హీరో హీరోయిన్లు, రాజకీయాలు, సంఘం, పార్టీ, ఆటల, వ్యామోహాల గురించి, ఎన్నో లైక్ కామెంట్ లు షేర్ - General - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2095 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2130 General Articles and views 1,956,659; 104 తత్వాలు (Tatvaalu) and views 231,097.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
1 min read time.

హీరో, హీరోయిన్లు, రాజకీయాలు, ప్రభుత్వ, ప్రవేటు, సంఘం, పార్టీ, ఆటల, వ్యామోహాల గురించి, ఎన్నో లైక్ లు కామెంట్ లు పెట్టాము షేర్ చేసాము

hero, heroines, politics, govt, community, party, games, obsessions, shared, liked comments

ప్రశ్న - *ఏవండీ, మేము మీ సోషల్ మీడియాలో కూడా, మీ శనివారం పోస్ట్ లు అలాగే మిగతావి చూస్తాము. కనీసం 300 దాకా ఉన్న మేము, అవి ఆరోగ్యం మనశ్శాంతి, తేలిక ఆచరణలో సాధన, ముదుసలి తల్లి సేవ అని తెలిసి కూడా, మాకు భవిష్యత్ లో అవి అవసరం అని తెలిసి, మాలో ఒక్కరు కూడా, వాటికి అహంకారంతో లైక్ కొట్టలేక, మానసిక స్పందన అణిచివేసి, ముసుకుపోయిన ముర్ఖత్వం తో 10 మందికి షేర్ చేయలేకపోతున్నాము.*

We are on your social media too, see your Saturday posts and other stuff. There are at least 300 of us, even though we know that they are about health, peace of mind, easy practice, service to old parents, also knowing that we will need them in the future, even one of us not able to like/ comment them with proud, and not sharing it with 10 people with stupidity. Suppressing the emotional response.

*కానీ హీరో, హీరోయిన్లు, రాజకీయాలు, ప్రభుత్వ, ప్రవేటు, సంఘం, పార్టీ, ఆటల, వ్యామోహాల గురించి, ఎన్నో లైక్ లు కామెంట్ లు పెట్టాము షేర్ చేసాము. ప్రాపంచిక విషయాల మీద ఉన్న ద్యాస, మానసిక బలం గుణం మీద లేదు. మా వరకు ఇది ఆత్మ ద్రోహం గా ఉంది. కానీ మా చూట్టు ఉండే గ్రూప్ లు స్నేహితులు ఎగతాళి చేస్తారేమో అని వెనకాడుతున్నాము.*

But about hero, heroines, politics, government, private sector, community, party, games, obsessions, we have shared, many likes and comments. Interest on worldly things but not on mental strength, guna. As far as we are concerned this is treason. But we are afraid that our friends will make fun of the groups where we are.

*మాలాంటి వారు చాలా మంది ఉన్నారు, మా చుట్టూ ఉన్న ప్రాపంచిక మోహ వర్గం/ పరిస్తితి/ సమూహం బట్టి ఇలా తయారు అయ్యాము. కాని దీని ఫలితం మేము చివరలో ముదుసలి తనములో అనుభవించాలి. ఎందుకంటే ధర్మం ని కాపాడాలి/ సమర్ధించాలి/ ప్రచారం చేయాలి/ ప్రోత్సాహం చెయ్యాలి అన్న దానిని విడిచేసాము. చుట్టూ ఉన్నవారు ఏదైనా అంటారు ఎగతాళి చేస్తారు అన్న, ఆ భయం పోయే మార్గం చెప్పండి. మీరు మానసిక నిపుణులు గా కూడా ఒక్కోసారి బాగా వివరిస్తున్నారు.*

There are many like us, made like this by the worldly class/ situation/ group around us. But we have to experience the result at the end in old age. Because we have left that, dharma should be protected/ supported/ promoted/ encouraged. We have fear that, people around say something and make fun. Please tell us the way to get rid of that fear. Even as a psychologist you explain well at times.

జవాబు - మనల్ని మనం తెలుసుకోవాలి అన్న ప్రస్తానములో, ఇది మొదటి మెట్టు. మీ ఆత్మ చెప్పినట్లు వినాలి, కోతి మనసును జాగ్రత్త గా గమనించాలి. సోషల్ మీడియాలో, మనకు 10 వేల మంది పైన ఉన్నారు, వేరు వేరు పేజీలలో.

కాని మానసిక పెంపక స్పందన లేనిదే, వారిలో దైవత్వం జాగ్రుతి కాదు, నష్టం వారికి, వారి కుటుంబానికే. మన శని వారం సాధన నియమాలు, మనసును నియంత్రించడానికే మీకు పంపేది, అందరితో పంచుకునేది. సాధన మొదలు పెడితే, మీరు బాగా మానసిక బలవంతులు అవుతారు, అప్పుడు మానసిక స్పందన ఉంటుంది, ఆధ్యాత్మిక ప్రచోదనం వికసిస్తుంది.

మీ మనసు అంటే 80 శాతం మందికి, ఏమి చెపుతుంది అంటే, మంచిని ప్రచారం చేయకు, ప్రొత్సాహం చేయకు, వినకు ఆచరించకు, 4 గురి ఎదురు మొహమాటానికి నటించు, అని లైక్ షేర్ ఫార్వార్డ్ అంటే, ఈ కధనం లేదా సాధన బాగుంది, మేము మా పిల్లలు ఇలా రాయాలి చెయ్యాలి చేస్తున్నాము చెప్పాలి పంపాలి, అన్న మాటలను గుండె లోతుల్లో నుంచి, అనవద్దు స్పందించవద్దు అని మనసు ఆపుతుంది.

