Auto news updates for EAST and WEST in English/ Hindi/ Telugu along with TV, Radio, Newspaper, Newsbites
చివరలో ఉన్న చిత్రం/ వీడియో/ ఆడియో మరువద్దు. 1 min read time. మీ కన్నా 100 శాతం పాపాత్ముడిని, అసలు గాత్రం బాగోని, మేమే ఇన్ని ప్రయత్నాలు చేస్తుంటే, మీ అజ్ఞాన శిష్యులుగా, మరి మీరు పుణ్యాత్ములుగా, ఎందుకు ప్రతి వారం, ఏదో ఒక సేవ త్యాగం ప్రయత్నం సాధన చెప్పలేకపోతున్నారు? మరి అలాంటి గురువుల చేతిలో పెరుగుతున్న పిల్లల మానసిక పరిస్థితి ఏమిటి, భవిష్యత్ బాధలు ఎలా తట్టుకుంటారు?
ఒకవేళ మనము మంచి కూడా దాస్తుంటే, ఇంక మన పూజకు ఫలితం ఎలావస్తుంది, అందరమూ దేవుని సంతానం అని మీరు నమ్మకుండా, ఆత్మబంధువులమని అంగీకరించకుండా, పరమాత్మతో ఎలా అనుసంధానం అవుతారు? మీరు మాతో మాట్లాడుతున్నారు అంటే, మీ లోన ఉండే మీ ఆత్మతో మాట్లాడే ధైర్యం, సంస్కార పెంపక ఆచరణ, ఉంటేనే మాట్లాడగలరు సుమా.
లేదంటే, పరాయి వారి లాగా కనపడతాము. క్రిష్ణయ్యను, దుర్యోధనుడు అలాగే పరాయి వ్యక్తి గా చూసారు. తనను మోహము నుంచి రక్షించవస్తే, దూషించాడు, దూరముగా వెళ్ళాడు. సైన్య విభజనలో కూడా, క్రిష్ణయ్యను తన వైపు వద్దు అన్నారు.
శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, సింహాచలం అనే గ్రామంలో విశాఖపట్టణానికి నకు 11 కి.మీ. దూరంలో తూర్పు కనుమలలో పర్వతంపైన ఉంది. సింహాద్రి అప్పన్న గా పిలుస్తారు. ఈ దేవాలయం సముద్రమట్టానికి 244 మీ ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంది. ఒక్కసారి చిన్నప్పుడు వెళ్ళాను. విదేశాలలో ఎన్నో ఊళ్ళు తిరిగినా, మన తెలుగు నేలపై ఎన్నో జిల్లాలు చూడాలి, కడప, అనంతపురం, వేములవాడ, శ్రీశైలం, ఎప్పుడు ఉందో దేవుని ఆజ్ఞ.
ఇది దక్షిణ భారతదేశంలోని, ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో, ఒకటి. తిరుపతి తర్వాత, అత్యధిక ఆదాయం (52 కోట్ల రూపాయలు) కలిగిన దేవాలయం. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతీ సంవత్సరం వైశాఖ మాసం శుద్ధ తదియ నాడు (మే నెలలో) వస్తుంది.
సింహాచలం చరిత్ర ఆధారాలతో సహా పదకొండవ శతాబ్దం వరకు కనిపిస్తుంది. కాని భారత ఇతిహాసాల ప్రకారం ఇది ఇంకా పురాతనమైనదై ఉండవచ్చు. ఇతిహాసం ప్రకారం రాక్షస రాజు హిరణ్యకశిపుడు విష్ణువుకు బద్ధవైరి. తన కుమారుడైన ప్రహ్లాదుడిని పుట్టుకతోనే విష్ణు భక్తుడు.
తండ్రి తప్పులను ధైర్యముగా ఎత్తి చూపాడు. అవి నేను ఆచరించను అన్నాడు. హింస అధికారం ఆధిపత్యం మోసం, తప్పు అని, తండ్రికే బుద్ది చెప్పాడు. ఎదిరించి నిలబడ్డాడు. తండ్రి ఎన్ని ముప్ప తిప్పలు పెట్టి చంపడానికి చూసినా, మంచి మార్గం విడువలేదు.
మరి ఈ రోజున, మన తల్లి తండ్రి ల తప్పులను, ధైర్యముగా ఎత్తి చూపి సరి చేసే వారు ఎవరు? నాయకులు తప్పులు చేస్తుంటే, వారి పిల్లలు కూడా దానినే అనుసరిస్తూ, తమ వక్ర బుద్ది చూపించి, పతనం అవుతున్నారు. దొంగ వ్యాపారాలు చేసే వారి పిల్లలు కూడా, ఇది తప్పు వద్దు మనకు అని చెప్పరు. టాక్స్ లు ఎగకొడుతున్నా, ఇతరుల ఆస్తులు దోస్తున్నా, ఇది తప్పు నాన్నా అని చెప్పరు. ఇంక వారి పూజలకు విలువ ఉంటుందా? అరిషడ్వర్గాలను జయిస్తారా?
హిరణ్యకశిపుడు, విష్ణువు సర్వవ్యాప్తమని చెబుతున్నావు కదా, ఏడీ ఈ స్తంభంలో ఉన్నాడా? చూపించుమని స్తంభాన్ని పగలగొట్టగా, విష్ణువు నరసింహస్వామిగా స్తంభాన్ని చీల్చుకొనివచ్చి, హిరణ్యకశిపుని సంహరించి, ప్రహ్లాదుడిని రక్షించాడు.
