భారత దేశభక్తి పాటల పోటీ - 22 పాటలు - రూ 4000 బహుమతి - 10 వ తరగతి మరియు లోపు వారికి - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2134 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2169 General Articles and views 2,200,411; 104 తత్వాలు (Tatvaalu) and views 243,914.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

*Bharath Patriotic Song Competition - 22 Songs - Prize Rs 4000 - For Class 10th and Under*

If you are from other language, but children can sing 17 telugu and 5 hindi common famous songs, still you can try if you are getting Whatsapp messeges directly from us.

మీరు ఇతర భాషలకు చెందిన వారైనా, పిల్లలు 17 తెలుగు మరియు 5 హింది అందరికీ తెలిసిన పాటలు పాడగలిగితే, మీరు మా నుండి నేరుగా వాట్సాప్ సందేశాలను పొందుతున్నట్లయితే, మీరు ప్రయత్నించవచ్చు.

*భారత దేశభక్తి పాటల పోటీ - 22 పాటలు - రూ 4000 బహుమతి - 10 వ తరగతి మరియు లోపు వారికి*

చాక్లెట్ల పండగ వచ్చేస్తుంది, ఆగస్ట్ 15, ప్రపంచములో ఎక్కడలేని స్వాతంత్రం మనకు ఉంది. పిల్లలూ, యువకులూ, మీ పెద్దలను చుట్టు పక్కల వారిని దేశభక్తి అంటే ఏమిటి అని అడిగారా? ఏమి జవాబు చెప్పారు?

ఊళ్ళో లేదా పట్టణాలు/ నగరాలలో లేదా విదేశాలలో ఉండే వారి ముక్త కంఠ జవాబు -

1. మేము ఓటు తో పాటుగా, మా కుటుంబ ఆత్మాభిమానమును అమ్ముకుని, వర్గం అవకాశం అవసరం తో, నక్కకు పాముకు పులికి మాత్రమే ఓటు వేస్తాము, అలాగే ప్రజాస్వామ్యాన్ని కుళ్ళబొడిచి వారసత్వ బానిసత్వం ను పెంచుతాము, చచ్చినా ఆవుకు ఓటు వేయము అని చెప్పారా?

2. అప్పులతో పప్పుకూడు తింటూ, నీతి నియమం నిబద్దత జాలి దయ కరుణ మానవత్వం వాక్సుద్ది స్తిరత్వం లేకుండా, ఆస్తులు పెంచమని ప్రోత్సాహము చేస్తూ, మాకు సంస్కారం నేర్పని ముదుసలి తల్లి దండ్రులు అలాగే పిల్లను ఇచ్చిన ముదుసలి అత్తమామలను, మేము మా దగ్గర ఉంచుకుని సమాన సౌకర్యాలు ఇస్తూ, దేవతలు గా సేవలు చేయము. ఆ పాపాత్ములను ప్రాపంచిక మోహ దాసులను, ఊళ్ళో లేదా అనాధాశ్రమములో, ధనం విదిలించి ఒంటరిగా వదిలేస్తాము, అని చెప్పారా?

3. ప్రజా పన్నులతో నడిచే పధకాలకు, మన కుటుంబం పేర్లు పెట్టుకోవడం, రాష్ట్ర ఆస్తులు తాకట్టు అమ్మడం అప్పులు పాలు చేయడం, తప్పు నీచం కుసంస్కారం, అని చెప్పే సంస్కారం మన వంశంలో లేదు అని ఒప్పుకున్నారా?

ఒకవేళ చెపితే, వారిని నమ్మవచ్చు, ఎందుకంటే కపటం నాటకం 2 నాల్కలు వారికి లేవు. స్వచ్చమైన రాక్షసులుగా, కనీసం నిజం ఒప్పుకున్నారు. తమను తాము తెలుసుకున్నారు, తమను పంచభూతాలు కాలరాస్తాయి అని వారికి తెలుసు. అంటే రావణ దుర్యోధనులుగా నిజాలు చెపుతున్నారు. కాబట్టి వీరికి దేశభక్తి లేదు అని తెలుసు కదా?

