APLatestNews.com top Banner
         
అద్దె మాకు చెత్త మీకు - ఉత్తమ పక్క ఇంటి ఓనరు అవార్డు మనకే - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
మా ఇంట్లో అద్దెకు ఉండు. డబ్బు మాకు ఇవ్వు. కాగితాలు చెత్త పక్కన ఇంట్లో వెయ్యి. పక్క ఇంటెదురు లేదా ఇంకో వైపు చెత్త కాగితాలు ఉండవు. కానీ మన ఈ సందులో మాత్రం సునామీ గాలి వాన వచ్చి , చెత్త కాగితాలు కవర్లు వచ్చింది అందాం. మాకేం తెలుసు అందాం.

బట్టలు ఇటు ఉతుకు, పక్క వాళ్ళ గోడ మీద ఆరవెయ్యి. పక్క గోడ వెంట తోముకో కడుక్కో , పక్క గోడ మీద సబ్బులు వస్తువులు పెట్టుకో.

మా కొట్టు కు అద్దె కట్టు, పక్కింటి ఎదురు బండ్లు పెట్టు. టీ కప్పు లు, చెత్త, పక్క ఇంటి ఎదురు వెయ్యి. డబ్బు మాత్రమే మాకు ముఖ్యం, అద్దె వారి కి ఎటువంటి జాగ్రత్తలు చెప్పం. ఎందుకంటే మా ఇంటితో పాటూ, పక్క స్తలం వాడుకోటానికి ఉచితం.

మా కొడుకైనా అల్లుడైనా ఇంటికి వస్తే, పక్కన ఇంటి ఎదురు మాత్రమే కారు పెట్టాలి. అలాగే మా ఇంట్లో అద్దెకు, ఉండే వాళ్ళ కోసం, ఎవరు వచ్చినా అంతే.

మా వేప చెట్టు మా ఇంటికి నీడ ను ఇవ్వాలి , పక్కన ఇంటికి ఆకులను ఎత్తే భాగ్యం ఇవ్వాలి. వారి ఇబ్బందితో, మనకు పని ఏమి.

మన ఇంట్లో సిమెంటు పనికి, పక్కింటెదురు మట్టి పోయించు. ఎన్ని వారాలు అయినా, తెలీక వేసారు అని, పని కొనసాగించు.

అర్ధరాత్రి అయినా, ఠంగు ఠంగు మని గుంటలు తీయి, పక్క వారి నిద్రతో మనకేమి లే పని.

మా ఇంటికి రంగులైతే, అడగకుండా అటువెళ్ళి వేసి వస్తాం, చుక్కలతో మరకలతో. పక్కవారు అడిగి, రంగు వేసుకుంటాం అంటే మాత్రం, చుక్కాలు పడతాయని వద్దు అంటాం.

బయట వాళ్ళు అడిగితే వాళ్ళు మా చుట్టాలు అందాము. మరి చిమ్మరే బయట అంటే, మాకేం పని అంటాము.

వీలైతే చాడీలు చెప్పారు అనో లేదా ఇంకోటో కావాలని కలిపించుకొని, కొడుకుతో మనవడితో కలసి పరుగెత్తి, పక్కవాళ్ళను లేదా చెప్పిన వాళ్ళను అరుద్దాం.

కెమెరా ఉంటే నే ఇంత ఘోరం చేస్తున్నాము, లేకపోతే మరెన్నో విచిత్రాలు తట్టుకోలేరు. పది యేళ్ళు గా మాట చెపితే మారామా, ఇంక మారతామా అన్న ఆశ ఉంటే, మీ ఖర్మ!

ఎప్పుడూ పక్కన ఇంటి వాళ్ల స్థలం ను, సాధ్యమైనంత వాడుకోవాలి. ఉత్తమ పక్క ఇంటి ఓనరు, అవార్డు మనకే ఖాయం కావాలి.

అందరూ నేర్చుకోండి, పక్క ఇల్లు సొంత ఇల్లు లాగ వాడుకోండి. అద్దె మాకు, చెత్త మీకు, పధకం భేషుగ్గా అమలు చెయ్యండి.

ఇప్పుడు చెప్పండి, ఏదో ఊరక ఉంది, అని పక్క స్తలం గోడ వాడటం తప్పా? అన్యాయమా? ఎందుకండి, మా మీది చాడీలు చెపుతారు, మేము తప్పుడు వాళ్ళమా? మేము చేసిన తప్పు, ఒక్కటి చెప్పండి. అందరూ చేసేదే మేమూ చేస్తున్నాము. మా మంచితనమే, మా తర్వాత తరాలకు ఆదర్శం.

Dt : 19-May-2019, Upd Dt : 19-May-2019 , Category : General, Views : 102 ( id : 113 )
Tags : nasty neighbor
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

All best news at one place for NRIs
Multiple source NEWS from 6 yrs
No Ads or Spam, free Content