Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time. *అది లేనప్పుడు, మాలా రోజూ, చాకిరేవు తో, రక్త కన్నీరు చింతామణి నాటకం ఉంటుంది, అని మీరు అన్నారు అనుకోండి*
In the absence of that, we would have a drama every day, with chakirevu, blood tears and chintamani drama, you think.
గుణవంతుడు/ గుణవంతురాలు, స్ధిరత్వం, సజీవ గురువు సేవ, స్ధితప్రజ్ణత, చిత్తశుద్ది, వాక్సుద్ది, ఓర్పు, సహనం, త్యాగం, మానసిక బలం ఉంటే కదా, బంధం అనుబంధం, దైవం మరియు పంచభూతాల అండతో, మనశ్శాంతి తో, సంస్కారం తో, చిరకాలం, ముదుసలి తనం సేవ వరకు నిలుస్తుంది, అలాగే సంస్కార పిల్లల పెంపకం దగ్గర దేవతలు గా కొలవబడేది, ఇరువైపులా పెద్దల ఆత్మలు సంతోషపడేది,
అది లేనప్పుడు, మాలా రోజూ/ వార/ నెల, చాకిరేవు తో, రక్తకన్నీరు చింతామణి నాటకం ఉంటుంది, అని మీరు మేము అన్నాము అనుకోండి,
అహే ఊరుకో, అంత ఓపిక త్యాగం సహనం సంస్కారం మాకు లేవు, మము కన్న వారికి, అసలు మా వంశానికే లేవు, ఇక చేసుకో బోయే వారికి ఈ మాటలకు అర్ధమే తెలీదు మాకన్నా వారికి అత్యాశ ఎక్కువ, ఆలాంటి వారి దగ్గర కొట్టెయ్యాలని మా వాళ్ళ దురాశ - ఇక్కడ పెళ్ళి 2 ఆస్తులకు, 2 పదవులకు, 2 వీసాలకు, 2 అధికారాలకు, 2 అహంకారాలకు, 2 వ్యామోహాలకు, 2 కలియుగ పాపం పెంచేవారికి, 2 మూర్ఖులకు, 2 కపట నటన అవసర అవకాశవాదులకు మాత్రమే
- మా స్నేహితులు బంధువులు నాయకులు ఉద్యోగస్తులు ఇరుగు పొరుగు అందరికీ తెలుసు, 80 శాతం మా అందరివీ ఆ బుద్దులే. కపట నటనతో, వెన్నుపోటు పొడువు, కావలసింది లాక్కో, పాదాలకింద నలుపు లేదా బానిసలా ఓ మూల పడి ఉండనీయ్, లేదా నువ్వు వారితో తిరుగు నేను వీరితో తిరుగుతా. మన చుట్టూ ఇంతే, మొహమాటం లేదు సుమీ.
ఆ శనివారం అరిషడ్వర్గ అష్టవ్యసన సాధన పేద్ద లిస్ట్, మా ముదుసలి అమ్మ నాన్న అత్త మామకే ఇస్తే, మేమే ఈ ముదుసలి వయసులో చదవము చాదస్తం తలనొప్పి, మీకెందుకమ్మా హాయిగా ప్రాపంచిక సుఖాలలో మునగండి, అప్పులు చేసి ఆస్తులు పెంచండి, రోగాలు వచ్చిన దాకా తిని తిరగండి, సంపాదన ముఖ్యం ఇద్దరుకు, ఒకవేళ ఒకరు ఉద్యోగం చేయకపోతే సినిమా టీవీ ఓటీటీ రీల్స్ సోషల్ మీడియా మత్తు ముఖ్యం, మొహమెత్తి విడాకులా తమలపాకుల్లా తీసుకుందాం సగం ఆస్తితో వీరు కాకపోతే ఇంకోకరు బకరాలు దొరకరా,
పిల్లల పెంపక సంస్కారం, మనకు చిట్ట చివరి బాధ్యత, పట్టించుకోకపోయినా పర్లేదు, మనం చెప్పినా ఆ పిల్ల గుంటలు వినరు, రిమోట్ నో ఇంకోటో విసురుతారు, మన మాడు పగులుతుంది లేదా మేకప్ చెదురుతుంది లేదా పోలీసులను పిలుస్తారు, కాబట్టి గమ్ముగా ఉంటే ఇంట్లో మిగతా ఖరీదైన వస్తువులుగా మనకు నష్టం లేదు, బుద్ది జ్ఞానం సంస్కారం లేని బండ సమాజం మనల్ని ఏమీ అనదు. మన సమాజం, గౌరవముగా నక్క పాము పులికే ఓటు వీరు మనకు నీతులు చెపుతారా? అవ్వ.
