నెల్లూర్ ముత్తుకూరు కృష్ణపట్నం, ఆనందయ్య గారి ఉచిత ఆయుర్వేద కరోనా వైద్య విధానం - Health - లోకం తీరు/ News
           
మిగతా లోకం తీరు కూడా చదివితే మీ సందేహాలకు జవాబులు లభిస్తాయి. 2083 కధనాలు. ఇతరులతో ఈ ఆసక్తి కరమైన విషయాలను పంచుకోగలరు. 2118 General Articles and views 1,880,515; 104 తత్వాలు (Tatvaalu) and views 226,168.
Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
2 min read time.

మనము 2017 నుంచి ఇంటి వైద్యం, రోగ నిరోధక శక్తిని పెంచడం గురించి అందరికీ చెప్పాము, లింక్ ఇచ్చాము, ఇప్పుడు అయినా ఈ లింక్ లో చూడగలరు. link.

కానీ ఎవరికీ దీని విలువ పట్టలేదు, తేలిక విధానము. లాభం అందరికీ లేకపోయినా, నష్టం లేదు ఎవరికీ. ఎందుకంటే, అది ఆహారము, మందు కాదు.

ఇప్పుడు కరోనా తో, దాదాపు గా సగము దినుసులు మనము చెప్పిన వాటితో సహా, ఇంకా ఎక్కువ వేరేవి కలిపి, మందుగా తయారు చేసి నెల్లూరు కృష్ణపట్నం లో, ఓ మహానుభావుడు, ప్రజలకు ఉచితము గా ఇస్తున్నారు.

మీరు అక్కడ దాకా వెళ్ళ లేక పోయినా, బాధపడకుండా మన దాంట్లోవి కనీసము ఇప్పుడు అయినా, శాఖాహారము తో మనస్పూర్తిగా ప్రయత్నము చేసిన, అసలు కరోనా గురువు, మన జోలికి రాకపోవచ్చు, వచ్చినా తట్టుకోవచ్చును భయపడకుండా.

ధనము శ్రమ వ్రుధా చేసుకోవద్దు, అనవసరముగా తప్పుడు మందులు సూదూలతో, ధన సంపాదనే ధ్యేయముగా ఉన్న వైద్యులతో సమయం వ్రుధా వద్దు.

76 ఏళ్ళ అమ్మ ఆరోగ్యం మీకు అందరికీ తెలుసు కదా. ప్రభుత్వ కరోనా టీకాలు తప్పక తీసుకోవాలి సుమా.

కరోనా వైరస్ వలన మృత్యుముఖం దాకా వెళ్లి, నెల్లూర్ జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం, శ్రీ ఆనందయ్య గారి ఉచిత భారతీయ ఆయుర్వేద వైద్య విధానం ద్వారా, ప్రాణాలు దక్కించుకున్న వారు ఎందరో ఉన్నారు అంటున్నారు. FBlink.

ప్రభుత్వ అధికారులు కూడా, దానిని పరీక్షించారు అని, వార్తలు విన్నారు కదూ. సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు కూడా పాల్గొంటున్నారు పంపణీలో అంటున్నారు. మెడికల్ మాఫియా దానిని ఆపాలని ప్రయత్నము చేస్తున్నారు అని కూడా పుకార్లు.

అయితే, అందరూ గుంపుగా వెళ్ళి అక్కడ ఇబ్బంది కలిగిస్తే, ప్రభుత్వము కూడా ఆపుతుంది, జనాన్ని అదుపు చేయలేక.

ప్రకృతిపరంగా దొరికే సహజసిద్ధమైన వస్తువులతో, తయారు చేసే ఆయుర్వేద మందు పట్ల ఎటువంటి హానీ ఉండదు. మనకు ఉచితము గా తేలికగా వచ్చేది అంటే, విలువ తక్కువ.

ఆసుపత్రిలో లక్షలు ఖర్చు పెట్టి కూడా, ప్రయోజనము లేకపోతే, ఏమీ చేయలేము కదూ. అప్పుడు ఆనుతుంది మనకు.

ఆక్సిజన్ లెవల్స్ 83 నుంచి కేవలం గంటలో 95 పెంచిన కృష్ణపట్నం ఆనందయ్య గారు. ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యపోయిన, డాక్టర్ల బృందం.

కరోనా టీకా కు కూడా, మనతో, ఏమి జరిగినా, అంతా మనదే బాధ్యత అని సంతకము తీసుకుని, అత్యవసర మందు గా ఇస్తున్నారు. మరి ఆనందయ్య కూడా, ఇది ఆహార ప్రసాదము అని, సంతకము తీసుకుని, ఇచ్చిన ప్రమాదము ఉండదు అని కొందరి అభిప్రాయము.

అది ఆయుర్వెదం లేదా మన ఇంటి వైద్యం మహాత్యం. వారు వాడిన దినుసులు కొన్ని చూడండి,

తెల్ల జిల్లేడు, మారేడు ఇగురు, నేరేడు ఇగురు, వేప ఇగురు, దేవర్ దంగి (ఆడ మగ), నల్ల జీలకర్ర, పట్టా, పసుపు, తోక మిరియాలు, పచ్చ కర్పూరం, పిరంగి చెక్క పొడలు మరియు తేనె, జాజికాయ, పిప్పిల్లు, పసుపు, ముళ్ళ వంకాయ గుజ్జు.

ఇప్పుడు అయినా, ఇంట్లో మన సొంత నిష్ట నియమాలతో, అమ్మ లేదా భార్య చేతి తో తయారు చేసిన, మన ఇంట్లో వస్తువులతో, నమ్మకమైన రోగ నిరోధక శక్తిని పెంచుకుందాము, ఆరోగ్యముగా ఉందాము, ధనం భవిష్యత్ కోసం పొదుపు చేద్దాం, నీతి నిజాయితీ తో సనాతన ధర్మ భారతీయులు గా ఉందాము.  
Author photo Sri, Telugu , 15+ yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 840+ Foreign and local events/ places coverage, 2118 General Articles and views 1,880,515; 104 తత్వాలు (Tatvaalu) and views 226,168
Dt : 21-May-2021, Upd Dt : 21-May-2021, Category : Health
Views : 1036 ( + More Social Media views ), Id : 1175 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags : nellore , muthukur , krishnapatnam , anandayya , corona , kovid , ayurvedic , medicine , policy
Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది.

Share
NRI , అమెరికాలో లేదా విదేశం లో ఉంటారా, అయినా USA వార్తలూ ఇక్కడే
Facebook Comments
All best news at one place for NRIs
Multiple source NEWS from 11 yrs
No Ads or Spam, free Content