APLatestNews.com top Banner
         
కృష్ణ ద్రోణాచార్య సంవాదం - తండ్రి ప్రేమ, మోహం మరియు గురువు బాధ్యత గురించి - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
మహాభారతం లో కృష్ణ భగవానుని మరియు ద్రోణాచార్యుని సంభాషణ వినండి వీడియోలో. కొన్ని ముఖ్యమైన మాటలు ఇక్కడ చదవండి. ఈ రోజులలో కూడా తల్లి దండ్రులు, తెలుసుకోవాల్సిన సూక్ష్మాలు చాలా ఉన్నాయి ఇందులో. లేకపోతే చివరలో ద్రోణుడి లా, అధర్మంతో తండ్రి బిడ్డలు పతనం పొందాలేమో, జాగ్రత్త సుమా.

తండ్రి గా ఏమి ఇచ్చారు - సంస్కారాన్ని ఇచ్చారా? విద్యను ఇచ్చారా? ధర్మం గురించి జ్ఞానం ఇచ్చారా? ఏ రక్షణా లేకుండా, జీవించగలిగేది ఏమీ ఇవ్వలేదు.

మీ పుత్రునికి సముచిత నిర్ణయం తీసుకునే విజ్ఞత ని ఇచ్చారా?

ప్రేమ అనేది మీకు ఉంటే ఇలా అధర్మానికి బందీలు కారు, మీ పుత్రుడు కూడా అధర్మానికి దూరంగా ఉండేవారు.

వాస్తవానికి, ఇది ప్రేమ కాదు, మీ మన్సులో ఉండే మోహం. ఆ రెండిటికి ఉన్న భేదం ఏమిటి అని ఎప్పుడైనా ఆలోచన చేసారా?

ప్రేమ నుండే మోహం జనిస్తుంది కదా వాసుదేవా?

కాదు వాస్తవానికి, ప్రేమ ఉన్న చోట మోహానికి తావే ఉండదు.

ప్రేమ జనించేది కరుణ నుండే గురుదేవా. కానీ మోహం జనించేది అహంకారం నుండి.

ప్రేమ అంటుంది, నా పుత్రునికి ఈస్వరుడు ఈ లోకం లో ఉన్న అన్ని సుఖాలు ఇస్తాడు అని. కానీ, మొహం అంటుంది, నెను నా పుత్రునికి ఈ లోకం లో అన్ని సుఖాలు ఇస్తాను అని.

ప్రేమ అంటుంది, నా పుత్రుడు అంటే నాకెంతో గర్వం అని. మొహం అంటుంది, నా పుత్రుడు నన్ను చూసి గర్వ పడాలి అని.

ప్రేమ ముక్తిని ఇస్తుంది గురుదేవా. మోహం బంధిస్తుంది. ప్రేమ ధర్మం గురుదేవా, కానీ మోహం అధర్మం.

మీరు మీ పుత్రుడు గంజి నీరు తాగడం చూసి మీ సాధనను భంగం చేసుకునే వారు. దానికి మారుగా, గంజి నీటితో సంత్రుప్తి పడటం నేర్పిన, వానికి ఏదైన సంపాదించే శిక్షణ ఇచ్చి ఉంటే, ఈ రోజు మీ పరిస్తితి భిన్నం(అంటే మంచిగా) గా ఉండేది. కాదంటారా?

మీ పుత్రుని భవిష్యత్తు ను ఉజ్వలంగా నిర్మించే ప్రయత్నంలో, మీరు వాని చరిత్రను ఉజ్వలంగా నిర్మించడం విస్మరించారు.

మీ మొహం కారణం గా, వాని జీవితం లో ధర్మం నశించింది.

లోభం, భయం, దురాశల శిక్షణను ఇచ్చారు మీరు మీ పుత్రునికి. ఆ మోహం కారణంగా ఎప్పుడు గురువుగా భాసిల్ల లేకపొయారు. కేవలం ఒక శిక్షకునిగా మిగిలిపొయారు.

అలా ఎందుకు అంటున్నారు వాసుదేవా, నీను అందరు శిష్యులకు సంపూర్ణ నిష్టతో ఉత్తమ శిక్షణ ఇచ్చాను.

గురువు అనేవారు ఎప్పుడు విద్యను దానంగా ఇస్తారు, విద్యను వ్యాపారం గా చేయరు. కనుకనే దక్షిణ ఆసిస్తుంటారు, మూల్యాన్ని కాదు. కానీ మీరు మీ జ్ఞానానికి మూల్యాన్ని నిర్ణయించారు.

ప్రతిఫలంగా, శిష్యులను ప్రతీకారానికి ఉపయోగించారు. దాని వలన మీ జీవితాన్ని విషపూరితం చేసుకోవడమే గాక, మీ శిష్యుల జీవితాలను విషతుల్యం చేసారు. ఈ పరిణామం, కేవలం మీ మొహం మరియు అహంకారం వలననే సంభవించింది.

మీరు గురువు కానే కాదు, ద్రోణాచార్యా. ఇప్పుడైనా, తెలుసుకొని, ధర్మాన్ని ఆశ్రయించండి. ఇంకా మీకు సమయం ఉంది. ఉచితమైన నిర్ణయం తీసుకోండి. మోహాన్ని వెంటనే త్యజించండి.

మిమ్మల్ని ఈ క్షణమే వధించగలను, కానీ నా ఇచ్చ, మీకు ఇంకో అవకాశం ఇవ్వాలని.

నిజం చెప్పారు, నా పుత్రుడు ఇలా అవ్వడానికి కారణం నేనే, ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఇప్పుడు నాకు కూడా శిక్ష లభించాలి.


Dt : 22-May-2019, Upd Dt : 22-May-2019 , Category : Devotional, Views : 109 ( id : 119 )
Tags : Sri Krishna , dronacharya , kurukshetram
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

All best news at one place for NRIs
Multiple source NEWS from 6 yrs
No Ads or Spam, free Content