స్థలపురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటగా వరాహనరసింహ స్వామి విగ్రహన్ని ఆరాదించాడు. స్వామిలోని వేడిని చల్లార్చడానికి చందనంతో పూత పూస్తుంటారు. వరాహం నరుడు, సింహం రూపాలు కలిసిన ఈ నరసింహుని అవతార నిజరూపం త్రిభంగ ముద్రలో (ఆసనంలో) వరాహం తల, సింహం తోక, కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది. మిగిలిన సమయంలో చందనం కప్పబడి లింగాకృతిలో స్వామివారి నిత్యరూపం ఉంటుంది.
చూడండి మనము, మీకు పాటలు పాడే ధైర్యం కలిగించాలని మొదలు పెట్టిన కార్యక్రమం, పాత సినిమా మంచి పాటలను పదిమందికి, మరలా గుర్తు చేయడానికి ఉపయోగపడింది. సిమ్హాద్రి అప్పన్న, 3 రూపాలు అని కూడా, మనకు సరిగ్గా తెలీదు. నరసిమ్హస్వామి అని మాత్రమే తెలుసు. ఇప్పుడు వివరణ దొరికింది. మీరు ప్రయత్నం చేస్తారు కదూ.
1)
భక్త శిఖామణి, ప్రహ్లా.దు కరుణించి, ఆవిర్భవించిన ఆది దేవా.
వరకల్పవల్లివై, వసుధలో వెలసిన, రమణీయ రూప, వరాహ వదనా.
దుష్ట విశిక్షణా, శిష్ట సమ్రక్షణా, ఇంద్రాది వినుత, సిమ్హేంద్ర మధ్యా...
అనురూప, బహురూప, అఖిల లోకాధార, ధీరమోహన, అవతార పురుషా.
ఆశ్రయించిన భక్తుల, ఆర్తి దీర్చి, పూజ చేసేడి వారికి, ముక్తినిచ్చి
దయతొ కాపాడునట్టి, ఓ.. ద్వయ స్వరూప, సిమ్హగిరివాస, వరహ న్రుసిమ్హ దేవా .. .
2) సింహాచల మహత్యం
సింహాచలము, మహా పుణ్యక్షేత్రము 2
శ్రీ వరాహ నరసింహుని దివ్య ధామము ||సింహాచలము||
ప్రహ్లాదుడు వేడగా, శ్రీహరి కరుణించగా 2
ద్వయరూపాలొకటిగా .. ఆ ఆ 2 యుగ యుగాల గురుతుగా
ఆశ్రితులను కావగా, వెలసిన హరి నిలయము ||సింహాచలము||
ఏచోటను విన్నా, హరినామ స్మరణమే..
హరిహరి న్నారాయణా ఆ, ఆదినారాయణా, కరుణించి మమ్మేలు కమలలోచనుడా
హరిహరిన్నారాయణా ఆదినారాయణా, కరుణించి మమ్మేలు కమలలోచనుడా 2
ఏచోటను కన్నా భక్తుల సందోహమే, ఏనోటను విన్నా హరినామ స్మరణమే
పాపాలను హరియించే, దైవ సన్నిధానము ||సింహాచలము||
మ్రొక్కులను ముడుపూలను, చెల్లించె వారికి
నీవే దిక్కని నమ్మి, కొలిచేటివారికి
ఇహ పరములు సమకూర్చే, భగవానుని నిలయము ||సింహాచలము||
Bhakta sikhamani prahladu karuninnci, simhachalamu maha punyakshetramu - sri simhachala kshetra mahima
Sri, Telugu , 10 yrs Journalist/ Photo/ Video/ Edit/ Field/ Publish. 828 Foreign events/ places coverage, 1801 General Articles and views 1,394,154; 94 తత్వాలు (Tatvaalu) and views 184,774 Dt : 22-May-2022, Upd Dt : 22-May-2022, Category : Songs
Views : 318
( + More Social Media views ), Id : 1399 , State : Andhra/ Telangana (Telugu) , Country : India
Tags :
bhakta ,
prahladu ,
simhachalamu ,
punyakshetramu ,
mahima ,
varaha ,
lakshmi ,
chandana ,
vijag Note : ఎవరు ఏ విషయాలు చెప్పినా, అది వారి వ్యక్తిగత అభిప్రాయమో లేక అనుభవమో లేక పెద్దల నుంచి విన్నవో. అందరూ ఏకీభవించాలని లేదు. మీ యోచనతో లేదా పెద్దల సలహాలతో, మంచి చెడు నిర్ణయించుకొనగలరు. Whatever you are reading here is their opinion or experience or heard from elders. Everyone may not agree. Please consult your elders and decide whether it is good or bad.
ఆత్మ వంచన కాపీ వద్దు, ఫార్వార్డ్ ముద్దు. స్వార్థం నిర్లక్ష్యం వదిలి, భారతీయ విలువల, మంచిని పంచిన పెంచిన పుణ్యం.
మా సామాజిక చైతన్య సమాచారం లో తప్పులు ఉంటే మన్నించి, బాధ్యత గల పౌరునిగా, మంచిని పెంచే, ఆదర్శ వ్యక్తి గా, సరిచేసి సూచించగలరు.
మాతృమూర్తి మాతృభాషను గౌరవించి, తెలుగు లో సొంతం గా 2 మాటలు రాయడం, కనీసం మమ్మల్ని తిట్టేందుకు అయినా. ధర్మాన్ని రక్షించిన, అది మనల్ని కాపాడుతుంది. తెలుగు మీడియాను నమ్మరా, ఆంగ్ల హిందీ మీడియాను నమ్ముతారా? పర్లేదు, వాటినీ ఇక్కడే చూడొచ్చు
Facebook Comments