కానీ అప్పు చేసి 2 ఆస్తులు/ స్థలాలు/ ఇళ్ళు అయినా కొనందే, ఎవరైనా పోతే గోఫండు కు పోనిదే, సినిమా టీవీ ఓటీటీ రీల్స్ సోషల్ మీడియా మత్తు లేనిదే, తెలుగు పార్టీ/ సంఘం లో చేరనిదే, ఓటుకు నోటు నక్క పాము పులి కి వెయ్యనిదే, ముదుసలి తల్లి దండ్రులు అత్త మామలను ఒంటరిగా దూరంగా లేదా అనాధాశ్రమాలలో వదలనిదే, ఏదో ఒక రోగముతో బొజ్జ పెంచి ఆసుపత్రి కి పోయి రోజూ మందు బిళ్ళలు మింగనిదే, కోర్ట్లకు లాయర్లకు పోలీసులకు ఆసుపత్రులకు మనకు కనీస తగిన పనులు అమర్చనిదే, మనకు సంఘములో గౌరవము, మర్యాద, మన్నన, విలువ పెద్ద మనిషి హోదా ఉండదు. ఎంత ఎక్కువ అప్పు ఉంటే, ఎంత ఎక్కువ మందిని కపట నటనతో మోసం చేయగలిగితే, అతను/ ఆమె అంత కుసంస్కార వంతులు, వారి వైపే 80 శాతం మంది సప్పోర్ట్.
మాలాగా ఎవరి మాటా వినవద్దు, మా డబ్బు, మా ఆస్తి, మా అహంకారం, మా ఇష్టం మీరు ఎవరు మీకేమి సంబంధం, మా పతనం, మా వయస్సు/ ఓపిక అని ధైర్యంగా చెప్పండి. మన జవాబు మన ఎమ్మెల్యేల స్థాయిలో ఉండాలి - చంద్రన్న జగనన్న పెంచి పోషించిన నాని, రోజా, వంశీ స్థాయిలో ఘాటుగా ఉండాలి. ఆయనే చెప్పారు కదా, కనీసం రాక్షసులు గా నిజాయితీ గా ఒప్పుకోండి అని. మనకెందు కమ్మా కపటం నటన, ఉన్నది ఉన్నట్లు గా చెపుదాం.
మా చంద్రన్న/ జగనన్న లాగనే, అంటే ఊళ్ళోళ్ళ సొమ్ముతో పన్నులతో తాకట్టుతో అప్పులతో నడిచే పధకాలకు, సొంత కుటుంబ పేర్లు పెట్టుకున్నట్లే, మేము కూడా, మా ఇంట్లో ఊళ్ళో వంశములో వ్యాపారములో ఉద్యోగములో కుటుంబములో, అదే పద్దతి పాటిస్తాము. సమాజం లో ఒక్క సంస్కార పెంపకం ఉన్న ఓటరు/ తల్లి తండ్రి/ కూతురు కొడుకు/ నాయకుడు/ అధికారి ఉంటే కదా, ఇది తప్పు అని చెప్పేది, 15 ఏళ్ళు పైగా?
కాబట్టి, మంచిని మెచ్చవద్దు పంచుకోవద్దు చర్చించవద్దు. కర్మ/ ఖర్మ రెండూ కాలినప్పుడు తర్వాత చూద్దాము. మనకు బుద్ది చెప్పేది, పంచభూతాలే - అంటే భూకంపాలు, వరదలు, తుఫానులు, అగ్నికీలలు, త్సునామి, యాక్సిడెంట్లు, ... అంతే కానీ మనుషుల మంచి మాటలు మెత్తగా వినము, వినలేము అని చెప్పారు మా పెద్దలు, అందరమూ అవే పాటిస్తున్నాము.