అమ్మ అయ్య, అత్త మామ, ఓటు విలువ, తెలియని వారికి, దేశభక్తి ఉండదు కదా? దేశమంటే మట్టి కాదు, మనుషులు అని మనకు తెలుసు కదా?

పైన చెప్పిన 3 విషయాలు చేయకుండానే, మేము త్వరలో చేస్తాము, అసలు ఎందుకు చెయ్యాలి, చేయకపోవడానికి మాకు 100 కారణాలు ఉన్నాయి, అని నటించే కపట నాటక నీచ జనం ఇంకా ఎక్కువ మంది ఉంటారు. వీరికి ఎటూ దేశ భక్తి నటన తప్ప, ఏమీ ఉండదు. చివరికి ఆ నటన, మోసం, కపటం తోనే, వారి జీవితం నాశనం అవుతుంది, పంచభూతాలు సొంత వారితో అదే కపటం మోసం తో కాలరాస్తాయి. ఏది ఇస్తే, అదే తిరిగి వస్తుంది కదా.

మీ పెద్దలను వీరి అంతిమ జీవితం గురించి అడగండి, మహానుభావులు పుణ్యాత్ములు, మనకు సాక్ష్యం చూపించి వెళ్ళారు - రామన్న, రాజన్న, సావిత్రమ్మ, జయలలితమ్మ, కోడెలయ్య, మన ఇళ్ళ చుట్టూ వందలు వేలు ఉన్నారు.

కాబట్టి మీరైనా, ప్రహ్లాదుడు లాగా మారి, పెద్దల కుసంస్కారాన్ని వీడి, మన ముదుసలి అమ్మ నాన్న కు, అత్తా మామకు, ఆవుకు వేసే ఓటుకు, అండగా ఉండాలి, అన్న సంకల్పబలము తో ఉంటే, మీకు దేశభక్తి ఉన్నట్లే. అందుకు రుజువుగా ఎన్నో చూపాలి - శనివారం పంపే లిస్ట్ మీ అమ్మ నాన్నల దగ్గర చూడండి, అర్ధం అడగండి. వాటిలో ఒక దోవ గాత్ర నైవేద్యం, ఈ దేశభక్తి పాటలు పాడటం, మేము కూడా పాడము అండి, మేము చేయకుండా మిమ్మల్ని చేయమని అడగకూడదు. పెళ్ళికి, ఉద్యోగానికి, ఫించను కు కూడా, మనము రుజువులు చూపాలి.

మీరు చేయవలసిందల్లా ఒక్కటే, మీరు కనీసం మా స్థాయిలో అన్నా పాడగలగాలి, మేము గాయకులము కాదు. కానీ ప్రయత్నం చేసాము, 5 లింకులు పంపాము. మీరు అలాగే ఈ ఆగస్ట్ నెల 14, 15, 16 (3 రోజులు) 2023 తేదీలలోపు ఈ 22 పాటలు ఎటువంటి సంగీత వాయిద్యాలు లేకుండా, కేవలం మీ గొంతు మాత్రమే ఉండాలి, సోషల్ మీడియాలో పెట్టి, లింక్ లు మాత్రమే పంపాలి. ఏళ్ళుగా మా నుంచి వాట్సాప్ సందేశాలు అందుకునే మీ పెద్దలు, ద్వారా నే ఈ సమాచారం, మీకు అంది ఉండాలి. వారి ద్వారానే, మీరు లింక్ లు పంపాలి - మీరు వారి పిల్లలు/ మనుమలు అయినా పర్లేదు. పాటలు అన్ని మీకు యూట్యూబ్ లింక్ లో ఉన్నాయి, మీరు వెతకక్కరలేదు.

