APLatestNews.com top Banner
         
మాయలో మోహాంలో బడటానికి చిన్న ఉదాహరణ - లోకం తీరు(Loakam Teeru)
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
            
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
మాయలో మోహాంలో బడటానికి చిన్న ఉదాహరణ. తెలిసిన వారు పెద్దలు ఒకరు, ముత్యాలు(తల్లి దండ్రులను వదిలేసిన పిల్లలు ఎవరైనా) కన్న తల్లి కి ద్రోహం చేసారు, చాలా పెద్ద తప్పు అని అందరితో అన్నారు. దేవుడు ముందు ముందు చూపిస్తారు, వాళ్ళకు ఫలితము అన్నారు.

తర్వాత పెద్దల ఇంట్లో సందడి కార్యక్రమం వచ్చింది, ముత్యాల ఇల్లు, వసతులు అడిగి మరీ వాడుకున్నారు చుట్టాలకోసం. ఖర్చు తో లేదా లేకుండా వాడుకుందామని, నీతి తప్పి, తాము తప్పు అన్న వాళ్ళ సహాయము తీసుకున్నారు, ఆశతో మోహము తో.

ఇప్పుడు పెద్దల ముందు మాటలకు, తర్వాత చేష్టలకు అర్థం ఏమిటి. ముత్యాల పాపం లో మాకూ భాగం కావాలని మనసారా తీసుకున్నారు, అంటే తర్వాత మనశ్శాంతి కోల్పోయారు‌ , కోల్పోతారు. 2 వేలకు కక్కుర్తి పడితే, తర్వాత 20 వేలు వదిలింది మానసిక వేదనతో పాటు, బాధతో పాటు గా . అదే మోహం, మాయ.

ఇలాంటి సంఘటనలు, మనుషులు మనస్తత్వాలు అన్ని ఇళ్ళలో ఉంటాయి. ఈ రోజులలో ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు అనుకుంటూనే అంతకన్న ఎక్కువ నష్టపొతాము. తర్వాత విచారించి లాభము లేదు.

అలాగే పాపాత్ములు మన ఇంటికి వచ్చినా లేదా వారింటికి మనము వెళ్ళినా, ఏదైనా ఇచ్చినా/తినమన్నా, కలవడమే భాగ్యం ఇంక ఏమీ వద్దు అనాలి , లేదంటే వారి పాపం లో భాగం కూడా అందుతుంది మనకు. ఉదాహరణ కర్ణుడు, దుర్యోధనుడు.

మంచి వాళ్లు ఇస్తే రూపాయి అయినా, వద్దు అనకూడదు, ఎందుకంటే మన పాప పరిహారం కు వారి శక్తి నిలుస్తుంది. వద్దు అంటే, ఇంకా పాపము మనకు వస్తుంది. ఉదాహరణ కుచేలుడు, క్రిష్ణయ్య.

ఎవరు మంచి, ఎవరు చెడు అని తెలుసుకొనే ఇంగిత జ్ఞానం మనకు దేవుడు ఇచ్చారు.

ధర్మాన్ని కాపాడు , అది నిన్ను కాపాడుతుంది. నోటితో నటించి, నొసటితే వెక్కిరిస్తే ధర్మం ని, అదే నిన్ను నేలపై నడిపిస్తుంది అంతకు రెట్టింపు నష్టము అవమానముతో.

Dt : 12-Jan-2019, Upd Dt : 22-Feb-2019 , Category : Devotional, Views : 99 ( id : 34 )
Tags : maya , moham

Facebook Comments