APLatestNews.com top Banner
         
మాత్రృదినం - విత్తు ఒకటేస్తే చెట్టు వేరొకటి వస్తుందా అని అనే నేటి తరం - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
మాత్రృదినం, పాశ్చాత్య దేశాల్లో పాటిస్తారు, ఎందుకంటే 20 ఏళ్ల లోపే, సొంత కాళ్ల మీద నిలబడి, తమ ఖర్చులు తాము సంపాదించుకుంటారు, పేరెంట్స్ కు దూరంగా ఉండి. కార్లు తుడిచో , కడిగో , లీగల్ గా చేయగలిగి నవి మాత్రమే చేస్తారు. పేరెంట్స్ కూడా ప్రోత్సాహం ఇస్తారు , కష్టం సుఖం లోకం తెలియాలి అని. ఆస్తుల కోసం, అర్రులు చాచరు.

మరి మనం, 35 దాకా కూడా పేరెంట్స్ మీద, పడి బతుకుతాం. చదువు, వ్యాపారం అన్ని వాళ్ళ డబ్బు, చెమటే. ఎప్పుడూ వాళ్ళ దగ్గర లోనే ఉంటాం. మాట్లాడటం ఇష్టం లేకపోయినా, నెలసరి ఖర్చు కోసం ఫోన్ చేసే అవకాశవాదులం.

మరి మనకు ఈ దినం తో పని ఉందా? అబ్బా, ఆశ దోశా అప్పడం, పని ఉంది!

కొంతమంది కి ఉంటుంది. ఉద్యోగం వచ్చాక లేదా భార్య/భర్త వైపు బరువు వచ్చాక, తీరిక లేని, గతం మరచిన, భూమి బిడ్డలు కు. కొంతమంది అసలు మాకు తల్లి దండ్రులు లేరు అంటారు, బతికి ఉన్నా కూడా.

ఏరు దాటాక తెప్ప తగలేయండం కదా, అని మనం అంటే , విత్తు ఒకటేస్తే చెట్టు వేరొకటి వస్తుందా, అని అనే నేటి తరం.

అమ్మమ్మ తాతలకు, అంత కన్నా మీరు చేసింది ఏమిటీ, అని తిప్పి అడిగితే వాళ్లు? 5 వ తరగతి హస్టల్ లో , ఎందుకు అంటే? మీ ఇద్దరే తిట్టుకుంటూ , తన్నుకుంటూ, దూరంగా ఎందుకు ఉన్నారు అంటే?

పిల్లల చైతన్యం కి తెలివి తేటలకి నవ్వాలో , మన గత ఖర్మ ఫలితం కు ఏడవాలో , తెలియని పరిస్థితి లో మనం.

Dt : 11-May-2019, Upd Dt : 11-May-2019 , Category : General, Views : 53 ( id : 111 )
Tags : mothers day , amma runam
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments