Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. * దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, సీబీఐ సహా అన్ని కేంద్ర దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లోని, ఇంటరాగేషన్ గదుల్లో, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలిచ్చింది.
* కల్తీ తేనే, చక్కెర పాకం కలిపి. పరీక్షల్లో 13 కంపెనీల్లో 3 కంపెనీలు.. సఫోలా, మార్క్‌ఫెడ్ సోనా, సొసియేట్ నేచురల్లీవి మాత్రమే కల్తీ ఉత్పత్తులు కావని తేలింది. అయితే, కొన్ని ఖండించాయి ఈ ఫలితాలను.
* 5 ఏళ్ల లో చంద్రన్న చేసిన రాష్ట్ర అప్పులు కన్నా, ఎక్కువ అప్పులు ఒక్క సంవత్సరం లోనే జగనన్న చేయగలిగారు, ప్రజల నెత్తిన, నేల మీద కనపడని కట్టడాలతో, ఇంత గొప్ప అభివృద్ధి భారం పెట్టగలిగారు అంటే, అది కేవలం జగనన్న సలహాదారు ల గొప్పతనం, అని వారి అభిమానులు కేరింతలు కొడుతున్నారు.
* ఇంకా మిగతా, 4 ఏళ్ల లో దొరికిన అంత అప్పు తెచ్చి, ఇక ఎవరికీ తదనంతరం అప్పులు దొరకకుండా చేయాలని, పొరపాటున తర్వాత తెదేపా గెలిచినా, బయట అప్పు అడిగితే, మొఖాన ఊసే కాడికి, రాష్ట్ర అభివృద్ధి తేవాలని, వీలైతే పన్నులు కూడా పెంచి, జనం ను సంతోష సంభ్రమాశ్చర్యాలలో, ముంచాలని అభిమానుల కోరుతున్నారు. ఇంటి పన్ను పెంపు వార్తలు వస్తున్నాయి.
చంద్రన్న అభిమానులు, అప్పు తర్వాత దొరకదేమో అని ఓ వైపు బాధ. పర్లేదు, అమరావతి ఫార్ములా ప్రతి నగరంలో పెట్టి, అన్ని నగరాల స్ధలాల ను సింగపూర్ కు లాగా ఇతరులకు సమానంగా పంచాలని, ఆ స్ధాయి కి పెంచాలని ఓ ఆశ, ముందు తాత్కాలికంగా, తర్వాత అసలు కట్టుబడి ఏళ్ళు కొనసాగించాలని కోరిక.
* ఇన్నాళ్లు వైజాగ్ మీద కేవలం ఒక వర్గం నియంత్రణ, ఆక్రమణలు, ఆధిపత్యం ఉండి, రెండో వర్గానికి ఆ అవకాశం ఇవ్వలేదు అని, ఇప్పుడు ఆల్రెడీ అభివృద్ధి చెందిన వైజాగ్ కు, ఇంకొన్ని కొత్త కట్టడాలు ఇచ్చి, మన వర్గం ను కూడా, ప్రతిష్టాత్మకంగా నిలబెట్టాలని చేస్తున్న ప్రయత్నాలు కు, అభిమానులు అచ్చెరువు చెందుతున్నారు.
రాయలసీమ కోస్తాలలో ఉన్న ఇరువర్గాల సామరస్య పోరాటా లను, ఉత్తర ఆంధ్రా ప్రజలకు కూడా భాగస్వామ్యం చేసి, ఓలలాడించాలన్న మూడు రాజధానుల ఆటకు, ఇరు వర్గాల అభిమానుల ఆనందహేళ.
మరి కొత్త జిల్లా విభజన లో, అభివృద్ధి 3 అసెంబ్లీ లలో జరుగుతుందా, అలాగే చేస్తారా లేక కేవలం వైజాగ్ పట్టుకోసమే నాటకమా, అని అడగని ప్రతి పక్షాలు, చెప్పని అధికార పక్షం.
