గురువుల పాద సేవలో, అజ్ఞాన శిష్యుడి, మానసిక శారీరక రాత అక్షరాల పుష్పార్చన, బ్రహ్మ ముహూర్తాన - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,882,843; 104 తత్వాలు (Tatvaalu) and views 226,447.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

At feet of Guru, puja flowers of mental and physical written letters of ignorant disciple at Brahma Muhurta.

శుభోదయం, శుభదినం, శుభసంకల్పం. ఓం నమో నారాయణాయ, ఓం నమో శ్రీ మాత్రే నమః. మానసిక ఆరోగ్యం నియంత్రణ బలం గురించి, అలాగే అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం నష్టం గురించి, ఏళ్ళుగా మనం సత్సంగం జరుపుతున్నాము.

వాక్సుద్ధి, గాత్రశుద్ధి, చిత్తశుద్ధి, సజీవ గురువు సేవ, త్యాగం, లాంటి మోక్ష మార్గము లను పెంపొందించే ప్రయత్నాలు చేశాము.

30 ఏళ్ళు వయసు తర్వాత మనల్ని మనం కాపాడుకోవడం ముఖ్యం, ఈరోజే చివరి రోజు, ఎందుకంటే ఆసుపత్రులు రోగాలు బాధలు కన్నీళ్లు, రారా ఇటు రావా నను చేరా అంటూ, సారొస్తారొస్తారు అంటూ ఆనందం గా ఎదురు చూస్తున్నాయి.

ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు, రాత్రి 10 లోపు నిద్ర, ముందు జాగ్రత్తలు తో, మూడు రోజులు ముందే శుభాకాంక్షలు పంపి, సంస్కార గురువు ల ఆశీస్సులు వెంటనే పొందాం.

ఒకటో తారీఖు ఉదయం 4.30 కే లెగిచి, 10 ఏళ్ళుగా సాగుతున్న 78+ ఏళ్ళు అమ్మ సజీవ గురువు సేవ తో రోజు ప్రారంభం, ఆ తర్వాత ఇల్లు చిమ్మి, కాలకృత్యాలు తీర్చుకుని, పళ్ళుతోమి, రాత్రి మెంతి నీళ్ళు తో ఓ 14 పొడులు తో కషాయం కలపి, ఓ 7 పొడులు తో వేప మందు కలపాము.

ఓ నాలుగు వ్యాయామాలు చేసి, ధ్యానం ముగించి, యోగా లో మిగతా ఆసనాలు చేస్తూ, పద్మాసనంలో ఇవి రాస్తున్నాము, ఆధునిక కాలజ్ఞాన బ్రహ్మంగారు లా, యోగి వేమన గా.

ఇప్పుడు గురువు లను, ఈ మానసిక శారీరక రాత నైవేద్యం తో, పూజిస్తూ ఉన్నాము ఇలా, దైవ ఆజ్ఞ ను పాటిస్తూ, లోకం అప్పుడే వీడవద్దు నిరుపయోగం గా, సజీవ గురువు సేవ లేకుండా అని, తలవంచి పాద పద్మ నమస్కార వేడుకలతో.

ఆస్తులు అంతస్తులు పదవులు అందం మంది మార్భలం మనల్ని కాపాడవు అని ఎందరో మహాను భావులు ఈ 50 ఏళ్ళలో నిరూపించారు.

తర్వాత కాకర అల్లం వెల్లుల్లి పచ్చి రసం, క్యారెట్ రసం, బీట్ రూట్ రసం. ఇవన్నీ అమ్మ కు ఇస్తూ, రోగం లేకపోయినా మనమూ 10 ఏళ్ళుగా తోడు పెళ్లి కొడుకు లా తాగుతూ ఉన్నాము. ఆ తర్వాత వేదోక్తముగా దైవ ప్రార్ధన, ఆ తర్వాతనే అంత పలహారం.

తెలుగు భాష లో రాయడం మనందరికీ వచ్చు, ఎందుకంటే, మన సంస్కార తల్లిదండ్రులు, మనకు కృతజ్ఞతలు విశ్వసనీయత, ఉగ్గుపాలతో నేర్పారు. తెలుగు వారికి, ఆధ్యాత్మిక గురువులు తల్లిదండ్రులు, వేమన బ్రహ్మం రాఘవేంద్ర స్వామి శిష్యులు గా, మన గడ్డ పై పుట్టిన ఆయుర్వేదం అంటే మక్కువ మనకు.