ఇప్పుడు మేము, 40-60 ఏళ్ళు ఆగాలా? 40 ఏళ్ళు వాళ్ళు ను లేదా ధనం లేని వారు ను చూడాలా, సంస్కారవంతులను చేసుకోవాలా? కుదరదు, విడిపోయినా క్షణంలో కోట్లు ఉండాలి, ఆస్తులు సగం లేదా పూర్తిగా రావాలి. ఆత్మాభిమానం అన్న మాటలు కూడు పెట్టవు. మీకు 3 ఏళ్ళు ఆదాయం లేకపోతే, ఏ సంస్కారి వచ్చి చెయ్యి అడ్డుపెట్టారు? అదే మాకు గొఫండ్ లో అర కోటి వచ్చేది ఆ స్తితిలో, అమ్మకు సహాయం కావాలి అంటే. మిగతా విషయాలు, మనకు అనవసరం అంటారు ముందు, గర్వముగా, కాళ్ళు నేల మీద ఆనవు, కళ్ళు ఆకాశం నుంచి దిగవు. మేము రావణ దుర్యోధన తాటకి పూతన కీచక శూర్పణక వారసులం అంటారు.
ఆ తర్వాత లాయర్, కోర్టు, కన్నీళ్లు, పిల్లలు మరియు భాగస్వామి వదిలేయడం, ఆసుపత్రులు రోగాలు అనాధాశ్రమాలు, పిచ్చి ఆసుపత్రులు, వెన్నుపోటు ద్రోహాలు, మందు కలపడం, మెట్ల మీద నుంచి తోయడం, బాత్ టబ్ లో పోవడం, అన్ని మామూలే అనుకోండి. ఇది నేటి మానసిక బలహీన దౌర్భాగ్య పరిస్థితి.
అందరికీ ఇది భవిష్యత్ అని తెలుసు, కానీ పశ్చాత్తాపం పొందకుండా, అబ్బో గురువులుం/ శిష్యులుం గారు దిగి వచ్చారు అండి నీతులు చెపుతున్నారు అని మనల్ని అంటారు. చివరకు దేవుడు చూడమ్మా ఎలా మోసం చేసారో, ఎంత ఖర్చు పెట్టి ఎన్ని కపట నటన పూజలు చేసినా, దయ చూపలేదు అంటారు. వీళ్ళు ఆఖరుకు దేవుడిని కూడా తిట్టకుండా వదలరు, ఏమిచ్చావు అంటారు, వాళ్ళకు తెలీకుండానే వారి విలువైన కిడ్నీ/ ప్రాణం మాయమైన/ పోయిన దాకా.
అరిషడ్వర్గ బానిసత్వం వీడదాం, మనల్ని మనం తెలుసుకుందాం. అది లేకుండా, దేవుని కనుగొనలేం ఆత్మ ద్రోహం తో.
మా ఊరు రామన్న, రాజన్న, జయలలితమ్మ, శ్రీదేవమ్మ, కోడెలయ్య, కాఫీడేఅయ్య, వీరు సహాయం పూజ వ్రతాలు దాన ధర్మాలు యాత్ర యాగాలు సేవలు చేశారు. సంతానం బలగం బంధువులు స్నేహితులు అధికారం ఆస్తులు అన్ని ఉన్నాయి.
ఈ మధ్య వాట్సాప్ లో పెడుతున్నారు,
Cant control own monkey mind and Arishadvarg Ashtavyasan slavery,
Cant talk to own soul, parents, partner and children, text message only please అని వారి ఇంటి ఒంటి వంశ అరిషడ్వర్గ అష్టవ్యసన బానిసత్వం ను ప్రొఫైల్ ఫోటో ఉండదు, రీడ్ రిసీప్ట్ ఉండదు, తమ గురించి, పిల్లలు, పెద్దలు గురించి, తమ పనులు సంస్కారం సేవ సాధన గురించి స్టేటస్ ఉండదు, స్పందన ఉండదు. మరలా భక్తి దైవం సంస్కారం నీతి నిబద్దత లోకం పాడయ్యింది అంటారు, జై శనీశ్వరా.
Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2185 General Articles and views 2,341,304; 104 తత్వాలు (Tatvaalu) and views 253,849 Dt : 26-Aug-2023, Upd Dt : 26-Aug-2023, Category : General
Views : 352
( + More Social Media views ), Id : 1890 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
absence ,
drama ,
chakirevu ,
blood ,
tears ,
chintamani ,
think Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. కేసియార్, కేటీయార్ , బాబు , జగన్ , పవన్ కు చెందిన టీవీ, పత్రిక వార్తలు ఇక్కడే, ఒక చోటే చూడొచ్చు
Facebook Comments