APLatestNews.com top Banner
మాతృభాష తెలుగు - సారీ అని నవ్వుతూ వంద సార్లు, కానీ క్షమించండి అనాలి అంటే? - లోకం తీరు
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. మంచి కోరే వారికి దీనిని పంపగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
ఆంధ్రా లో తెలుగు కు ఏదో అయిపోతుంది అని ఒకరు, మీ పిల్లల ను ఆంగ్ల మీడియం లో వేసారు కదా అని ఇంకొకరు, మీ పాత జీవోలు ఆంగ్లము లో ఉన్నాయి అని ఇంకొకరు, పేద పిల్లలకు ఆంగ్లము వద్దా అని ఇంకొకరు, ఇంకా వివిధ రకాలుగా దెప్పి పొడుచుకుంటున్నారు.

మీ చావు మీరు చావండి అని, ఫోన్ లో లీనమైన వారు ఇంకొకరు. అప్పుడు అయినా ఇప్పుడు అయినా ఎవరి దోపిడీ వారిదే, మధ్యలో నష్టపోయేది డబ్బు తీసుకుని ఓటు వేసిన వారే లేదా అసలు ఓటు వేయని వారు అంటే, వారూ వీరూ ఇద్దరూ ఊరుకోరు మరి.

ఇంతకీ నా స్నేహితుల జవాబు కూడా ఆంగ్లము లోనే వస్తుంది. వారు అమలాపురములో ఉన్నా అమెరికాలో ఉన్నా ఇంకెక్కడ ఉన్నా ఆంగ్లము జవాబే. నన్ను చూసి కూడా రెండేళ్లుగా, మాతృభాష తెలుగు లో జవాబు లు లేవు. నాకూ ముందు రాదు, ఫోన్ లో ప్రయత్నము చేస్తే వచ్చింది. గూగుల్ ఇండికా తో, వెబ్ లో లేఖిని ద్వారా.

కాబట్టి నా వంతు నేనూ, మా గురువు లు కూడా, తెలుగు మరువకుండా ఉంచే ప్రయత్నం చేస్తున్నా, తెలుగు సంక్షిప్త సందేశాలు పంపుతూ. ఏ మాట చెప్పినా మాత్రుభాషలో, తొందరగా అర్ధము అవుతుంది ఎవరికైనా కూడా.

సారీ అని నవ్వుతూ వంద సార్లు అంటాము. కానీ క్షమించండి అని అనాలి అంటే, ఎక్కడో లోన ఉన్న సిగ్గుతో నరాలు చచ్చుబడతాయి. ఆ మాట రాదు తొందరగా బయటకు. అదీ అమ్మ లాంటి మాతృభాష విలువ.

తెలుగు వచ్చిన వారు సంస్కృతంలో ఉన్న వేదాన్ని బాగా చదవగలరు. తెలుగు భాష పలికినపుడు, మనలో నోటిలో నాభిలో ఎన్నో నరాల కదలిక ఉంటుంది.

కానీ వేరే భాషలో కొన్ని అక్షరాలు కూడా లేవు. తమిళంలో బద్మ అంటారు పద్మ ని. బెంగాల్ లో లేదా ఉత్తరాన , బసంత్ అంటారు వసంత్ ని.

తెలుగును కొనసాగించడానికి, మీ అందరి సహాయ సహకారాలకు ధన్యవాదాలు. రాయల వారి పద్యము గుర్తు చేసుకుందాము.

తెలుగదేల యన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ, తెలుగొకండ,
యెల్ల నృపులు గొలువ యెరుగవే బాసాడి,
దేశభాషలందు తెలుగు లెస్స.
 

Dt : 20-Nov-2019, Upd Dt : 20-Nov-2019 , Category : General
Views : 75 ( + More Social Media views ) ( id : 224 )
Tags : telugu language

గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Note : Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content