APLatestNews.com top Banner
         
నా కొడుకు, తన బిడ్డను పెంచమని అడుగుతున్నారు, ఏమని చెప్పమంటారు - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
ఇలాంటి వి అడగకూడదు బయటవాళ్ళని. బాధ్యత గల తల్లి దండ్రులు కష్టాలతోనే, పిల్లలను పెంచుతారు. మొహము లో ఉన్న వాళ్ళకి ఇవి ఈ జవాబులు రుచించవు, భవిష్యత్ సమస్యలు ఆలోచించరు. కొడుకు అయినా కూతురు అయినా అర్థం పరమార్థం ఒకటే. వివరంగా చెపుతా , తుది నిర్ణయం నీదే.

1. కడుపున పుట్టిన బిడ్డ నే పెంచలేమన్న పిల్లలు ను కన్నాము అని అంగీకరిస్తున్నారా? మన పెంపకంలో లోపం అర్థం అయిందా? కారణాలు ఏమైనా, బాధ్యత వారిదే కదా?

2. మన భవిష్యత్ అర్థం అవుతుందా? నేడు సొంత బిడ్డను చూడని పిల్లలు, రేపు కన్న తల్లి దండ్రులు ను చూస్తారా? రేపు ఆశ్రమం కి లేదా అనాధలు గా మనం సిద్ధంగా ఉన్నారా?

3. 20 ఏళ్ళు మన దగ్గర పెరిగిన పిల్లలే, మన మాట వినరు. మన మనుమలు మన దగ్గర పెరిగిన తర్వాత, వారి తల్లిదండ్రులు మాట వింటారా ఎదిగాక? వారి బంధాన్ని తెంచిన వాళ్లు, మనము కామా?

4. అన్ని బాధ్యత లు తీరాక అన్నా, సమాజ సేవ చేస్తూ, క్రృష్ణా , రామా అని ధ్యానం తో మోక్షం పొందమా? రేపు శరీరం/అవయవాలు కదలనప్పుడు , వీరంతా మన వెంట ఉంటారా? మనసు నిలుస్తుందా దేవుని మీద?

వీటికి జవాబులు నీ మనసులో అనుకొని, ఏది మంచో అది చేసుకో.

అర్థం అయింది, నా బిడ్డలు నుంచి వారి బిడ్డలు ను, దూరం చేయాలా నేనూ , ఆ పాపం నా కేనా. రేపు నా కొడుకే, నేను బిడ్డను పెంచలేకపొతేనే గదా మీకు ఇచ్చింది, ఇప్పుడు మిమ్మల్ని నేనెలా చూడగలను అంటాడు, అనుమానం లేదు.

Dt : 27-Apr-2019, Upd Dt : 27-Apr-2019 , Category : General, Views : 74 ( id : 94 )
Tags : grand son , son , responsibility
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments