APLatestNews.com top Banner
         
వడ్డీ లు చీటీలు బినామీలు, గురు శిష్యులు సంవాదం 3 వ భాగం - లోకం తీరు
OurTripVideos - Visiting Places/Local Events Pictures and Videos. We visit, We record, We present, You Enjoy!
           
     
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. నచ్చితే షేర్ చేయగలరు.
అవును, గురువు గారు, మోడీ నోటు రద్దు వలన, నల్ల వ్యాపారులు తో పాటు, జనం ఇబ్బంది పడ్డారు గదా. మోడీ ది తప్పు కాదా?

మోడీ తో నల్ల ధన దొంగ వ్యాపారులకు నాయకులకు అసలు కష్టం వచ్చింది, సామాన్యులకు అది వరం. నాయనా పేపర్ చదవావా లేక అర్థం చేసుకోవా. డబ్బు బ్యాంకు కు పంపేది రిజర్వుబాంక్, అందుకునేది బ్రాంచి ఆఫీసు లు, మన ఊరి బాంకు లు. పలుకుబడి తో వ్యాపారులు, నాయకులు, దొడ్డిదారిన బాంకు నుంచి, అంతా తెచ్చుకుంటే, సామాన్య జనం రోడ్డు మీద కష్టాలు పడుతున్నారు.

తర తరాల కుటుంబ పాలనలో, చిల్లర తో పాటు మజ్జిగ కు అమ్ముడు పోయిన మనం , కళ్ళు తెరిచి చూడం ప్రశ్నించము. దానికి బాధ్యత వహించాలసింది ఆ రాష్ట్ర జిల్లా పట్టణ జనం , అధికారులు, వ్యాపారులు, నాయకులు.

ఎక్కడో విన్నా, బాంకు అధికారులు ను కూడా సస్పెండ్ చేశారు, పోలీసులు పట్టుకున్నాక. అలా దొరకని వి, బయటకు రానివి ఎన్నో. అయ్యో, ఇంత కధ ఉందా వెనకాల.


గురువు గారు , మొన్న మా ఊళ్ళో ఒకాయన ను పోలీసులు పట్టుకుని ఇంట్లో బాంక్ లో ఎంత వెతికినా , ఏమీ దొరకలేదు అన్నారు.

నాయనా, అమ్ముడు పోయి ఓటు వేసిన తర్వాత, భరించాలి గానీ ఇలా అడగకూడదు బాధపడకూడదు. అందరికీ తెలుసు , ఆస్తులు డబ్బు బినామీ పేర్లు తో ఉంటాయి అని వ్యాపారులు కు , నాయకులు కు.


స్వామి బినామీ ల కు నష్టం ఉండదా?

దొరకనంత వరకూ అందరూ దొరలే. బినామీ అంటే కోడి పిల్ల లాంటి మనిషి. దానికి, జీడిపప్పు బాదం పప్పు, అన్ని వేసి పెంచుతాము. అదేమనుకుంటుంది, యజమాని కి నా మీద ప్రేమ అనుకుంటుంది. తర్వాత అవసరం తీరాక, ఏరోజు కూర అవుతుందో తెలుసా?

అలాగే రేపు నాయకులు, వ్యాపారులు, జైలుకు పోకుండా లేదా పేపర్లో పడకుండా , బినామీ ల నే, నయానో భయానో ఇరికిస్తారు, పబ్లిక్ కోసం మరియు లెక్క కోసం. అలాగే బినామీ లు ఎదురు తిరిగి, అప్రూవర్ గా మారి, వారి పై వారిని కూడా ఇరికిస్తారు. ఇద్దరూ కూ ప్రాణ గండమే. రోజూ ఇవే వార్తలు కదా.

పాత సినిమాలో చూడలేదు, నాగభూషణం రావు గోపాలరావు తో పాటూ తిరిగి, పాపం పంచుకున్న వారి బతుకు, చివరలో ఏమోతుందో? మట్టి బూడిద మాత్రమే నాయనా, ప్రాణం గారంటీ లేదు.

చెడు, బంగారం లాంటిది ఆకర్షణ శక్తి ఉంటుంది, చాలా ప్రమాదం.

మంచి, రాగి వంటది , విలువ తక్కువ అయినా, ఆరోగ్యం, ఎటువంటి ప్రాణ హని , రోడ్డు మీద పడటం, శాపనార్థాలు , జైలు జీవితం ఉండదు.

ఏది మంచో అది చేసుకో , ఫలితాలు మాత్రం ఖాయం, ఈ జన్మలో లేదా వచ్చే జన్మలో పిల్లల తో సహా.

Dt : 03-May-2019, Upd Dt : 03-May-2019 , Category : General, Views : 87 ( id : 100 )
Tags : interest , cheetee , binaamee , guru , sishya
గమనిక : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు.

Facebook Comments