మనము ఏది మనసులో, తలిస్తే, అదే మనకు చివరకు దేవుని నుంచి వస్తుంది. అందుకే ముదుసలి ఒంటరి బ్రతుకులు, రోగాలతో పరుగులు, అనాధాశ్రమాలు, అందరూ ఉండి, కోట్లు ఉండి, జీవితం వ్రుధా చేసుకుని ప్రాపంచిక వ్యామోహములో.

అంటే మనకు మానసిక నియంత్రణ లేదు. నరాలు, వేళ్ళు, పెదాలు, నాలుక, మనసు, మంచికి స్పందించక చచ్చుబడతాయి. ఏది మంచో, ఏది చెడో, మన మనసుకు అర్ధం కాదు.

మందు తాగడం, పదిమంది తో తిరగడం, పోసుకోలు మాటలతో, సినిమా టీవీ ఓటీటీ సోషల్ మీడియా చెత్త ల తో, మనసును బ్రమలలో ఉంచుతాము. ఇంటి పెద్దగా మనమే ఇలా ఉంటే, ఇక మన ఇంట్లో వారు అంత కన్నా ఎక్కువ బ్రమలలో ఉంటారు, వారూ మంచి స్వీకరించరు ఆస్వాదించరు.

తల్లి దండ్రుల ఫోటోలు పెట్టుకోవాలంటే నామోషి, కానీ సినిమా రాజకీయ నాయకుల ఫోటోలు మాత్రం, ప్రాణపదం గా సోషల్ మీడియాలో పెట్టుకుంటారు. ఎందుకంటే, మనము వేసిన విత్తనం అదే - మంచి వినకు, ప్రోత్సహించకు, ఆచరించకు.

ఒకటి, మనకు సంస్కార పెంపకం లేదు. రెండు, మన చుట్టూ ఉన్న సమాజం మానసిక అధోగతి పరిస్తితి. రేపు మన పిల్లలు మనల్ని, ముదుసలి తనము లో ఒంటరిగా లేదా అనాధాశ్రమములో పడేసినా, మనకు ఈ సమాజం అండగా వచ్చి, మన పిల్లలకు బుద్ది చెపుతుందా? అనారోగ్యముతో మానసిక బలహీనులైతే, ఈ సమాజం ఆదరించి మీ ఖర్చులు భరిస్తుందా, మన కుటుంబాన్ని కాపాడుతుందా, నీచముగా చూడకుండా? రామన్న, రాజన్న, జయలలిత, సావిత్రమ్మ ల ను, ఎవరు కాపాడారు? వారి అధికారం, అంతస్తు, బలగం?

నేటి మీ లాగే, రేపటి ఆ సమాజం/ వర్గం/ సర్కిల్ కూడా, ప్రశాంతము గా చూస్తూ ఉంటుంది. మరి వారి కోసం, మంచిని ప్రచారం చేయకుండా ఉంటే, ఇంకో నష్టం కూడా ఉంది.

మీ మరియు చుట్టాల మరియు స్నేహితుల, పిల్లలు మరియు మనుమలు, ఇంటెర్నెట్ లో కేవలం చెడు మాత్రమే కనుగొంటారు. మీరు మంచిని, షేర్ లైక్ కామెంట్ చెయ్యరు కాబట్టి, ఎక్కువ మందిని చేరదు. వీరు వీరు కలసినప్పుడల్లా, ఆ చెడునే చెప్పుకుంటారు, మానసికముగా అభివ్రుద్ది చేసుకుంటారు. మానసిక బలహీనులౌతారు, పతన దోవ పడతారు, తమను తాము ఏనాటికీ తెలుసుకోలేరు, మనకు అండగా ఉండరు.

ఇంక మనల్ని ముదుసలి వయస్సులో, దేవతలు గా పూజించడం అన్నది కల్ల. ఎందుకంటే, వారికి మంచి దొరకనీయకుండా చేసింది మనమే/ మీరే. మరి ఫలితాలు/ శిక్షణ ఎవరికి? మనకు లేని సంస్కారం, మన పిల్లలకు రాదు, మనమూ చెప్పలేము. మనము చెప్పినా, మనసా వాచా కర్మణా ఆచరించము కాబట్టి, మన పిల్లలు మనల్ని లెక్క చేయరు.

మనకన్నా ముందే చాలా మంది పిల్లలు, తొందరపాటులో, లోకాన్ని విడిచారు. అంటే వారి పతనానికి మొదటి కారకులు, మీరే/ మీ కుటుంబమే/ మీ వర్గమే/ మీ సర్కిలే. అంటే సమాజ పతనానికి, మన వంతు ఇటుక మన ఇంట్లో మనము వేసాము.

కాబట్టి మీ ముదుసలి తనములో మీ పిల్లలతో దేవతలు గా పూజించాలి అని మీరు ఆశపడితే, మంచిని ప్రచారం చేయాలి ప్రోత్సహించాలి పది మందికి చేర్చాలి. వద్దు అనుకుంటే, మీ ఇష్టం, ఎందుకంటే మీ భవిష్యత్ మీరు రాసుకుంటున్నారు, ఆనాడు ధర్మం మిమ్మల్ని కాపాడదు. పంచభూతాలు ఎటూ వదలవు.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2130 General Articles and views 1,956,659; 104 తత్వాలు (Tatvaalu) and views 231,097
Dt : 21-May-2023, Upd Dt : 21-May-2023, Category : General
Views : 318 ( + More Social Media views ), Id : 1754 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : hero , heroines , politics , govt , community , party , games , obsessions , shared , liked , comments , good
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content