APLatestNews.com top Banner
         
రామాయణ కాలానికి ఇప్పుడు కాలానికి ఎంతో ఎదిగామా టెక్నాలజీలో ? - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
రామాయణ కాలం లో ధర్మం నాలుగు పాదాల నడచింది. రామాయణం జరిగింది అంటానికి ఎన్నో ఆధారాలు దొరికాయి కూడా. ఎన్నో అస్త్రాలు శస్త్రాలు, మంత్రాలు, మాయలు. 30 ఏళ్ళ క్రితం మన తాత ను చేతిలో టీవీ చూడాలి ఎలా అని అడిగితే, నవ్వుకునే వారు. మరి ఇప్పుడో, సెల్ లో చూస్తున్నాము. ఇప్పుడు మనకు తెలీదు అంటే, లేదని కాదు కదా.

టెక్నాలజీలో కొన్ని పోలికలు చూద్దాము.

నాడు : తలచుకున్న వెంటనే ప్రత్యక్షమయ్యే మునులు
నేడు : ఇంకా రాలేదు

నాడు : పండు అనుకొని సూర్యుడినే మింగటానికి వెళ్ళారు(ఆంజనేయుడు)
నేడు : ఇంకా రాలేదు

నాడు : పది తలకాయలు. చంపినా మరలా బతకడం. ఆయువు నాభిలో మాత్రమే ఉండటం.(రావణ బ్రహ్మ )
నేడు : ఇంకా రాలేదు

నాడు : ఎదుటి వ్యక్తి బలం లో సగం బలం హరించే శక్తి(బలశాలి వాలి)
నేడు : ఇంకా రాలేదు

నాడు : చేతితో భూమితో సహా పెకలించి మనిషిని ఎత్తుకొని గాలిలో ఎగిరి పోయె బలం(రావణ బ్రహ్మ )
నేడు : ఇంకా రాలేదు

నాడు : భుజాల మీద ఇద్దరు వ్యక్తులతో వాయు మార్గం లో ఇల్లు చేరడం(ఆంజనేయుడు)
నేడు : ఇంకా రాలేదు

నాడు : మూలికల కోసం కొండ మొత్తాన్ని చేతితో ఎత్తుకొని రావడం(ఆంజనేయుడు)
నేడు : ఇంకా రాలేదు

నాడు : చిరంజీవిగా ఇప్పటికీ హిమాలయాలలో బతికి ఉండటం(ఆంజనేయుడు)
నేడు : ఇంకా రాలేదు

నాడు : వీలైతే ఈగ గా, కావాలంటే కొండంత ఎత్తు మారే సిద్దులు (ఆంజనేయుడు)
నేడు : ఇంకా రాలేదు

నాడు : సప్త సముద్రాలలో సంధ్యావందనం చేసే వ్యక్తి. అంతే కాదు, రావణుడి లాంటి వాడిని కూడా బంధించి తనతో సప్త సముద్రాలలో మునకేసే బలం.(బలశాలి వాలి)
నేడు : ఇంకా రాలేదు.

నాడు : రామసేతు,రాళ్ళతో సముద్రం మీద వంతెన, ఇనుము సిమెంట్ లేకుండా, 1000 యేళ్ళు పైగా చెక్కు చెదరదు
నేడు : ఇంకా రాలేదు. ఇనుము తో కట్టినా 100 యేళ్ళు కు మించి నిలవదు.

నాడు : మంత్రించిన పాయసం నాలుగు భాగాలు తాగితే నలుగురు పిల్లలతో ముగ్గురుకు గర్భం(కౌసల్య, సుమిత్ర, కైకేయి)
నేడు : ఇంకా రాలేదు

నాడు : ఎగిరి దూకి గాలిలో సముద్రాన్ని దాటి లంకను చేరడం(ఆంజనేయుడు)
నేడు : ఇంకా రాలేదు

నాడు : ఎదురుగా ఉన్న సైన్యాన్ని సర్వ నాశనం చేసే మారణాయుధం ఒక వీపున ధరించే చిన్న బాణం(శ్రీరాముని చేతిలో రామ బాణం, బ్రహ్మాస్త్రం, మిగిలిన అస్త్రాలు, . . .)
నేడు : ఇంకా రాలేదు. మిస్సైళ్ళు 1000 టన్నుల పైగా బరువు ఉండి, రెండో సారి పనికి రావు.

నాడు : ఒక చిన్న బాణం తో భీభత్సమైన వర్షం, నిప్పులు, పెను గాలి, మత్తు, పుష్ప వర్షం, స్రుష్టించవచ్చు
నేడు : ఇంకా రాలేదు

నాడు : ఒక చిన్న బాణం శత్రువుని ఎంత దూరమైనా వెంటాడి నాశనం చేసి వెనక్కి వస్తుంది
నేడు : ఇంకా రాలేదు

నాడు : పుష్పక విమానం, ఎంత మంది ఎక్కినా ఇంకొకరికి చోటు ఉంటుంది
నేడు : ఇంకా రాలేదు

నాడు : నిప్పులలో దూకిన వ్యక్తి చెక్కు చెదరకుండా, నవ్వుతూ బయటకు రావడం, ఎటువంటి రసాయనాలు ప్రత్యేక దుస్తులు లేకుండా(సీతమ్మ తల్లి)
నేడు : ఇంకా రాలేదు

నాడు : సంకల్పం తోనే త్రిశంఖు స్వర్గాన్ని నిర్మించారు(విశ్వామిత్రుడు) ఆకాశంలో శూన్యం లో. బొందితోనే అక్కడకు మనిషిని పంపారు ఎటువంటి వాహనము లేకుండా.స్వర్గం అంటే, సకల సదుపాయాలు ఉండి, పాటలు ఆటలతో సరదాగా సాగేది.
నేడు : ఇంకా, రాలేదు. స్పేస్ స్టేషన్ ఉంది ఎంతో ఖర్చుతో, కాని అన్ని భూమి నుండి తీసుకెళ్ళాలి. బిక్కు బిక్కు మంటూ బతకాలి, ఎప్పుడు ఏమౌతుందో తెలీదు.

ఇలాంటివి చిత్ర విచిత్రాలు ఎన్నో ఇంకా ఎన్నో, రామాయణాన్ని చదివి అర్ధం చేసుకుంటే. శాస్త్రవేత్తలకు ఇలా సాధ్యమవుతుందేమో అని ప్రయత్నాలు చేయటానికి ఎన్నో మార్గాలు.

Dt : 15-Apr-2019, Upd Dt : 15-Apr-2019 , Category : Devotional, Views : 178 ( id : 91 )
Tags : sri rama
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 7 yrs
No Ads or Spam, free Content