* రాజ్యసభ ఎంపీ సురేష్ ప్రభు గారు, కేంద్ర కు ఉత్తరం రాశారు, అన్ని రాష్ట్రాల విచ్చలవిడి అధిక అప్పులు ఆపాలని, అలాగే పంచుడు కార్యక్రమాలకు కార్పొరేషన్ నిధుల మళ్ళింపు మోసం ఆపాలని, కోరారు అని పుకార్లు.
మన రాష్ట్ర ఎంపీలు కు అలాగే బీజేపీ జనసేన కు, కనపడని నగ్న సత్యాలు, ఆయనకు తెలిసినవి అంటే, మన వాళ్ళు, మన రాష్ట్ర మంచి ఎంత కోరుతున్నారో, దైవం మరియు జనం గ్రహిస్తూనే ఉన్నారు.
* చంద్రన్న 80 కోట్లు పెట్టి, జనం చే జయహో చంద్రన్న పాటలు పాడించారు, అని వృధా ఖర్చు ను ఓ వైపు గేళిచేస్తూ, ఇంకోవైపు వైకాపా 100 అడుగుల రాజన్న విగ్రహాన్ని పోలవరం దగ్గర, ప్రభుత్వ నిధులు తో పెట్టిస్తాను, అంటున్న మాటలకు అభిమానులు అచ్చెరువు.
రేపు అంజయ్య, ఎన్టీఆర్, చంద్రన్న విగ్రహాలు 101 అడుగులు పోటీ తో పెట్టిస్తే, వాళ్ళ ను తిట్టి, మనం అదే బుద్ధి లేని పని చేయడం కరెక్టే నా, అంటున్నారు.
పోటీలు, పగలు పెంచవద్దని మనవి. ప్రజల ధనం తో పధకాలు కు పేర్లు పెట్టుకుంటూ ఓ వైపు, ఇలా నాయకులు విగ్రహాలు అవసరమా, వృధా ఖర్చు తో అని జనం చెవులు కొరుకుంటున్నారు.
* కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోపోతే, రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు. కౌలు రైతులను ఆదుకునేందుకు, ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ ప్రకటించాలని, డిమాండ్ చేశారు.
* పోలవరం పనులు, రైతులు ఇన్సూరెన్స్ గురించి వైకాపా, తెదేపా విరుద్ధమైన మాటలు చెపుతుంటే,
జనసేన బీజేపీ ల ఫేస్బుక్ లో, ఆంధ్రా అసెంబ్లీ జరుగుతుంది అని గాని, వీళ్ళ ఆరోపణలు ఖండిస్తూ లేదా సమర్ధన చేస్తున్న విషయాలు, ఒకటీ లేవు అని అభిమానులు ఆవేదన.
అసెంబ్లీ గొడవలు మాకు సంబంధించిన విషయాలు కాదని, మేము వివరణలు ఇవ్వమని గమ్ముగా ఉన్నారు, ఉత్తమ ప్రజా బాధ్యత తో, అని అభిమానులు ఆవేదన.
బీజేపీ మోదీ భజనలో మరియు కార్యకర్తల సమావేశం లో ఉంటే, ఇప్పుడు పవనన్న రైతుల పరామర్శ టూర్ లో ఉన్నారు.
బహుశా తిరిగి వచ్చిన తర్వాత, అయిపోయిన అసెంబ్లీ సమావేశాల సారాంశం, బీజేపీ జనసేన ఫేస్బుక్ లో పెడతారు ఏమో, అని ఎదురు చూపులు.
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1958 General Articles and views 1,588,224; 97 తత్వాలు (Tatvaalu) and views 199,709 Dt : 02-Dec-2020, Upd Dt : 02-Dec-2020, Category : Politics
Views : 625
( + More Social Media views ), Id : 833 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
cctv ,
adulterated ,
honey ,
andhra ,
state ,
debts ,
vizag ,
capital ,
suresh ,
statues ,
pawan ,
polavaram Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేవలం ఒక మీడియా వార్త నే నమ్మలేము, ఒకే చోట అందరి వార్తలను ఇక్కడ చూసి, నిజాలు పోల్చుకోగలము
Facebook Comments