10 వతరగతి అంటే షుమారు 15-16 ఏళ్ళు వయసు ఉంటుంది కదా. ఇతరులను సాక్ష్యం మనము అడగలేము. ముఖ్యముగా, ప్రభుత్వ ఉద్యోగులు ప్రయత్నం చేయాలి సుమీ. విదేశాలలో ఉంటే, 4000/ 80 = 50 డాలర్లు/ Dollars ఇవ్వబడుతుంది. మీ పెద్దలకు పేటీయెం లేదా బాంక్ అకౌంట్ ఉండాలి, వారి పేరున బదిలీ చేయబడతాయి.

తుది నిర్ణయం మాదే, ఎటువంటి వాదోప వాదాలకు అవకాశం లేదు. ఇది దేశభక్తి పెంచడానికి, ముదుసలి తల్లి దండ్రులు/ అత్త మామాలకు, ఆవుకు ఓటు వేసే వారిని ప్రోత్సహించడం కోసమే. అంటే, నీతి నిజాయితీ మానవత్వం సంస్కారం పెంచడానికి మాత్రమే.

మీకు కోట్లు ఉన్నా, మీరూ పాల్గొని, బీదలకు ఇవ్వండి. ఎందుకంటే, 9 ఏళ్ళ సజీవ గురువు సేవ, 200 వారాల 108 ప్రదక్షిణాల సాధన, 40+ నెలల శిరోముండనం, 20+ ఏళ్ళు గా నేల నిద్ర, శాఖాహారం తో ఉండే వారి దగ్గర, నీతి నిజాయితీతో సంపాదించినది, ఆనందముగా ఒక్క రూపాయి తీసుకున్నా, అది మీరు ముదుసలి వయసులో, మీ సంస్కార పిల్లలతో దేవతలుగా సేవించబడే ఓ మార్గములో ఉన్నట్లే. మీ సందేహాలు అన్ని, ఈ లింక్ లో అప్డేట్ చేస్తాము.

* Desabhakti- Padavoyi bharatiyuda, Na janmabhumi, Gandi puttina, Ardha satabdapu, Jatiya pratijna - 5
* దేశభక్తి - పాడవోయి భారతీయుడా, నా జన్మభూమి, గాంధి పుట్టిన, అర్ధ శతాబ్దపు, జాతీయ ప్రతిజ్ఞ - 5
* Desabhakti - Pillallara papallara, Priya bharata, nidharmam nisangham, Jagati sigalo, Tenela tetala - 5
దేశభక్తి - పిల్లల్లారా పాపల్లారా, ప్రియ భారత, నీధర్మం నీ సంఘం, జగతి సిగలో, తేనెల తేటల
* Desabhakti-Gandhi Puttina Desam, Deshamunu Preminchu, Ye Desamegina, Raghupati raghava - 4
దేశభక్తి - గాంధీ పుట్టిన దేశం, దేశమును ప్రేమించు, యే దేశమేగిన, రఘుపతి రాఘవ
* Desabhakti-Jana Gana Mana,Vande Mataram,Sare Jahase,Janda uncha - 4
దేశభక్తి - జన గణ మన, వందే మాతరం, సారే జహాసే, జండా ఊంచ
* Desabhakti-Nenu nadesam,Vinara desam, Nenusaitam,Janani janmabhuamischa - 4
దేశభక్తి - నేను నాదేశం, వినరా దేశం, నేను సైతం, జననీ జన్మభూమిశ్చ  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2169 General Articles and views 2,200,411; 104 తత్వాలు (Tatvaalu) and views 243,914
Dt : 11-Aug-2023, Upd Dt : 11-Aug-2023, Category : General
Views : 354 ( + More Social Media views ), Id : 1874 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : Bharath , Patriotic , Song , Competition , 22 , Songs , Prize , 4000 , Class , 10th , India
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్నీ వార్తలే, నాకు నచ్చిన వార్తా వీడియో లు కొన్ని ఎంచుకోని, పని చేస్తూ ఇక్కడే వినొచ్చు చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 12 yrs
No Ads or Spam, free Content