కూడా ఉండాలి కదా, రిజర్వేషన్లు ప్రకారం, అన్ని వర్గాలు ను గౌరవిస్తూ?

మేము ఒక పని కోసం, విజయనగరం బొత్స లేదా నెల్లూరు ఆనం లేదా చిత్తూరు రెడ్డప్ప లేదా అనంతపురం రంగయ్య గార్లు ను అడిగాము అనుకోండి, వారు వెంటనే ఏమంటారు నవ్వుతూ సరదాగా?

ఓసోసి, నీ నాటకాలు మాకు తెలుసులే, మీ మెసేజ్ లు మేమూ చూసాము లే, మీది ప్రకాశం జిల్లా, అక్కడ ఇద్దరు మంత్రులు మరియు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. పోయి వాళ్ళని ముందు అడుగు సహాయం, వాళ్ళ వలన కాకపోతే మా దగ్గరకు రా, మా జిల్లా ప్రజల సేవకే, మాకు సమయం చాలడం లేదు, అని అనరా?

పోనీ జగనన్న దగ్గరకు మనల్ని, రానిస్తారా? ఎవరన్నా గుర్తు పడతారా? సొంత అధికార ఎమ్మెల్యేలు ఎంపీలు కే, అపాయింట్ మెంట్ లేదని పేపర్లో గగ్గోలు చూస్తున్నాము కదా.

అంటే మన లేదా మీ జిల్లా ఎమ్మెల్యే లు ఎంపీలు మంత్రులే కదా, చివరకు మన మీద జాలిపడైనా కనికరించి, మన గోడు వినేది, పోనీ లే మన జిల్లా పిలగాడు ఏడుపు విందాం, సహాయం చేసినా చేయకపోయినా అనుకునేది?

కాబట్టి మన లేదా మీ మంత్రులు పేరు మీద, ఉదాహరణకు సురేష్ విద్యా దాన పధకం, బాలినేని ఉద్యానవన పధకం, మాగుంట నీటి పధకం, నందిగం రోడ్డు పధకం, కరణం కుందేరు పధకం, ఆమంచి పల్లెబాట పధకాలు పేర్లు పెడితే, ఏవో కొన్ని చిన్నవైనా, మన జిల్లాల స్థానిక నాయకులు ను, పొగిడినట్లుగా ఉంటుంది, జనం లో పేరు నానుతూ ఉంటుంది. మనల్ని కూడా ప్రేమ గా చూసుకుంటారు. దయచేసి ఇందులో తప్పు లేదా వల్లగాని కోరిక కోరామా, మా స్వార్ధం ఉందా?

కేంద్ర పధకం పేరు ఒకటి ఉంటుంది, రాష్ట్రం కు వచ్చే సరికి పేరు మారుద్ది, మోదీ గారి పేరు చెప్పుకుని నిద్రమత్తు లో ఉండే, బీజేపీ జనసేన నాయకులు ను, అడగండి చెబుతారు.

అలాగే మన జిల్లా స్ధాయిలో, నియోజకవర్గ స్ధాయిలో, పధకాలు పేర్లు మార్చి స్ధానికంగా నాయకులు పేరు పెడితే, ఎంచక్కా అందరికీ తెలుస్తోంది కదా, అని అంతే. తప్పు ఉంటే, మన్నించాలి, ఇది మన అభిమానులు శ్రేయోభిలాషులు కోసం మాత్రమే సుమా.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 796 General Articles, 46 Tatvaalu
Dt : 12-Oct-2020, Upd Dt : 12-Oct-2020, Category : Request
Views : 70 ( + More Social Media views ), Id : 753 , State : AP/ Telangana (Telugu) , Country : India
Tags : central , scheme , name change , state , local , leader name , district , assembly , level
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 8 yrs
No Ads or Spam, free Content