APLatestNews.com top Banner
         
30 దాటినా క పుట్టినరోజు పండుగ లా? వాస్తవం గా సాధించిన ది ఏమిటి? - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
30 దాటినా క లేదా ముడి పడ్డాక లేదా జబ్బు న పడ్డాక , ఏది ముందు జరిగితే అది , ఇంకా పుట్టినరోజు పండుగ ల తో వాస్తవం మరవకూడదు. సాధించిన ది ఏమీ లేదు, సొంత ఇంద్రియాల ను జయించనంత వరకు.

మోసంతో లేదా మోహం తో, తర తరాలకు ఎంత సంపాదించినా, దానితో పాటే పాప కర్మను కూడా, తర్వాత తరాలకు అందిస్తున్నాము. మరువద్దు, వారు అదీ పంచుకోవాలి, తప్పించుకోలేరు.

డబ్బు లేని వాడికి లేదు అని ఏడుపు, ఉన్నవాడికి చాలదూ అని ఏడుపు, ఎక్కువైన వాడికి ఎవరు కొట్టేస్తారో అని ఏడుపు.

బట్ట తల , బాన పొట్ట, అధిక బరువు, చత్వారం కళ్ళ జోడు , బీపీ , చక్కెర , కీళ్ళ నొప్పి ,వ్యామోహం, క్రోధం , దురాశ , అసూయ , అదుపు లేని నోరు నాలుక, కోతి మనసు , మతిమరుపు, ఇంటా బయట టెన్షన్ , ఎవరూ మాట వినరు , తిన్నది అరగదు, నిద్ర పట్టదు, ఇవేనా సాధించిన ది?

ఒంటరి వాడి నుంచి వంద మంది ఉన్న వారి దాకా, ఒకటే ఏడుపు, ఇంట్లో మనశ్శాంతి లేదు అని, భ్రాంతి లోనే బతుకుతున్నాము అని.

దేనికో త్వర త్వరగా దగ్గర అవుతున్నాము, అన్న గుండె లోతు ల్లోన భయంతో భీతి తో, నవ్వ లేక, ఏడ్వ లేక, తికమక అయోమయం.

ఇప్పుడు అయినా , మదిలో మనసుతో భగవన్నామ స్మరణ సాధన చేసి మనశ్శాంతి పొందకపోతే, అంతా నిష్ప్రయోజనం.

వాస్తవం ఏమైనా ఉందేమో ఆలోచన చెయ్యి మిత్రమా. గతం మార్చలేమూ, ఏమీ చేయలేము, రేపు మనది కాదు , ఇప్పుడే గత జ్ఞాపకాలతో మార్పు చేసుకో.

Dt : 02-May-2019, Upd Dt : 02-May-2019 , Category : General, Views : 125 ( id : 96 )
Tags : birth day party , after 30 , achievements
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments