పాటతో పరమార్ధం - అందమైన ప్రేమరాణి (భక్తి పేరడీ)- ప్రేమికుడు- ప్రభుదేవా, నగ్మా, వడివేలు, ఎస్పీ బాలు - Songs - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2085 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2120 General Articles and views 1,883,138; 104 తత్వాలు (Tatvaalu) and views 226,463.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time.

Song Spirit - Andamaina premarani (Bhakti Parody) - Premikudu - Prabhu Deva, Nagma, Vadivelu, SP Balu

పాటలు రాగాలు మనకు అనుకూలముగా మార్చుకుని, దైవం, మంచి చెడు, ధ్యానం, ముదుసలి తల్లి దండ్రుల సేవ గురించి వీలైనన్ని దోవలలో, ప్రజలకు మంచి గుర్తు చేసే ప్రయత్నం చేద్దాం. భవిష్యత్ లో పంచభూతాల వలన కలిగే శిక్షలను తగ్గిద్దాము. వారి సంస్కార సంతానముతో ముదుసలి తనములో, దేవతలుగా కీర్తింప గలిగే అవకాశం చూపిద్దాం.

మానసిక సంస్కారము కలిగి ధ్యానయోగము సాధన చెయ్య గలిగితే, సత్తురేకు (మోహాంధులు) కూడా స్వర్ణమేలే (సాత్వికులు). ఆ చిన్న ప్రయత్నమే చేడంవలన అంటే, సాధన మహిమ కూడా, ముత్యమేలే. ఇది సాధన చేయగలిగితే, అటువంటి సంస్కార సంతానముతో ముదుసలి తనములో, దేవతలుగా కీర్తింపబడతారు.

దైవం కెపుడు, మనసులోన, భేదముండదే, పెద్ద పెద్ద ప్రసాదాలు ఆడంబర పూజలు అవసరము లేదు, బెల్లమైనా, అమృతమ్ములే, చివరకు తినేది మనమే కదా? చక్కెర అయితే షుగర్ వస్తుంది, బెల్లం మేలు. మనసులోన, రోజుకు ఒక్క సారి ఒక్క జపం ఒక్క అరగంట, మన నాదంలో వాదంలో నడకలో చేరితే, అదే కోటి రాగాలు పలుకుటుంది. పీచు బంధాలు, అర్ధ కామ మొహాల వలన నష్టం గ్రహించి, మనం వదిలి వేస్తే, దాని విలువ లక్ష సాధనలు కాదా?

ధ్యానం ఎపుడు, ముహుర్తాలు చూసుకోదులే, రాహుకాలం కూడా, కలిసి వచ్చులే. ముందు బ్రహ్మ ముహూర్తములో ని మొదలు పెట్టినా, తర్వాత వంట చేస్తూ కూడా, జపము చేయవచ్చు. మనలాంటి వారిని, ధ్యానం కొరకు పిల్వడానికి, హంస రాయబారమేల? కాకి చేత కూడా కబురు చాలు, వెంటనే అందుబాటులో ఉంటాము. ఒక్కసారి అంటుకుంటే, ధ్యాన జ్యోతి, ఆరిపోదే, ధ్యాన బంధం, ఎన్నడూ వీడిపోదే. ఇది నమ్మరానిది, కానె కాదే, ఈ సత్యం సంస్కారం లేని వంశానికి మనిషికి ఊరికీ, తెలియలేదే.

సంస్కారమై ధ్యానయోగ, చెయ్య గలిగితే..
సత్తురేకు కూడా స్వర్ణమేలే..
సంస్కారమై ధ్యానయోగ, చిన్న యత్నమే..
సాధన మహిమ కూడా, ముత్యమేలే
కంటి నీరే, శాంతి గంధం
నేరు చూపే, మోక్ష మార్గం
మనసుల, సంగీతమే.. ఊహూ..భూమికే భూపాలమే 2

సానిసా సారిగారి సానిసానిసాని
సానిసా సాగమామపమాగారీస
సానిసా సారిగారినీ సానిపానిసానిసా
సాగమమమ మాప మాగరీస

అందమైన, దేవ పూజ, పునస్కారాలలో
లోతురాతలైన, కవితలవునులే
దైవం కెపుడు, మనసులోన, భేదముండదే
బెల్లమైనా, అమృతమ్ములే
మనసులోన, ఒక్క జపం
మన నాదంలో చేరితే, కోటి రాగాలు
పీచు బంధం, అర్ధ కామం
మనం వదిలి వేస్తే, దాని విలువ లక్ష సాధనలు ||సంస్కారమై||

ధ్యానం ఎపుడు, ముహుర్తాలు చూసుకోదులే
రాహుకాలం కూడా, కలిసి వచ్చులే
ధ్యానం కొరకు, హంస రాయబారమేలరా
కాకి చేత కూడా కబురు చాలులే
ధ్యాన జ్యోతి, ఆరిపోదే
ధ్యానబంధం, ఎన్నడూ వీడిపోదే

ఇది నమ్మరానిది, కానెకాదే
ఈ సత్యం ఊరికీ, తెలియలేదే

ఆకశం భూమి, మారినా మారులే- కానీ.. ధ్యానం నిత్యమే,
ఆ.ది దైవం చెప్పిన మాటలే..ఇంకా వినిపించులే
ధ్యానం కష్ట మార్గమని... ఎవ్వరైన చెప్పినా
నువ్వు బదులు చెప్పు, మనసుతో..
ధ్యానం, ముళ్ళ బాట కాదు, వెళ్ళవచ్చు
అందులో నువ్వు వెళ్ళు నిర్భయంగా..

చిత్రం : ప్రేమికుడు; రచన : రాజశ్రీ; గానం : యస్పీ బాలు, ఉదిత్‌ నారాయణ్, యస్పీ పల్లవి; సంగీతం : ఏఆర్‌ రెహమాన్‌  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2120 General Articles and views 1,883,138; 104 తత్వాలు (Tatvaalu) and views 226,463
Dt : 09-Jul-2023, Upd Dt : 09-Jul-2023, Category : Songs
Views : 216 ( + More Social Media views ), Id : 1824 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : andamaina , premarani , bhakti , parody , premikudu , prabhu , deva , nagma , vadivelu , balu
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
అన్ని పత్రిక, టీవీ, సంక్షిప్త, రేడియో వార్తలు ఇక్కడే, అబ్బో అన్ని లింక్ లు గుర్తు వద్దు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content