నెల్లూరు ఆనందయ్య గారి, కరోనా ఆయుర్వేద ప్రసాద వైద్యం కు రుజువు లు ఏమిటి? - Health - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 1620 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 1655 General Articles, 61 Tatvaalu.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

ఇదో తిక్క ప్రశ్న, ఆపాలి అని దురుద్ధేశాలు తప్ప, ఇంక ఏమైనా ఉందా? ఆయన పిలిచారా? వెంటపడ్డారా? ప్రతిఫలం అడిగారా?

అందులో లాభం లేదని గంట వాదించినా, నష్టం కూడా లేదు కదా, వంద శాతం. అది మూలికల ఆహరం, ప్రసాదం. వ్యక్తి నమ్మకం ముఖ్యం.

ఇప్పుడు ప్రధాన సమస్య, జనం తండోపతండాలుగా రావడం, లేని కరోనా ఎక్కించుకునే పరిస్థితులు తెస్తూంటే, అదుపులోకి తేవడం కష్టం గా ఉంది.

పోలీసులు అధికారులు కు, ఇది పెద్ద తలనొప్పి అయింది.

ఆసుపత్రి నుంచి ఖాళీ చేసి, వందలమంది ఇటు వస్తే, ఆసుపత్రి వ్యాపార నష్టం.

ఆనందయ్య గారు మాత్రం, రోజు కు ఎంతమంది కి ఇవ్వగలరు? మనము చేయగలమా ఉచితము గా అలా?

ఇంట్లో ముందే జాగ్రత్తగా, ఆహార నియమాలు పాటించాలి అంటే, మనం చేయము. సొంతం గా ఇంట్లో వైద్యం, మనకు బద్దకం.

ధనం విసిరితే లేదా ఎవరన్నా చేసి పెడితే, క్షణంలో రోగం తగ్గిపోవాలి, బయట మన పాపం పనులు మాత్రం, ఆగకుండా చేసుకుంటూ పోవాలి, అంతే నా?

ఇప్పుడు 76 ఏళ్ల అమ్మకు, అల్లోపతి వైద్యం తో పాటుగా, సొంత ఆయుర్వేద ప్రసాద ఆహారం కూడా ఇస్తుంటే, కష్టం అయినా, కొడుకు వైద్యం నమ్మకం ఉండబట్టి, 2014 నుంచి ఇప్పుడు కు ఒక్క గ్రాము బరువు తగ్గలేదు, తేజస్సు తగ్గలేదు, బీపీ షుగరు ఉన్నా, ఒంట్లో ఓపిక లేక కర్రతో నడుస్తున్న కూడా.

ఇప్పుడు 2 ఏళ్లుగా డాక్టరు దగ్గరకు వెళ్ళలేదు, ఒక్క టెస్టు కూడా లేదు. మొన్న సంవత్సరం రక్త పరీక్ష తప్ప, అదీ వాళ్ళు పట్టబడితే ఫార్మాలిటీ కోసం.

ఇంకో కుటుంబం, మన వైద్యం, రోజు ఉండి, వాడారు, బాగుంది అన్నారు.

ఇంకొకరు ప్రాణం పోయినా, కాకర వేప తినను అన్నారు, ఇంగ్లీషు మందులు సూదులు ఖర్చు నెప్పి శ్రమ, ఓకే అన్నారు.

ఇప్పుడు, నమ్మకం లేని వారికి, నేను అమ్మ కు ఇచ్చిన, ఇంటి మందు ఇచ్చిన కూడా ప్రయోజనం ఉండదేమో. ఎందుకంటే మానసిక అంగీకారం ఉండి, భయం పోయి, నవ్వుతూ నమ్మకం తో తినాలి, ఆచరించాలి రోజూ.

పెన్సిలిన్ సూది కి, మన సంతకం తీసుకోరు. కానీ కరోనా వాక్సిన్ కు, మన సంతకం తీసుకుంటున్నారు, ఎందుకు?

అత్యవసరం గా మందు ఇది, నా ఇష్టం మీద తీసుకుంటున్నా, ఏది జరిగినా నా సొంత బాధ్యత అని, మనం అంగీకరించి సంతకం పెడుతున్నాం.

అంటే, మరి ఎవరికీ నమ్మకం లేని మందు, ఎందుకు ఇస్తున్నారు? నమ్మకం ఉంటే, మన సంతకం ఎందుకు?

మనిషి పోయిన కూడా, మరలా రోగం వచ్చిన కూడా, సైడ్ ఎఫెక్ట్ ఉన్నా కూడా, ఎవరికీ సంబంధం లేదు కదా? అవ్వా, విడ్డూరం కదూ.

అమెరికా లో, 2021 నవంబరు లో లేదా ఆ దగ్గర నెలలో, మరలా 3 వ టీకా ఇవ్వచ్చు అని అంటున్నారు. అంటే, కొత్త వైరస్లు లేదా మూడు నాలుగో (వేవ్) సారి వస్తే, మరలా మరలా టీకా లా?

అయినా ఇంకో మార్గం లేదు, ఆ మందు అందరూ టీకాలు గా తీసుకోవాలి.

మరి ఇంత నమ్మకం లేని మందుకు అందరూ అంగీకరించారు.

కాబట్టి, ఆయుర్వేద ప్రసాద వైద్యం కు కూడా, రోగితో సంతకం చేయించుకుని, ఇస్తే నష్టం ఉంటుందా? ఆయన ఉచితంగా ఇస్తున్నారు.

టీటీడీ కూడా ముందుకు వచ్చింది అంటున్నారు.

చూడండి, మా ఇంటి వైద్యం డబ్బా ఫోటో, అమ్మ కు 24 గంటలు రక్షణ గా, వాట్సప్ స్టేటస్ లో. ఇంగ్లీషు పేర్లు తప్పు ఉంటే సరిచేయండి. కల్తీ లేని పొడులు మాత్రమే వాడాలి సుమా.

పిప్పిళ్ళ పొడి long pepper, చెక్క పొడి Cinnamon, త్రిఫల చూర్ణం Triphala, మామిడి పొడి Mango powder, వేప పొడి Neem powder, ధనియ జీలకర్ర పొడి coriander jeera, మెంతి పొడి Fenugreek, ఉసిరి పొడి Amla, లవంగాలు Cloves, యాలుకలు Cardamom, ఎండు ద్రాక్ష Raisin, మిరియాల పొడి peppar, అశ్వగంధం Ashwagandha, . . .

బ్రిటిష్ వారు, ఇతరులు గతంలో, మన దేశం పైకి దండెత్తి వచ్చింది, వీటికోసమే అంటారు సుమా.

ఉచితంగా వైద్యం ఇంట్లో దొరుకుతుంది, అయినా, నిర్లక్ష్యం బద్దకం తో, శ్రమ బాధ ఖర్చు తో, నానా పాట్లు పడుతున్నాము, మూర్ఖత్వం తో సుమా.  
Author photo Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1655 General Articles, 61 Tatvaalu
Dt : 23-May-2021, Upd Dt : 23-May-2021, Category : Health
Views : 537 ( + More Social Media views ), Id : 1176 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : nellore , mutkur , krishnapatnam , anandayya , evidence , corona , covid , ayurvedic , medicine
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
ఆ టీవీ, ఈ టీవీ, మీ టీవీ, మా టీవీ, వాళ్ళ టీవీ పత్రిక - అన్ని టీవీ, పత్రిక వార్తలు వినోదం ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 10 yrs
No Ads or Spam, free Content