ఎందుకంటే కాలు బాగు చేసినట్లు నటిస్తూ, చెయ్యి నో వేలునో, కాలేయం నో, తీసేస్తుంది, జీవితాంతం మందు నాకిస్తుంది, మరియు ఇన్నాళ్ళు అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం లో మనల్ని మనమే మరచి, ఆరోగ్యం మడిచి, కూడబెట్టిన అక్రమ సంపాదనను కరిగిస్తుంది ఆంగ్ల వైద్యం. చివరికి ప్రాణం కూడా తీసేస్తుంది. అందుకే అవసరం వరకే వాడాలి సుమా, అది ఎన్ని ఏళ్ళు కో.

ఒక పక్కన చుట్టాల పక్కాల డయాలసిస్, బీపీ, షుగరు, కాన్సర్, ట్యూమర్, మతిమరుపు, అధిక బరువు, ఆయాసాలు, కరోనా, కిడ్నీ, అనేక రుగ్మతలకు ఆసుపత్రికి టూర్లు,టాబ్లెట్ ల టిన్ లు, మింగలేక కక్కలేక తినలేక వదలలేక పొడిపించుకోలేక, నరకయాతన చూస్తున్నారు, దయచేసి గమనించగలరు, ఆలోచన తో సొంత కుటుంబం ను కాపాడగలరు.

మరలా నిర్లక్ష్యం బద్ధకమంటే ఎలా అన్నా/ అక్కా, ఇంకొన్ని రోజులు తర్వాత వాడతాము లేదా ఏదో మొహమాటానికి వాడతాము అంటే ఎలా, చిత్తశుద్ది ఏది మనలో.

మన ఇంటి ఆయుర్వేదం తో పాటుగా, ఆహార నియంత్రణ, మనశ్శాంతి కూడా ఉండాలి, కుళ్లు కుతంత్రాలు, 2 నాల్కలు, అరిషడ్ వర్గ అష్ట వ్యసన బానిసత్వం ఉండకూడదు. లేకపోతే ఆ మందు పనిచేయదు.

ఇంకో అన్న/ అక్క ను తీసుకుని రాగలమా, వారు వీరు లోకం వదిలి వెళ్ళాక. ఆలస్యం అమృతం విషం.

దయచేసి మమ్మల్ని అనాధలుగా, విడచి వెళ్ళవద్దు. వెంటనే నిబద్ధతతో ఇంటి ఆయుర్వేదం మందు రోజూ తినాలి తాగాలి.

ఎందుకంటే ఇంట్లో వండిన ఆహారమే, కల్తీ రసాయన సంకర జాతుల, 100 శాతం విషం. ఇంక బయట తిండి 150 శాతం విషం.

అందుకే ఇంట్లో తిండి తో, ఆయుర్వేదం అందరూ రోజూ వాడాలి. అప్పుడు 100 శాతం విషం స్తాయి, 50 నుంచి 75 కు దిగుతుంది. కొత్త రోగాలు మనల్ని అంటవు, పాత రోగాలు మధనపడుతూ మరుగున పడిపోతాయి.

ముందు తల్లి తండ్రుల పాద దాసుడు, ఆ తర్వాత నే హరి హర జ్ఞాన దాసుడు, తెలుగు గురువు లు బ్రహ్మం వేమన రాఘవేంద్ర స్వాముల ఆచరణ దాసుడు, ఈ మీ అజ్ఞాన శిష్యుడు శ్రీనివాసుడి, మంచి గురువు ల పాద సేవలో ఈ మానసిక శారీరక రాత అక్షరాల పుష్పార్చన.

కుక్క తోక వంకర నే, 5 ఏళ్ళుగా చెప్పినా, మన బుద్ది నిర్లక్ష్య ధోరణి మారదు, అది అనారోగ్యం. తెలుగు లో శుభాకాంక్షలు ధన్యవాదాలు అభినందనలు తెలియజేయాలి, మన కన్నతల్లి ని పాలను నడతను నేర్పిన సంస్కారం మరువద్దు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,882,843; 104 తత్వాలు (Tatvaalu) and views 226,447
Dt : 01-Jan-2024, Upd Dt : 01-Jan-2024, Category : General
Views : 150 ( + More Social Media views ), Id : 1976 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : guru , feet , puja , flowers , mental , physical , written , letters , ignorant , disciple , brahma , muhurta
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content